news

News August 12, 2024

B12 లోపంతో రక్తహీనత!

image

విటమిన్ B12 లోపం రక్తహీనత, నరాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన నాడీ వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ‌, ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిలో విట‌మిన్ B12 స‌హాయ‌ప‌డుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఉత్తర భారతంలోని 47% మందిలో బి12 లోపం ఉన్నట్టు తేలింది.

News August 12, 2024

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేముందు ఇవి చూడండి!

image

ఫుడ్ ఐటమ్స్ కొనేముందు MFG, EXP తేదీలు ఎలా చెక్ చేస్తామో.. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు వీటిని చెక్ చేయాలని BIS సూచిస్తోంది. మీ బడ్జెట్‌ను బట్టి వస్తువులను ఎంచుకోండి. ఆ వస్తువు మీ ఇంట్లోకి వెళ్తుందా లేదా? అని సైజులు చూసుకోండి. ముఖ్యంగా BIS రిజిస్ట్రేషన్ ఉంటేనే కొనండి. ప్రొడక్ట్‌పై ఉన్న R నంబర్‌తో ఆ వస్తువు నకిలీదా? లేక అసలైనదేనా? అనేది తెలుసుకోవచ్చు. ఈ <>వెబ్‌సైట్‌లో<<>> R నంబర్‌తో చెక్ చేయండి.

News August 12, 2024

గజరాజులకు స్పెషల్ విందు

image

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జూలో ఉన్న వనజ, ఆశా, సీత, విజయ్ అనే పేరుగల నాలుగు ఆసియా ఏనుగులకు స్పెషల్ విందు ఏర్పాటు చేశారు. పచ్చి సలాడ్, బెల్లం, చెరుకుతో పాటు పండ్లు, కొబ్బరికాయలతో ప్రత్యేక విందును అందించారు. వీటిని అవి ఎంతో ఇష్టంగా ఆరగించాయి. దీనికి సంబంధించిన ఫొటోలను అదికారులు షేర్ చేశారు.

News August 12, 2024

4 సెకన్ల ఆలస్యంతో అప్పీల్.. కాంస్యం కోల్పోయిన అథ్లెట్

image

ఒలింపిక్స్‌: జిమ్నాస్టిక్స్‌లో 4 సెకన్లు లేట్‌గా అప్పీల్ చేసినందుకు ఓ అథ్లెట్ కాంస్యం కోల్పోయారు. AUG 5న పోటీలో USకు చెందిన జోర్డాన్ 13.666 స్కోరుతో ఐదోస్థానంలో నిలిచారు. పాయింట్లు తప్పుగా వేశారంటూ ఆమె రివ్యూకు వెళ్లడంతో బ్రాంజ్ దక్కింది. అయితే ఆమె నిర్దేశిత టైం కంటే 4 సెకన్లు ఆలస్యంగా అప్పీల్ చేశారంటూ రొమేనియా బృందం CASను ఆశ్రయించింది. నిజమని తేలడంతో కాంస్యం తిరిగిచ్చేయాలని కోర్టు ఆదేశించింది.

News August 12, 2024

స్కూలు బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేయాలి: సీఎం

image

AP: స్కూళ్లకు విద్యార్థులను తరలించే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో స్కూలు వ్యాను బోల్తా పడి భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అన్ని బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలి. ఫిట్‌నెస్ లేని బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి’ అని CM స్పష్టం చేశారు.

News August 12, 2024

ముగిసిన ఒలింపిక్స్.. ఏర్పాట్లపై మళ్లీ విమర్శలు

image

పారిస్ ఒలింపిక్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే, అథ్లెట్లకు సరైన వసతులు కల్పించలేదని నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈక్రమంలో గోల్డ్ మెడలిస్ట్ పార్క్‌లో నిద్రపోయిన ఫొటోను షేర్ చేస్తూ అథ్లెట్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారని గుర్తుచేస్తున్నారు. భారత అథ్లెట్లూ ఇబ్బంది పడితే కేంద్రం పోర్టబుల్ ఏసీలు పంపింది. వసతులు బాలేకపోవడంతో కొందరు అమెరికన్ అథ్లెట్లు హోటల్స్‌లో ఉండాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.

News August 12, 2024

టెస్టు క్రికెట్‌లో వారిద్దరు ముఖ్యమైన ప్లేయర్లు: హర్భజన్

image

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు, వన్డే ఫార్మాట్లలో మరో రెండేళ్ల పాటు కొనసాగుతారని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ ఫిట్‌నెస్‌ను చూస్తే మరో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడుతారని జోస్యం చెప్పారు. జట్టులో ఫిట్‌నెస్ పరంగా అతనే దృఢంగా ఉంటారన్నారు. టెస్టు క్రికెట్‌ విషయానికి వస్తే హిట్ మ్యాన్, కింగ్ ముఖ్యమైన ఆటగాళ్లని భావిస్తున్నట్లు తెలిపారు.

News August 12, 2024

రేవంత్ ఫొటో లేకుండా పోస్టర్.. BRS సెటైర్లు!

image

TG: సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అంటూ TG కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టర్ పంచుకుంది. అందులో డిప్యూటీ CM భట్టి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్, జాతీయ స్థాయి నేతల ఫొటోలున్నాయి. అయితే అందులో CM రేవంత్ ఫొటో లేకపోవడంతో BRS సెటైర్లు వేసింది. ‘పాపం కొరియా నుంచి తిరిగి వచ్చే లోపు రేవంత్ ఫొటో మాయం. ఆయన పదవైనా ఉందా అది కూడా ఊడిందా? కాంగ్రెస్ ఆ మజాకా!’ అంటూ రీట్వీట్ చేసింది.

News August 12, 2024

మిత్రమా.. మీరూ ‘స్మైలింగ్ డిప్రెషన్‌’లో ఉన్నారా?

image

స్మైలింగ్ డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య. స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు బయటికి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం విపరీతమైన బాధను అనుభవిస్తుంటారు. ఈ డిప్రెషన్‌ ఉన్నవారిని సూసైడ్ ఆలోచనలు వేధిస్తుంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇతర డిప్రెషన్‌లతో పోల్చితే దీన్ని గుర్తించడం కష్టం. ఒకవేళ మీరు స్మైలింగ్ డిప్రెషన్‌ ఎదుర్కొంటుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

News August 12, 2024

ఆ సమయంలో కన్నీళ్లతోనే ఇంటికి వచ్చేదాన్ని: రష్మిక

image

కెరీర్ తొలినాళ్లలో మూవీ ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్నని హీరోయిన్ రష్మిక అన్నారు. ఒక సినిమాకు సెలక్టయ్యాక 2, 3 నెలల పాటు వర్క్ షాప్స్ జరిగాయని, కొద్ది రోజులకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపరుచుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం పుష్ప-2, సికిందర్, కుబేర వంటి చిత్రాలతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.

error: Content is protected !!