India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుకల్లో జెండా ఎగురవేయడానికి హోం మంత్రి కైలాశ్ గహ్లోత్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అవకాశం ఇచ్చారు. మంత్రి ఆతిశీ జెండా ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన అదేశాలకు జీఏడీ అడ్డుచెప్పడంతో ఈ విషయంలో గందరగోళం నెలకొంది. తాజాగా హోం మంత్రిని నామినేట్ చేస్తూ ఎల్జీ ఆదేశాలిచ్చారు.
AP: ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపనుంది.
తన రాజీనామా వెనుక అమెరికా హస్తం ఉందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించినట్టుగా వస్తున్న కథనాలను ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ కొట్టిపారేశారు. దీనిపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. ఇక రాజకీయ ఆశ్రయంపై వచ్చిన కథనాల్లోనూ వాస్తవం లేదన్నారు. తన తల్లి వీసాను ఎవరూ రద్దు చేయలేదని, రాజకీయ ఆశ్రయం కోసం అమె ఎక్కడా దరఖాస్తు చేయలేదని వివరించారు.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల కీ విడుదలైంది. వెబ్‌సైటులో కీతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. కాగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి. కీ కోసం ఇక్కడ <
పై ఫొటోలో ఉన్నది ఇంగ్లండ్‌లోనే అత్యంత పురాతనమైన చెక్క తలుపు. వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే చర్చిలో 1066లో దీన్ని అమర్చారు. అప్పటి నుంచి నేటి వరకు ఎంతోమంది బ్రిటన్ చక్రవర్తుల చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి ఉంది. 750 ఏళ్ల క్రితం మొత్తం భవనాన్ని పునర్నిర్మించినా తలుపును మాత్రం మార్చలేదు. ఒకప్పుడు ఈ తలుపు ఉన్న గదిలో క్రైస్తవ మతాధికారులు ప్రేయర్లు చేసేవారు. నేడు ఆ గదిలో పాత పత్రాల్ని భద్రపరుస్తున్నారు.
ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. నాగచైతన్య-శోభిత ధూళిపాళ విడిపోతారంటూ ఆయన జాతకం చెప్పడాన్ని తప్పుబడుతూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ TGSCWకి ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో ఈనెల 22న ఆయన వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమన్లు జారీ చేశారు.
AP: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపు ఖాయం కావడంపై మాజీ మంత్రి అంబటి స్పందించారు. ‘YSRCP పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం!’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీయే కూటమి నిర్ణయించింది. బొత్సతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా పోటీలో ఉన్నారు.
బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం మొదటిసారిగా ఆమెపై న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. జులై 19న ఢాకాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గ్రోసరీ స్టోర్ యాజమాని అబు సయ్యద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఆమెపై హత్య కేసు నమోదైంది. ఆమెతోపాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ, మాజీ హోం మంత్రి, మాజీ ఐజీపీ, మాజీ డీబీ చీఫ్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది.
ఫొటోలను వీడియోలుగా మార్చే AI సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సవాళ్లు విసురుతోంది. గతంలో తల్లిదండ్రులు, ప్రియమైన వారితో దిగిన చిత్రాలను వీడియోలుగా మలిస్తే మధుర జ్ఞాపకాలుగా మారుతాయి. అదే రాజకీయ నేతల పాత చిత్రాలకు తప్పుడు మాటలు జోడించి నిజమనిపించేలా వీడియోలు వస్తే రచ్చ రచ్చే. చివరి ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దుపై నకిలీ వీడియోలు రేపిన కలకలం గురించి తెలిసిందే. అందుకే AIపై కంట్రోల్ మస్ట్. మీ కామెంట్.
AP: ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేశారన్న జగన్ <<13841981>>వ్యాఖ్యలకు<<>> మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచేందుకు 5 ఏళ్లు తీసుకొని సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా అని Xలో ప్రశ్నించారు. పాపాలలో శిశుపాలుడిని మించిన జగన్ మోసాలకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా సిగ్గు రాలేదని దుయ్యబట్టారు. బాబాయ్‌ని వేసేయడం, గంజాయి అమ్ముకోవడం వంటివి సాగకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్టా అని ప్రశ్నలు సంధించారు.
Sorry, no posts matched your criteria.