India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో సాయంత్రం వేళ చిరుజల్లులు పడే ఆస్కారం ఉందని పేర్కొంది.
AP: అన్నమయ్య(D) నందలూరు(మ) అరవపల్లిలో ఓ పెళ్లి మండపంలో యువతి హల్‌చల్ చేసింది. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ వరుడు సయ్యద్‌పై యాసిడ్ పోసేందుకు ప్రయత్నించి, కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో వరుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. పెళ్లి పందిరిలో యువతి దాడి నేపథ్యంలో సయ్యద్ వివాహం నిలిచిపోగా.. వ్యవహారం పోలీసుల వరకూ చేరింది. దాడి చేసిన యువతిని వారు అదుపులోకి తీసుకున్నారు.
ఒలింపిక్స్‌లో పతకాన్ని పొందేందుకు వినేశ్ ఫొగట్ పూర్తి అర్హురాలని మాజీ క్రికెటర్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘రూల్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలియదు కానీ ఆమె ఫైనల్స్‌కు వెళ్లారంటే కచ్చితంగా మెడల్ పొందేందుకు అర్హత సాధించినట్లే. అది ఏ పతకమైనా ఓకే. అనర్హత సరైనదా కాదా అనేది పక్కన పెడితే, మెడల్‌కు వినేశ్ పూర్తి అర్హురాలు’ అని పేర్కొన్నారు. కాగా వినేశ్ అనర్హతపై ఆర్బిట్రేషన్ కోర్టు ఈ నెల 13న తీర్పు ఇవ్వనుంది.
ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా మెక్సికోలో పురాతనమైన యకాటా పిరమిడ్లలో ఒకటి కుప్పకూలింది. మెకొవాకాన్ రాష్ట్రంలో ఉన్న ఈ పిరమిడ్ల వద్ద తమ పూర్వీకులు వందల ఏళ్ల క్రితం మనుషుల్ని బలిచ్చేవారని స్థానిక పురెపెచ్చా జాతివారు చెబుతున్నారు. వాటిలో ఒకటి ధ్వంసం కావడమంటే ప్రపంచానికి ఏదో పెద్ద విపత్తు రాబోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పిరమిడ్‌ను పునరుద్ధరిస్తామని మెక్సికో పురావస్తు శాఖ తెలిపింది.
తెలుగు ప్రజలంటే తనకు ఇష్టమని నటి మాళవిక మోహనన్ తెలిపారు. తెలుగువారికి ఆమె సమాధానం ఇవ్వడం లేదంటూ ఓ నెటిజన్ చేసిన ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. ‘అది నిజంకాదు. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో కొంతమంది తెలుగువాళ్లే. నాకు ఇక్కడి ప్రజలంటే చాలా ఇష్టం. అందుకే తెలుగు సినిమా చేస్తున్నా. మీరు నాకు చాలా ప్రేమను ఇస్తుంటారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసాబ్‌లో ప్రభాస్ సరసన ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే 2 రోజుల్లో ఐదు సంస్థల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. వీటిలో సరస్వతి శారీ డిపో లిమిటెడ్(రేపు), సన్‌లైట్ రీసైక్లింగ్(రేపు), పాజిట్రాన్ ఎనర్జీ(రేపు), సాల్వ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్(ఎల్లుండి), బ్రోచ్ లైఫ్‌కేర్ హాస్పిటల్(ఎల్లుండి) ఉన్నాయి. సరస్వతి శారీ డిపో ఒక్కో షేరుకు రూ.152-160 ధరతో రూ.160 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
☘ ప్రొఫైల్‌పై ట్యాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ&సెక్యూరిటీపై క్లిక్ చేయాలి
☘ డేటా & పర్సనలైజేషన్ ఆప్షన్‌ను ఎంచుకొని గూగుల్ అకౌంట్ లింక్‌పై నొక్కాలి
☘ తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ పే ఎక్స్‌పీరియన్స్ పేజ్‌ను కిందకు స్క్రోల్ చేసి గూగుల్ పే లావాదేవీల హిస్టరీలోకి వెళ్లాలి
☘ అక్కడ మీరు వద్దనుకున్న లావాదేవీని డిలీట్ చేయవచ్చు
☘ కావాలంటే టైమ్ పీరియడ్‌ను ఎంచుకొని హిస్టరీ మొత్తం డిలీట్ చేయవచ్చు.
టీమ్ ఇండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కొత్త ల్యాండ్ రోవర్ కారు కొన్నారు. ఫ్యామిలీతో కలిసి షోరూమ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సిరాజ్ ‘డ్రీమ్ కార్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘నా ఫ్యామిలీ కోసం డ్రీమ్ కారు కొన్నా. కలలకు లిమిట్ లేదు. హార్డ్‌వర్క్‌తో వాటిని సాకారం చేసుకోవచ్చు’ అని సిరాజ్ రాసుకొచ్చారు.
AP: విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో గోదావరి జలాలు కలిసే పవిత్ర సంగమం వద్ద జల హారతులను పున:ప్రారంభించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. హారతులు ఇచ్చే కార్యక్రమం, ప్రారంభోత్సవం తదితర అంశాలపై రేపు చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అటు దేవాదాయ శాఖ పరిధిలో రూ.50వేలలోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ధూప దీప నైవేద్యాల నిమిత్తం గతంలో ప్రతి నెలా ఇచ్చే రూ.5వేలను రూ.10వేలకు పెంచామన్నారు.
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థాన్ని తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలని వాళ్లిద్దరూ అప్పటికప్పుడు అనుకున్నారు. దీంతో వెంటనే చేసేశాం. పెళ్లికి మాత్రం అలా కాదు. ప్రస్తుతం ఇద్దరూ వారి కెరీర్స్‌తో బిజీగా ఉన్నారు. దానికి చాలా టైమ్ పడుతుంది’ అని స్పష్టం చేశారు. చై, శోభిత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.