India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోల్‌కతాలో ఈ నెల 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటనపై HRC(మానవ హక్కుల కమిషన్) స్పందించింది. ఈ కేసును సుమోటోగా విచారించనున్నట్లు ప్రకటించింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని బెంగాల్ డీజీపీ, సీఎస్‌లను ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికలను మరాఠా రిజర్వేషన్ల అంశం ఈసారి షేక్ చేయబోతున్నట్టే ఉంది. మహారాష్ట్రలోనే సీనియర్ పొలిటీషియన్, NCPSP చీఫ్ శరద్ పవర్‌కు తాజాగా ఈ సెగ తగిలింది. షోలాపూర్ జిల్లాలో ప్రసంగిస్తుండగా పోరాటదారులు ఆయనకు అడ్డుతగిలారు. నినాదాలు చేస్తూ జెండాలు చూపించారు. గతంలో పెద్దగా పట్టించుకోని ఆయన ఇప్పుడు వారికి మద్దతివ్వక తప్పలేదు. కొన్నేళ్లుగా ఈ అంశాన్ని పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి.
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు హెర్నియా కారణంగా గజ్జల్లో గాయమైనట్లు సమాచారం. ఈ గాయం పరిశీలన కోసమే జర్మనీ వెళ్లారు. పేగులు బయటికి పొడుచుకురావడాన్ని హెర్నియాగా వ్యవహరిస్తారు. అవి పొట్ట కింది భాగంపై ఒత్తిడి చేయడంతో అక్కడి నుంచి గజ్జల్లో కండరాలపై ఒత్తిడి పడి గాయం అవుతుంటుంది. చాలాకాలంగా ఉన్న ఈ సమస్య కారణంగానే పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్లో ఫస్ట్‌క్రై ఎంట్రీ అదిరింది. ఇష్యూ ధర రూ.465తో పోలిస్తే షేర్లు 40% ప్రీమియంతో రూ.651 వద్ద NSEలో లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో రూ.707 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. దీన్నే పరిగణనలోకి తీసుకుంటే ఇన్వెస్టర్లకు రూ.14880 (32×465) పెట్టుబడికి రూ.7744 వరకు లాభం వచ్చింది. కంపెనీ మాతృసంస్థ బ్రెయిన్‌బీ సొల్యూషన్స్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడినా ఐపీవోకు మంచి స్పందనే వచ్చింది.
‘పతంజలి’ వ్యవస్థాపకుడు, యోగా గురువు బాబా రాందేవ్, MD బాలకృష్ణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పతంజలి క్షమాపణను ఎట్టకేలకు అంగీకరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గతంలో పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రకటనలు చేసిందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిల్ వేసింది. దీంతో అసత్య ప్రకటనలు మానుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పతంజలిని SC అప్పట్లో ఆదేశించింది.
జూ.NTR, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ ప్రేక్షకుల అంచనాలు పెంచుతున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ బర్త్ డే ఈ నెల 16న ఉండగా, ఒక రోజు ముందుగా స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేసేలా వీడియో ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన చుట్టమల్లే సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం కొల్లగొట్టిన హాకీ టీమ్ స్వదేశానికి తిరిగొచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వీరికి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు డోళ్లు వాయిస్తూ సందడి చేశారు. కొందరు ఆటగాళ్లు ఇంతకు ముందే వచ్చారు. ఆదివారం రాత్రి ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత పీఆర్ శ్రీజేశ్, అభిషేక్, అమిత్ రోహిదాస్, సంజయ్‌తో కూడిన రెండో బ్యాచ్ చేరుకుంది. శ్రీజేశ్ పతాకధారి అన్న సంగతి తెలిసిందే.
ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలకు సంబంధించి ప్రసారం చేసే వీడియోలపై డేట్&టైమ్ స్టాంప్ ఉండాలని సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ వీడియోలను ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రసారం చేయడం వల్ల రియల్ టైమ్ సిచువేషన్ తెలుసుకోవడంలో గందరగోళం ఏర్పడుతోందని పేర్కొంది. అందుకు తావులేకుండా చేసేందుకు ఆయా టీవీ ఛానళ్లు డేట్&టైమ్ స్టాంప్ ఉంచాలని సూచించింది.
కొంతమంది స్త్రీలలో నెలసరి తర్వాతా పొత్తి కడుపులో నొప్పి కొనసాగుతుంది. అందుకు కారణం పోస్ట్ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ కావొచ్చంటున్నారు గైనకాలజిస్టులు. ‘20 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. నీరసం, మూడ్ స్వింగ్స్, తలనొప్పి, ఆందోళన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. అస్తవ్యస్తమైన జీవన శైలే దీనికి కారణం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవన విధానంతో మెల్లగా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఛాన్స్ ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
AP: రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని YCP చీఫ్ జగన్ విమర్శించారు. మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఆర్థిక కష్టాలున్నా సాకులు చెప్పకుండా మన ప్రభుత్వం పథకాలు అమలు చేసింది. ప్రజలకు ఆశ చూపి CBN దగా చేశారు. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. మళ్లీ మన పార్టీ గెలుస్తుంది. చీకటి తర్వాత వెలుగు రావడం తథ్యం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.