news

News February 4, 2025

శుభ ముహూర్తం(04-02-2025)

image

✒ తిథి: శుక్ల షష్ఠి ఉ.7.53 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.12.52 వరకు
✒ శుభ సమయం: సా.4.22 నుంచి 5.22 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా.9.15 నుంచి 10.45 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.55 -రా.7.24 వరకు

News February 4, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: భారత్‌వైపే ప్రపంచ దేశాల చూపు: CM CBN
* ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువు పొడిగింపు: లోకేశ్
* పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది: బాలకృష్ణ
* TG: కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం
* కులగణన నివేదిక ఫేక్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
* తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ

News February 4, 2025

అప్పుడు రోహిత్.. ఇప్పుడు త్రిష

image

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో పడుకున్న ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో అండర్-19 WC గెలుచుకున్నాక త్రిష కప్ పట్టుకొని పడుకున్న ఫొటోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. దీంతో పాటు 2024లో సెలబ్రేషన్స్ ఫొటోలను ఇతర ఫొటోలతో పోల్చింది. అప్పటి రోహిత్ సెలబ్రేషన్స్‌ను ఇప్పుడు త్రిష రీక్రియేట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News February 4, 2025

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

AP: రేపు రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.

News February 4, 2025

ఈ రికార్డు తెలుసా? 64 రోజుల పాటు గాల్లోనే విమానం

image

ఓ విమానం గాలిలో ఎంత సేపు ఉంటుంది. మహా అంటే 12-24 గంటలు. కానీ, రాబర్ట్ టిమ్ & జాన్ కుక్ అనే ఇద్దరు పైలెట్లు 1959లో 64 రోజుల 22 గంటల 19 నిమిషాల పాటు విమానాన్ని లాస్ వెగాస్ మీదుగా నడిపి రికార్డు సృష్టించారు. ఇంధనం అయిపోకుండా ఉండేందుకు ఓ ట్రక్కుతో పైపు లైన్ ద్వారా అందిస్తూ విమానాన్ని నిరంతరంగా నడిపించారు. US ఆర్మీ ఈ రికార్డు బ్రేక్ చేసేందుకు ప్రయత్నించగా 64 రోజుల 18గంటల వద్ద విమానం కుప్పకూలింది.

News February 4, 2025

EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం

image

TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.

News February 4, 2025

కిడ్నీలలో రాళ్లు చేరకూడదంటే..

image

*రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
*ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.
*కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
*బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
*ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లొద్దు.

News February 3, 2025

ప్రైవేట్ స్కూళ్లపై మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం

image

AP: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. వాటి గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాల సమావేశంలో వివరించారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని వారితో అన్నట్లు ట్వీట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.

News February 3, 2025

సంజూకు గాయం.. 6 వారాలు ఆటకు దూరం!

image

ఇంగ్లండ్‌తో 5వ టీ20లో ఆర్చర్ వేసిన బంతి సంజూ శాంసన్ చూపుడు వేలికి తగిలి గాయమైన విషయం తెలిసిందే. నొప్పితో అతను వికెట్ కీపింగ్‌కు కూడా రాలేదు. కాగా, శాంసన్ వేలికి ఫ్రాక్చర్ అయిందని 4-6 వారాల పాటు బ్యాట్ పట్టలేరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకొని నేరుగా మార్చిలో ప్రారంభమయ్యే IPL ఆడొచ్చని పేర్కొన్నాయి. సంజూ ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.

News February 3, 2025

ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా?: MLC కవిత

image

BCల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని, గతంతో పోల్చితే వారి జనాభా ఎలా తగ్గుతుందని MLC కవిత విమర్శించారు. ‘TGలో ఏ లెక్కన చూసినా 50-52% BCలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరం. సకల జనుల సర్వేకు, ఇప్పటి సర్వేకు 21 లక్షల BC జనాభా తేడా కనిపిస్తోంది. OCల జనాభా ఎక్కువ కనిపిస్తోంది. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీల, SC, ST జనాభా తగ్గుతుందా?’ అని ప్రశ్నించారు.