news

News August 14, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

image

TG: గవర్నర్ కోటా MLCల నియామకంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగా MLCలను నియమించకుండా స్టే విధించాలన్న BRS నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్లను తిరస్కరించింది. కొత్త MLCల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుందని విచారణ సందర్భంగా జస్టిస్ విక్రంనాథ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News August 14, 2024

‘ధరణి’లో ఆపరేటర్లుగా వారికి ఛాన్స్?

image

TG: ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ చదివిన వారిని పోటీ పరీక్షల ద్వారా నియమించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రస్తుతం పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా? వద్దా? అనేది త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

News August 14, 2024

జగన్&కో దురాగతాలకు పాల్పడుతున్నారు: లోకేశ్

image

AP: కర్నూలు(D) హోసూరులో జరిగిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులు <<13847578>>హత్యను<<>> మంత్రి లోకేశ్ ఖండించారు. ‘ఎన్నికల్లో TDP తరఫున పనిచేశాడనే కక్షతో YCP మూకలు శ్రీనివాసులును హతమార్చాయి. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్&కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. శ్రీనివాసులు కుటుంబానికి అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

News August 14, 2024

టెట్ రాసిన వారికి ALERT

image

TG: టెట్ రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఇందుకోసం ఈనెల 20వ తేదీ సా.5 గంటలలోపు helpdesktsdsc2024@gmail.comకు ఈ-మెయిల్ పంపాలని తెలిపింది. అలాగే డీఎస్సీ ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఈనెల 20 సా.5గంటల వరకు <>https://schooledu.telangana.gov.in<<>> వెబ్‌సైట్‌కు పంపొచ్చని పేర్కొంది.

News August 14, 2024

ట్రోలర్స్‌పై సైనా నెహ్వాల్ ఆగ్రహం

image

జావెలిన్ త్రో ఒలింపిక్ క్రీడ అని నీరజ్ స్వర్ణం గెలిచేవరకూ తెలీదని బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై నెట్టింట ట్రోలింగ్‌ జరుగుతోంది. దీంతో సైనా తన ట్విటర్‌లో స్పందించారు. ‘నేను నా క్రీడలో అగ్రస్థానానికి చేరుకున్నా. దేశానికి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చా. వాటి పట్ల గర్వంగా ఉన్నాను. ఇంట్లో కూర్చుని చెప్పడం సులువే. బయటికొచ్చి ఆడితే తెలుస్తుంది’ అని ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

News August 14, 2024

ఇది మనం ప్రామిస్ చేయాల్సిన రోజు: మోదీ

image

దేశాన్ని ముక్కలు చేయడం వల్ల లెక్కలేనంత మంది బాధితులుగా మారారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ విభజన గాయాల స్మృతి దినాన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది వారి ధైర్యసాహసాలకు నివాళులు అర్పించాల్సిన రోజన్నారు. ‘విభజన తర్వాత ఎందరో తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. విజయవంతం అయ్యారు. మన జాతి ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకుంటామని మనం ఈ రోజు పునరుద్ఘాటించాలి’ అని ఆయన Xలో పిలుపునిచ్చారు.

News August 14, 2024

REWIND: సచిన్ తొలి సెంచరీ చేసిన రోజు

image

క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట 100 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. ఎన్ని శతకాలున్నా తొలి సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ తొలి సెంచరీని ఆయన 1990, ఆగస్టు 14న ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చేశారు. సరిగ్గా 34 ఏళ్ల క్రితం జరిగిన ఆ మ్యాచ్‌లో 119 పరుగులతో అజేయంగా నిలిచి అప్పటికి టెస్టు సెంచరీ చేసిన రెండో అతి చిన్న ఆటగాడిగా(17 ఏళ్లు) చరిత్ర సృష్టించారు.

News August 14, 2024

ప్రభాస్ ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..

image

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. ఈ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. దీనికోసం ఎదురుచూస్తున్నామంటూ ఫిల్మ్‌ఫేర్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేయడంతో రెబల్ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. మూవీలో డార్లింగ్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. మృణాల్ ఠాకూర్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు.

News August 14, 2024

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జూడాల నిరసన

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తదితర ప్రధాన నగరాల్లో విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు. HYD గాంధీ ఆసుపత్రి, మంగళగిరి ఎయిమ్స్‌లో జూడాలు ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు. రేప్ నిందితుడిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో డాక్టర్లకు భద్రత కల్పించాలని నినాదాలు చేస్తున్నారు.

News August 14, 2024

హై అలర్ట్: ఢిల్లీ, పంజాబ్‌లో దాడులకు ఆస్కారం

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. కథువా సరిహద్దు గ్రామంలో ఆయుధాలతో ఇద్దరు ముష్కరుల కదలికలను పసిగట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వారు పఠాన్‌కోట్‌ చేరుకోవడాన్ని కొట్టిపారేయలేమని, ఆగస్టు 15 లేదా 16, 17 తేదీల్లో ఢిల్లీ, పంజాబ్‌లో దాడులకు తెగబడొచ్చని ఏజెన్సీల అనుమానం. జూన్ 1నే పేలుడు పదార్థాలతో కూడిన ఓ కన్‌సైన్‌మెంట్ జమ్మూ నగరంలోకి రావడం గమనార్హం.

error: Content is protected !!