news

News August 13, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 13, మంగళవారం
✒అష్టమి: ఉదయం 9.31 గంటలకు
✒విశాఖ: ఉదయం 10.44 గంటలకు
✒వర్జ్యం: మధ్యాహ్నం 2.58-4.40 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 8.24 నుంచి 09.14 గంటల వరకు
రాత్రి 11.04 నుంచి 11.49 గంటల వరకు

News August 13, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: నకిలీ సదరం సర్టిఫికెట్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
* పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు: మంత్రి DBV స్వామి
* వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
* TG: యువత దేశానికి మార్గనిర్దేశకులు కావాలి: సీఎం రేవంత్
* సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్‌దే: హరీశ్ రావు
* అట్టహాసంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్

News August 12, 2024

చెన్నైకి BRS నేతల బృందం

image

TG: బాల్క సుమన్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం త్వరలోనే చెన్నైకి వెళ్లనుంది. డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ టీమ్ అధ్యయనం చేయనుంది. ఆ పార్టీ విధానాలపై కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుంది. అనంతరం DMK విధానాలను BRS కూడా అమలు చేసి, 2028 ఎన్నికలకు పార్టీని పటిష్ఠంగా చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News August 12, 2024

ఆ బిల్లుపై కేంద్రం వెనక్కి!

image

వివాదాస్ప‌ద బ్రాడ్‌కాస్టింగ్ స‌ర్వీసెస్ (నియంత్ర‌ణ‌) ప్ర‌తిపాదిత డ్రాఫ్ట్‌ బిల్లు – 2024ను వెనక్కు తీసుకోవాల‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఈ బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన అతికొద్ది మందికి ఫిజిక‌ల్ కాపీలు పంపింది. అయితే, ఈ ప్రతిపాదిత బిల్లుపై విప‌క్షాలు, కంటెంట్ క్రియేట‌ర్లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

News August 12, 2024

నచ్చిన రేటింగ్ ఇచ్చుకోండి: హరీశ్ శంకర్

image

తన సినిమాకు రివ్యూలు ఏమైనా రాసుకోవచ్చని, నచ్చిన రేటింగ్‌లు ఇచ్చుకోవచ్చని దర్శకుడు హరీశ్ శంకర్ సవాల్ విసిరారు. తన ఆత్మాభిమానం దెబ్బతీసిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో ముఖాముఖిగా గొంతెత్తినట్లు తెలిపారు. ‘ఇట్స్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ నాట్ ఆటిట్యూడ్’ అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్ వేశారు. కాగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్లు ఆగస్టు 14 నుంచే మొదలవుతాయని తెలిపారు.

News August 12, 2024

రైల్వే ఉద్యోగికి మూడేళ్ల జైలు

image

లంచం కేసులో వెస్ట్రన్ రైల్వేస్‌లో ఓ మాజీ ఉద్యోగికి గుజరాత్‌లోని గాంధీనగర్ CBI కేసుల ప్ర‌త్యేక జ‌డ్జి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పెండింగ్ బిల్లులు క్లియ‌ర్ చేయ‌డానికి ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి 2008లో అప్ప‌టి సీనియ‌ర్ అసిస్టెంట్ ఆర్థిక స‌లహాదారైన విద్యాసాగ‌ర్ రూ.20 వేలు లంచం తీసుకోవ‌డంతో సీబీఐ కేసు న‌మోదైంది. 2009లో చార్జిషీట్ దాఖలు చేయగా తాజాగా కోర్టు శిక్ష, రూ.75 వేల జరిమానా విధించింది.

News August 12, 2024

టాప్-5 రాష్ట్రాలతో పోటీపడేలా పారిశ్రామిక విధానం: CBN

image

AP: పరిశ్రమల స్థాపనలో రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై సీఎం సమీక్ష చేశారు. ‘దేశంలో మొదటి 5 రాష్ట్రాలతో పోటీ పడేలా, వృద్ధి రేటు 15% లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలి. పారిశ్రామికాభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు వంద రోజుల్లోగా తీసుకురావాలి’ అని CM వెల్లడించారు.

News August 12, 2024

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

image

రైల్వేలో వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను భట్టి 10+2, నర్సింగ్, డిప్లొమా, B.Sc, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, ఈబీసీలు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి. నోటిఫికేషన్ కోసం <>క్లిక్<<>> చేయండి.

News August 12, 2024

మొదటి జాతీయ జెండాను చూశారా?

image

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది రెపరెపలాడే మువ్వన్నెల జెండా. మొట్ట మొదటగా 1947 ఆగస్టు 15న ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూశారా? చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో 12 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాను భద్రపరిచారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఆవిష్కరించిన జెండాల్లో ఇది ఒకటి. దీనిని స్వచ్ఛమైన సిల్క్‌తో తయారుచేశారు.

News August 12, 2024

B12 లోపంతో రక్తహీనత!

image

విటమిన్ B12 లోపం రక్తహీనత, నరాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన నాడీ వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ‌, ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిలో విట‌మిన్ B12 స‌హాయ‌ప‌డుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఉత్తర భారతంలోని 47% మందిలో బి12 లోపం ఉన్నట్టు తేలింది.

error: Content is protected !!