India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ‘మనం వేగంగానే ఎదుగుతున్నా ఓ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. UPA, NDA రెండూ దేశంలోని నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయాయి. అద్భుతమైన కంపెనీలన్నీ ఇక్కడి నుంచి చైనాకు వెళ్లిపోయాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

బిహార్‌లోని కడ్వా కాంగ్రెస్ MLA షకీల్ అహ్మద్ కుమారుడు అయాన్ ఖాన్(18) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్నాలోని MLA అధికారిక నివాసంలో ఆయన ఇంట్లో లేని సమయంలో ఘటన జరిగింది. కాగా, అయాన్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు అందరితో సరదాగా ఉంటారని, బోర్డ్ పరీక్షల్లో కూడా 95% మార్కులు వచ్చాయని అయాన్ ఫ్రెండ్ ఉమైర్ ఖాన్ తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లైబ్రరీకి వెళ్లగానే ‘సైలెంట్ ప్లీజ్’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, డెన్మార్క్‌లోని లైబ్రరీలలో వివిధ రకాల ప్రజల కథలు మారుమోగుతుంటాయి. పుస్తకాలకు బదులు అక్కడున్న వ్యక్తులను తీసుకెళ్లి, వారి జీవిత కథను వినొచ్చు. ప్రతి వ్యక్తికి ‘నిరుద్యోగి’, ‘శరణార్థి’లాంటి శీర్షికలు ఉంటాయి. వీరి కథలను విని ఒక పుస్తకాన్ని దాని కవర్ చూసి అంచనా వేయకూడదనే విషయాన్ని తెలుసుకుంటారు. దీనిని హ్యూమన్ లైబ్రరీ అంటారు.

నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్‌పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు. ‘పిచ్ బ్యాటింగ్‌కు బాగుంది కరెక్టే. కానీ అటువైపు ఇంగ్లండ్ బౌలర్లేం తక్కువవారు కాదు. అలాంటి ఆటగాళ్లు కూడా అతడి విధ్వంసాన్ని చేతగానివాళ్లలా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం అద్భుతమైన బౌలింగ్ వేశారు. అతడిని ఆడటం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.

తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, అర్వింద్, రామచంద్రరావు రేసులో ఉండగా, కొత్తగా తెరపైకి మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వచ్చాయి. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. OCలకు దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీలకే అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేకుండా ప్రకటించాలని భావిస్తోంది.

IITలు, NITల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్-2 పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్-1 పరీక్షలను జనవరిలో నిర్వహించారు.

సినీ నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.
Sorry, no posts matched your criteria.