India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2011 లెక్కల ప్రకారం 121 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036 నాటికి 152 కోట్లకు చేరనుంది. గణాంకాల శాఖ నివేదిక ప్రకారం పనిచేసే(15-59ఏళ్లు) వారి సంఖ్య 64.9 శాతానికి(గతంలో 60.7%) చేరనుంది. 2011లో లింగ నిష్పత్తి 1000:943 ఉండగా, 2036కు 1000:952కు పెరగనుంది. పట్టణ జనాభా 37.7కోట్ల నుంచి 59.4కోట్లకు, గ్రామీణ జనాభా 83కోట్ల నుంచి 92కోట్లకు చేరనుంది. 15ఏళ్ల లోపు వారి సంఖ్య తగ్గి 60ఏళ్లు పైబడే వారి సంఖ్య పెరగనుంది.
బంగ్లాలో పరిస్థితుల్ని US నిరంతరం పర్యవేక్షిస్తోందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇంతకు మించి చెప్పేదేమీ లేదంది. ఎలాంటి మానవ హక్కుల అంశమైనా జో బైడెన్ ఎప్పుడూ గట్టిగా, స్పష్టంగానే మాట్లాడతారని నొక్కి చెప్పింది. హిందువులు, మైనారిటీలపై దాడుల్ని అడ్డుకోవాలని కొన్ని రోజులుగా అమెరికన్ హిందూ సంఘాలు, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైట్‌హౌస్ ప్రకటనలో మైనారిటీలు, హిందువులు అన్న పదాలే లేకపోవడం గమనార్హం.
ఈరోజు ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. మనిషికి ఉండే రెండు చేతుల్లో ఏది ముఖ్యమని అడిగితే రెండూ ముఖ్యమే అంటారు. కానీ ఎడమచేతిపై వివక్ష ఎప్పటికీ ఉంటుంది. మహిళల్లో ఈ పట్టింపు మరీ ఎక్కువ. ఇంట్లో ఆడపిల్లలు ఎడమ చేత్తో వండినా, వడ్డించినా ఆఖరికి మంచినీళ్లిచ్చినా ఈసడింపుగా చూస్తారు. అందుకే లెఫ్ట్ హ్యాండర్స్‌కు ఈ సమాజం నుంచి కొన్ని సవాళ్లు ఎక్కువే. దీనిపై మీ అభిప్రాయం?
AP: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ <<13788692>>ఉప ఎన్నిక<<>> నేపథ్యంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ఇతర జిల్లాల నాయకులు, సందర్శకులకు జగన్‌ను కలిసే అవకాశం ఉండదని పార్టీ తెలిపింది. కాగా ఇప్పటికే విశాఖ జిల్లాలోని 5 నియోజకవర్గాల MPTCలు, ZPTCలతో ఆయన సమావేశమైన విషయం తెలిసిందే.
US అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ట్విటర్‌లో తాను నిర్వహించిన ఇంటర్వ్యూపై DDoS సైబర్ దాడి జరిగిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. అందువల్లే ఇంటర్వ్యూ 45 నిమిషాలు ఆలస్యంగా మొదలైందని పేర్కొన్నారు. వెబ్‌సైట్ లేదా యాప్ పని తీరు దెబ్బతీసేలా కృత్రిమంగా భారీ ఆన్‌లైన్ ట్రాఫిక్‌ను తీసుకురావడాన్ని DDoS దాడిగా చెబుతారు. కాగా ట్రంప్ బృందం ఈ ముఖాముఖిని ‘ఇంటర్వ్యూ ఆఫ్ ది సెంచరీ’గా ప్రకటించింది.
‘హండ్రెడ్’ టోర్నీలో ఆల్ రౌండర్, ENG టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌కు ఆడుతున్న అతను మాంచెస్టర్‌తో మ్యాచ్‌లో పరుగు తీస్తూ కీపర్‌ను ఢీకొట్టారు. దీంతో చీలమండ దెబ్బతింది. మరో ఇద్దరు అతనిని గ్రౌండు నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతం చేతికర్రల సాయంతో స్టోక్స్ నడుస్తున్నారు. దీంతో వచ్చే వారం శ్రీలంకతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కన్పిస్తోంది.
TG: ప్రభుత్వ స్థలం వ్యవహారంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.69 నందగిరిహిల్స్‌లో GHMC స్థల ప్రహరీని కొందరు కూల్చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. కూల్చివేతతో MLAకు సంబంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేత వల్ల రూ.10లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయమే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది సిబ్బంది ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
మార్స్ గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మార్స్ ఉపరితలం కింద 11.5 కి.మీ నుంచి 20 కి.మీ లోతున నీరు ఉన్నట్లు గుర్తించారు. రోబోటిక్ ఇన్‌సైట్ ల్యాండర్ ద్వారా నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఆ నీటిని తోడడం సవాల్‌తో కూడుకున్నదని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆ గ్రహంపై నీరు ప్రవహించినట్లు అంచనా వేస్తున్నారు. గతంలో అక్కడ జీవనానికి అనుకూలంగా ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
నేడు ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం. జనాభాలో 10 నుంచి 12శాతం మంది ఎడమ చేతి వాటం వారు ఉంటారని అంచనా. వీరిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. మహాత్మాగాంధీ, రాణీ లక్ష్మీబాయి, ప్రధాని మోదీ, ఐన్‌స్టీన్, చార్లెస్ డార్విన్, న్యూటన్, ఒబామా, రతన్ టాటా, సచిన్, రవిశాస్త్రి, గంగూలీ, యువరాజ్, రైనా, అమితాబ్, సావిత్రి, సూర్యకాంతం.. వీరందరిదీ ఎడమచేతి వాటమే. మీకు తెలిసిన ప్రముఖ లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.