news

News February 3, 2025

మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ సూపర్ హిట్

image

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘గోదావరి’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించగా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. మూవీలోని ‘సీతా మహాలక్ష్మి’ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘గోదావరి’ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారా? లేదా? కామెంట్ చేయండి.

News February 3, 2025

17% పెరిగిన జీఎస్టీ ఆదాయం

image

తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.

News February 3, 2025

APకి రూ.9,417కోట్లు, TGకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్

image

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ‘తెలంగాణకు రూ.5,337cr, APకి రికార్డు స్థాయిలో రూ.9,417cr కేటాయించాం. తెలంగాణ వ్యాప్తంగా 1,326KM కవచ్ టెక్నాలజీ పని చేస్తోంది. APకి UPA హయాంలో కంటే 11రెట్లు ఎక్కువ కేటాయించాం. APలో 73రైల్వే‌స్టేషన్ల అభివృద్ధికి నిధులిచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. రూ.8,455cr విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశాం’ అని అన్నారు.

News February 3, 2025

తండ్రిని రెండు ముక్కలు చేయాలనుకున్నారు!

image

తండ్రికి అంత్యక్రియలు చేసేందుకు ఆ ఇద్దరు కొడుకులు పోటీ పడ్డారు. ఈక్రమంలో మృతదేహాన్ని గంటల తరబడి ఇంటి బయటే వదిలేశారు. చివరికి శవాన్ని 2 ముక్కలు చేసి చెరో ముక్కకు ఇద్దరు అంత్యక్రియలు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఆ నిర్ణయం విని హడలిపోయిన స్థానికులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు పెద్ద కొడుక్కి కర్మకాండ బాధ్యతల్ని అప్పగించారు. MPలోని టీకమ్‌ గఢ్ జిల్లా తాల్ లిధోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

News February 3, 2025

నా కెరీర్‌లో కొట్టిన సిక్సర్లు ఒక్క ఇన్నింగ్సులోనే బ్రేక్: కుక్

image

భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ అలిస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారు. తన టెస్టు కెరీర్‌ మొత్తంలో కొట్టిన సిక్సర్లను అభిషేక్ రెండు గంటల్లోనే బ్రేక్ చేశాడని అన్నారు. కుక్ 161 టెస్టుల్లో 11 సిక్సర్లు బాదగా 92 వన్డేల్లో 10 సిక్సర్లు బాదారు. నిన్నటి మ్యాచులో అభిషేక్ 13 సిక్సర్లతో 135 పరుగులు బాదారు. దీంతో భారత తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గానూ నిలిచిన సంగతి తెలిసిందే.

News February 3, 2025

సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్: అశ్వినీ వైష్ణవ్

image

TG: కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు. ‘సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో 1,026 కి.మీ. మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రం నుంచి 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని చెప్పారు.

News February 3, 2025

ప్రభాస్ ‘కన్నప్ప’ లుక్‌పై ట్రోల్స్

image

కన్పప్పలో ప్రభాస్ లుక్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ లుక్ ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున లుక్‌ను పోలి ఉందని పలువురు పోస్టులు చేస్తున్నారు. విగ్ సెట్ అవలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా లుక్‌పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్‌పై మీ కామెంట్?

News February 3, 2025

పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు: రోజా

image

AP: కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘కూటమి నేతల అరాచకాల్ని ఖండిస్తున్నాం. తిరుపతిలో మేయర్ ఎన్నిక సందర్భంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.

News February 3, 2025

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

image

ఇంగ్లండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించిన టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ అరుదైన జాబితాలో చేరారు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేయడంతో పాటు రెండు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా శర్మ చరిత్ర సృష్టించారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇంగ్లండ్ జట్టుపై 103 పరుగులతో పాటు మూడు వికెట్లు తీశారు. శర్మ కూడా ఇంగ్లండ్‌పై 135 రన్స్ చేసి 2 వికెట్లు పడగొట్టారు.

News February 3, 2025

నిరుద్యోగం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమే: రాహుల్

image

దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ‘మనం వేగంగానే ఎదుగుతున్నా ఓ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. UPA, NDA రెండూ దేశంలోని నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయాయి. అద్భుతమైన కంపెనీలన్నీ ఇక్కడి నుంచి చైనాకు వెళ్లిపోయాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు.