India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 79,100 మంది దర్శించుకున్నారు. 32,791 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు లభించింది.
అమెరికా అలబామాలో టోవానా లూనీ అనే మహిళ పంది కిడ్నీతో 130 రోజులు జీవించి రికార్డు సృష్టించారు. ఓ జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటి వరకు 2 నెలలకు మించి బతకలేదు. గతేడాది NOV 25న లూనీకి పంది కిడ్నీని అమర్చగా, ఇటీవల ఆమెలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతో వైద్యులు ఆ కిడ్నీని విజయవంతంగా తొలగించారు. ఇకపై ఆమె మళ్లీ డయాలసిస్ చేయించుకోనున్నారు. ఆమెకు సరిపోయే మనిషి కిడ్నీ దొరికాక అమర్చుతామని వైద్యులు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా సెలవు ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు పని చేయవు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు.
ఇటీవల బెంగళూరులో రోడ్డుపై వెళ్తున్న మహిళను <<16013655>>లైంగికంగా<<>> వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, TN, కేరళలో 700 CCTVలను పరిశీలించి నిందితుడు సంతోష్‌ను కోజికోడ్‌లో ట్రేస్ చేశారు. ఇతను BNGLలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా ఆ ఘటన తర్వాత నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమే అని మంత్రి పరమేశ్వర కామెంట్స్ చేసి తర్వాత క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.
‘WAR-2’ సినిమాలో Jr.NTR 10-20 నిమిషాల పాటు షర్ట్ లెస్‌గా కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. NTR ఇంట్రడక్షన్ సీన్‌లో భారీ ఫైట్ ఉంటుందని, ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. హృతిక్, NTR కలిసి నటిస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. కాగా గతంలో టెంపర్, అరవింద సమేతలో NTR సిక్స్ ప్యాక్‌తో కనిపించారు.
ఇటీవల LSGతో మ్యాచ్‌లో తన <<15997954>>రిటైర్డ్ ఔట్<<>> వివాదంపై తిలక్ వర్మ స్పందించారు. మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు ప్రయోజనం కోసమేనని తెలిపారు. దాన్ని తాను పాజిటివ్‌గానే తీసుకున్నట్లు చెప్పారు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపినా తాను సిద్ధమేనని, ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కోచ్, స్టాఫ్‌కు చెప్పినట్లు వివరించారు. నిన్న DCపై తిలక్ 59 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడు గవర్నర్ R.N.రవిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మధురైలోని ఓ కళాశాల విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయించారు. మతాలకు అతీతమైన పదవిలో ఉండి ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని DMK, కాంగ్రెస్, CPI నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
AP: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి అంబేడ్కర్ పునాదులు వేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామన్నారు. ‘ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దాం. అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం’ అని ట్వీట్ చేశారు.
TG: డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మాజీ సీఎం KCR నివాళులు అర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా BRS పాలన సాగిందని, దళితబంధు సహా అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ను మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత ఏజెన్సీలైన CBI, ED విజ్ఞప్తి మేరకు అతడిని అరెస్టు చేశారు. ఛోక్సీపై గతంలో ముంబైలో నాన్-బెయిలబుల్ వారెంట్లు నమోదయ్యాయి. PNBని రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా ఛోక్సీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. అతడి మేనల్లుడు నీరవ్ లండన్ జైలులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.