news

News April 14, 2025

‘నిన్ను ఇంట్లోనే చంపుతాం’.. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. ‘సల్మాన్.. నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం’ అని వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఈ నంబర్ ముంబై వర్లీలోని రవాణా శాఖ పేరు మీద ఉంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

News April 14, 2025

BREAKING: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

image

TG: ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది.

News April 14, 2025

‘బ్లూ ఆరిజన్’ మిషన్.. నేడు అంతరిక్షంలోకి మహిళల బృందం

image

జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజన్’ సంస్థ ఇవాళ న్యూ షెపర్డ్ రాకెట్‌లో ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపనుంది. టెక్సాస్ నుంచి రా.7 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న ఈ రాకెట్‌లో బెజోస్ ప్రేయసి లారెన్, పాప్ సింగర్ కేటీ పెర్రీ సహా మరో నలుగురు మహిళలు వెళ్లనున్నారు. భూమికి, అంతరిక్షానికి మధ్యనున్న కర్మన్ రేఖను దాటి వెళ్లి జీరో గ్రావిటీని అనుభవిస్తారు. అక్కడి నుంచి భూమిని వీక్షిస్తారు. ఈ మిషన్ 11min పాటు సాగనుంది.

News April 14, 2025

ఫేక్ పోస్టులు చేస్తే జైలుకే: టీ కాంగ్రెస్

image

TG: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, నకిలీ రాతలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అసభ్యకర కంటెంట్‌పై పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టారని తెలిపింది. ఎవరైనా బూతు కామెంట్లు, ఫేక్ పోస్టులు చేస్తే జైలుకు వెళ్తారని హెచ్చరించింది. ఇక నుంచి సోషల్ మీడియా క్లీన్‌గా ఉంటుందని పేర్కొంది. కాగా HCUపై సోషల్ మీడియాలో చేసిన 50కి పైగా ఫేక్ పోస్టులను ఇప్పటికే తొలగించినట్లు సమాచారం.

News April 14, 2025

రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

image

గుజరాత్ తీరంలో 300KGల డ్రగ్స్‌ను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ ₹1,800Cr ఉంటుందని అంచనా. ఈ నెల 12-13న రాత్రి అనుమానాస్పద బోట్ కనిపించడంతో అధికారులు అక్కడికెళ్లారు. దీంతో దుండగులు డ్రగ్స్‌ మూటలను సముద్రంలో పడేసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది నీళ్లలో మునిగిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ATS, నేవీ దళం సంయుక్త ఆపరేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

News April 14, 2025

5 రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర

image

రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు 5 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.87,550కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గి రూ.95,510 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,900గా ఉంది.

News April 14, 2025

మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు

image

ఐటీ కంపెనీలు, కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు మరోసారి వరుసగా సెలవులు రానున్నాయి. ఈ శుక్రవారం గుడ్‌ఫ్రైడే హాలిడే కాగా శని, ఆదివారాలు రెగ్యులర్ వీకెండ్ సెలవులు. ఇప్పటికే గత శనివారం మొదలుకుని ఇవాళ్టి వరకు పలు సంస్థలకు సెలవులున్నాయి. మరో మూడు రోజులు పనిచేస్తే తర్వాత మళ్లీ లాంగ్ వీకెండ్ బ్రేక్ అన్నమాట.

News April 14, 2025

పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

TG: సంబంధాలు కుదరక పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. జనగామ (D) కొడకండ్ల (M) నీలిబండతండాకు చెందిన గగులోత్ నీల(26)కు 2020లో AR కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వరంగల్‌లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో తమ కూతురు సూసైడ్ చేసుకున్నట్లు నీల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 14, 2025

అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రజా ప్రభుత్వం: CM రేవంత్

image

TG: అంబేడ్కర్ జయంతి సందర్భంగా CM రేవంత్ నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో తమ ప్రభుత్వం ఎన్నో అడుగులు వేసిందని ట్వీట్ చేశారు. SC వర్గీకరణ, బడుగు- బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టరూపం, యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య, ఇందిరమ్మ భరోసా పథకం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతికి శ్రీకారం వంటివి ఉదాహరణగా చెప్పారు.

News April 14, 2025

ట్రంప్ హత్య కోసం తల్లిదండ్రులను చంపేశాడు!

image

US విస్కాన్సిన్‌లో కసాప్(17) అనే కుర్రాడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు డబ్బు కోసం కన్నతల్లి, సవతి తండ్రిని కాల్చి చంపినట్లు FBI వెల్లడించింది. FEB 11న హత్యలు చేయగా.. తాజాగా ఈ కుట్రకోణం వెలుగు చూసింది. మారణకాండ సృష్టించేందుకు డ్రోన్, పేలుడు పదార్థాలు కొనే ప్రయత్నాలూ చేశాడట. రష్యాలోని ఓ వ్యక్తితో టచ్‌లో ఉన్నాడని.. అతని ఫోన్లో హిట్లర్ ఫొటోలు, జాతి విద్వేష భావజాలాన్ని గుర్తించినట్లు తెలిపింది.