news

News August 13, 2024

ప్రతి విద్యార్థికి ఐడీ కార్డు ఇవ్వాలి: CBN

image

AP: విద్య ప్రతి ఒక్కరి హక్కు అని బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదని అధికారులకు CM చంద్రబాబు స్పష్టం చేశారు. 100% విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరగాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన APAAR ద్వారా ప్రతి విద్యార్థికి ID కార్డు ఇవ్వాలన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

News August 13, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, ప.గో, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

News August 13, 2024

232 రోజులు పెరోల్ మీద ఉన్నాడు!

image

రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ 2022 జూన్ నుంచి ఇప్ప‌టిదాకా 232 రోజులు పెరోల్ మీద ఉండ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. 2022లో 70 రోజులు, 2023లో 91 రోజులు, ఈ ఏడాది 71 రోజులు క‌లుపుకొని మొత్తంగా 232 రోజులు పెరోల్‌పై ఉన్నాడు. ఇది హ‌రియాణా ప్ర‌భుత్వ‌ నిర్ణయం అని, దీనికీ న్యాయవ్యవస్థకు సంబంధం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News August 13, 2024

హీరోయిన్‌కు లేని ప్రాబ్లం మీకేంటి?: హరీశ్ శంకర్

image

‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఏజ్ గ్యాప్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వయస్సు, మిగతావి అన్నీ చూసుకోవాలి. ఇది సినిమా. హీరోకు స్క్రీన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సినిమాకు ఒప్పుకునే అమ్మాయి(హీరోయిన్)కే సమస్య లేనప్పుడు, మీకేంటి ప్రాబ్లం?’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News August 13, 2024

ఈ కాలర్ ట్యూన్ వస్తోందా?

image

‘హర్ ఘర్ తిరంగా-3’లో భాగంగా పౌరులు తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, పౌరులకు ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసేందుకు కేంద్రం కాలర్ ట్యూన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ‘హర్ ఘర్ తిరంగా’ గురించి మోదీ వాయిస్ వినిపిస్తోంది. కొంతమందికి రావట్లేదు. మీకూ ఇలా కాలర్ ట్యూన్ వస్తోందా? కామెంట్ చేయండి.

News August 13, 2024

8,326 ఉద్యోగాల భర్తీపై UPDATE

image

8,326 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీపై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు SSC వెబ్‌సైటును చూడాలని కోరింది. కాగా గత నెల 31తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే.

News August 13, 2024

రెవెన్యూ సదస్సులు వాయిదా: మంత్రి

image

AP: ఈ నెల 16 నుంచి నిర్వహించాల్సిన రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వీటిని నిర్వహిస్తామని వెల్లడించారు. పాత అధికారులతోనే నిర్వహిస్తే సరైన ఫలితాలు రావన్నారు. ఇందులో భూ వివాదాలు, రీసర్వేలో జరిగిన తప్పిదాలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, 45 రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.

News August 13, 2024

రేపు రాష్ట్ర వ్యాప్తంగా OPలు బంద్: జూడాలు

image

తెలంగాణ వ్యాప్తంగా రేపు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్‌కతాలో జూ.డాక్టర్ <<13831962>>హత్యాచార <<>>ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందించారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

News August 13, 2024

సరిహద్దుల్లో BSF కొత్త వ్యూహం

image

భారత్ – బంగ్లా స‌రిహ‌ద్దుల్లో అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను నివారించడానికి బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ స్థానిక ప్ర‌జ‌ల స‌హ‌కారం తీసుకుంటోంది. బంగ్లా సంక్షోభం త‌రువాత అక్క‌డి నుంచి వ‌ల‌స‌లు ఎక్కువ కావడంతో BSF ఈ నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ స‌మ‌న్వ‌య స‌మావేశం పేరుతో స్థానికులతో స‌మావేశ‌మై వ‌ల‌స‌ల నివార‌ణ‌కు అందించాల్సిన సహకారం గురించి అధికారులు వారికి వివ‌రించి చెబుతున్నారు.

News August 13, 2024

100 అన్న క్యాంటీన్లు ఇక్కడే

image

AP: ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. MLC ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో 33 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రారంభించే ఈ క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మీ జిల్లాలో క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!