India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఆయన మరికొందరితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ ఆరోపించారు.
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటును AP మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కొత్త గేటు ఏర్పాటుపై ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించారు. ప్రతి నీటి చుక్కను ఆదా చేసే ప్రయత్నం చేయాలని CM చంద్రబాబు చెప్పారని మంత్రులు అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటు 3 రోజుల్లో తాత్కాలిక గేటు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు.
నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. దీంతో ఆమె ఈ వారం IMDb ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నారు. ముంజ్యా, మహారాజ్ సినిమాలతో క్రేజ్ సాధించిన బాలీవుడ్ నటి శార్వరీ అగ్రస్థానంలో నిలిచారు. 3, 4, 5 స్థానాల్లో షారుఖ్, కాజోల్, జాన్వీ కపూర్ ఉన్నారు.
తెలంగాణలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి హాస్టళ్లలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కూడా ఇటీవల పెరిగిపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొంటున్నారు.
ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి ఇప్పటికి రెండు పాటలు విడుదల కాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లవర్స్‌కు ఆ మూవీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ థాంక్స్ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా దేవర పాటలకు మీరు ఇస్తున్న క్రేజీ లవ్‌కు థాంక్యూ. మనం ఇప్పుడే మొదలుపెట్టాం. మున్ముందు ఇంకా చాలా వస్తాయి’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేవర నుంచి ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ పాటలు విడుదలయ్యాయి.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 11 వరకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.inలో తెలుసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
AP: వచ్చే ఐదేళ్లలో అమరావతి పేరుతో IPL టీమ్‌ను ప్రమోట్ చేస్తామని మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. ‘అన్ని విద్యాసంస్థల్లో ప్రతి రోజూ గంటపాటు క్రీడలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడా మైదానాలు లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ.120 కోట్ల అవినీతికి పాల్పడింది’ అని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్‌లో రీఎంట్రీకి షేక్ హసీనా రంగం సిద్ధం చేసుకుంటున్నారని జియో పొలిటికల్ అనలిస్టుల అంచనా. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేక, తన ప్రజల అంత్యక్రియల పర్వాన్ని చూడొద్దనే పదవి నుంచి దిగిపోయానన్న ఆమె మాటల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒకవేళ యూనస్ ప్రభుత్వం దీవిని USకు అప్పగిస్తే మళ్లీ ఎన్నికల్లో ఇదే అవామీ లీగ్ ప్రచారాస్త్రం అవుతుందని, ప్రజలు ఆలోచిస్తారని చెబుతున్నారు.
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో ₹50లక్షల ఖరీదైన వాచ్ ధరించినట్లు ఫొటోల్లో కనిపించింది. దీంతో అతడి ఆస్తి, సంపాదన ఎంతనే చర్చ మొదలైంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం నీరజ్ నికర ఆస్తులు సుమారు ₹37కోట్లు. నెలకు సగటున ₹30 లక్షలు, ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం అని తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిచాక నీరజ్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు భారీగా అందుతున్నాయి.
ఐరోపా ఖండంలో వేడి కారణంగా గత ఏడాది 47వేలమందికి పైగా మృతిచెందారని బార్సిలోనా ఐఎస్ గ్లోబల్ హెల్త్ నివేదిక వెల్లడించింది. ఉష్ణోగ్రతల నమోదు మొదలయ్యాక యూరప్‌నకు నిరుడు అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. 60 వేల మరణాలుంటాయని అంచనా ఉన్నప్పటికీ ఆరోగ్య రంగ సేవలు మెరుగవుతుండటంతో మరణాలు తగ్గినట్లు నివేదిక వివరించింది. ఎక్కువ మరణాలు గ్రీస్, బల్గేరియా, ఇటలీ, స్పెయిన్ నుంచి ఉన్నట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.