India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, అర్వింద్, రామచంద్రరావు రేసులో ఉండగా, కొత్తగా తెరపైకి మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వచ్చాయి. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. OCలకు దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీలకే అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేకుండా ప్రకటించాలని భావిస్తోంది.

IITలు, NITల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్-2 పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్-1 పరీక్షలను జనవరిలో నిర్వహించారు.

సినీ నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తిరుపతి, హిందూపురం, నెల్లూరులో వైసీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు దాడి చేశారని, ఆ ఎన్నికలను వాయిదా వేయాలని విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నేతలు వినతిపత్రం అందించారు.

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ మ్యూజిక్ అందించారు. కాగా, త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

TG: కొడుకు ఆపదలో ఉంటే రక్షించడానికి తండ్రి తన వయసును, ప్రాణాన్ని సైతం లెక్కచేయడు. అందుకే నాన్న సూపర్ హీరో. తాజాగా సిద్దిపేట(D) చిట్టాపూర్‌లో పొలానికి వెళ్లిన మల్లయ్య పొరపాటున కూడవెల్లి వాగులో పడిపోయాడు. తండ్రి నారాయణ(75) వెంటనే వాగులోకి దూకి కొడుకును కాపాడాడు. అపస్మారకస్థితిలోకి చేరిన మల్లయ్యను కుటుంబసభ్యుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.

ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపై చర్చిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.