news

News August 11, 2024

ఆర్మీ వాహనానికి నిప్పంటించిన మూకలు

image

బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. గోపాల్‌గంజ్‌లో ఆర్మీ వాహనానికి మూకలు నిప్పంటించిన విషయం ఆలస్యంగా తెలిసింది. షేక్ హసీనా తిరిగి రావాలని వేలమంది అవామీ లీగ్ సపోర్టర్స్ ఢాకా-ఖుల్నా హైవేను బ్లాక్ చేశారు. ఆదేశించినప్పటికీ వారు రోడ్డు ఖాళీ చేయకపోవడంతో ఆర్మీ అధికారులు లాఠీలు ఉపయోగించారు. దీంతో వారు వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇద్దరికి బుల్లెట్లు తగిలాయని సమాచారం.

News August 11, 2024

కొత్త అవతార్‌లో మెగా హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ‘మట్కా కింగ్’ వాసు అనే పాత్రలో వరుణ్ కనిపించనున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

News August 11, 2024

సెబీ చీఫ్‌తో సంబంధాల్లేవ్: అదానీ గ్రూప్

image

హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. రిపోర్టులో పేర్కొన్న వ్యక్తులతో తమకెలాంటి వాణిజ్య సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తాము పారదర్శకత, చట్టానికి కట్టుబడి ఉన్నామంది. వ్యక్తిగతంగా లాభపడేందుకే ఓ కల్పిత రిపోర్టును రూపొందించారని విమర్శించింది. వారి ఆరోపణలు అవాస్తవమని సుప్రీం కోర్టు ప్రకటించిందని తెలిపింది. భారత చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ షార్ట్‌సెల్లర్ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.

News August 11, 2024

పన్నులు కడుతున్నాం సరే.. సర్వీస్ ఎక్కడ?

image

ఇండియాలో సామాన్యులు కట్టే పన్నులకు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సేవలకు పొంతన లేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆదాయం, వస్తువులు, సేవలు, ఇన్సూరెన్స్, టోల్.. ఇలా పుట్టినప్పటి నుంచి మరణించేవరకు పన్నులు కడుతూనే ఉన్నామని గుర్తు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, రోడ్లు, రైల్వే లాంటి మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడట్లేదంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News August 11, 2024

మీకు తెలుసా?: గుండె గురించి ఆసక్తికర విషయాలు

image

*స్త్రీల గుండె పురుషుల గుండె కంటే కొంచెం వేగంగా కొట్టుకుంటుంది.
*పిగ్మీ ష్రూ అనే జీవికి అత్యధికంగా నిమిషానికి 1200 సార్లు హృదయస్పందన ఉంటుంది.
*నవ్వడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
*ఫెయిరీ ప్లై అనే కీటకం అతి చిన్న గుండె, నీలి తిమింగలం అతిపెద్ద గుండెను కలిగి ఉంటాయి.

News August 11, 2024

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీలో తర్జనభర్జన

image

AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ <<13788692>>ఉప ఎన్నిక<<>>లో పోటీపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తగినంత మంది సభ్యుల బలం లేనందున పోటీ చేయకపోవడం మంచిదని సీనియర్లు, కచ్చితంగా చేయాల్సిందేనని మరికొందరు నేతలు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎల్లుండితో నామినేషన్ గడువు ముగియనుంది. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

News August 11, 2024

వినేశ్.. నీలాగే 50Gr బరువుతో డిస్‌క్వాలిఫై అయ్యా: జపాన్ రెజ్లర్

image

వినేశ్ ఫొగట్‌కు జపాన్ రెజ్లర్ రీ హిగుచి అండగా నిలిచారు. ‘నీ బాధను నా కన్నా ఇంకెవరూ బాగా అర్థం చేసుకోలేరు. నీలాగే 50Gr అధిక బరువుతో డిస్‌క్వాలిఫై అయ్యాను. నీ చుట్టూ ఉన్నవాళ్ల మాటలు పట్టించుకోకు. ఎదురుదెబ్బల నుంచి పుంజుకోవడం ఓ అందమైన అనుభవం’ అని ఆయన ట్వీట్ చేశారు. హిగుచి 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడలిస్ట్. సొంతగడ్డపై టోక్యో ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై అయ్యారు. పారిస్‌లో స్వర్ణం గెలిచారు.

News August 11, 2024

రేపటి నుంచి అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు బంద్: FORDA

image

దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్ని ఆస్పత్రుల్లో కొన్ని ఎంపిక చేసిన సేవలను నిలిపేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(FORDA) తెలిపింది. అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. కోల్‌కతాలో వైద్యురాలి <<13822185>>హత్యాచార <<>>ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాకు లేఖ రాసింది. నిందితుడిని శిక్షించాలని, వైద్యులకు భద్రత కల్పించాలని కోరింది.

News August 11, 2024

అదానీపై సెబీ దర్యాప్తు: కాంగ్రెస్ డిమాండ్ ఇదే

image

అదానీ గ్రూపు‌పై సెబీ దర్యాప్తులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తొలగించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. JPC ద్వారానే స్కామ్‌ను పూర్తిగా దర్యాప్తు చేయొచ్చని తెలిపింది. అంతిమ ప్రయోజనం పొందే ఫారిన్ ఫండ్స్ యజమాని ఎవరో తెలిపే ప్రక్రియను సెబీ 2019లో రద్దు చేయడాన్ని SC కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. పార్లమెంటును రెండ్రోజుల ముందే నిరవధిక వాయిదా ఎందుకేశారో ఇప్పుడు అర్థమవుతోందని సెటైర్ వేసింది.

News August 11, 2024

క్రికెట్ ఆడుతూ కరెంట్ షాక్‌తో బాలుడి దుర్మరణం

image

స్నేహితులతో గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న 13 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. ఈ విషాద ఘటన ఢిల్లీలో జరిగింది. ఫీల్డింగ్ చేస్తూ బంతి కోసం వెళ్లిన బాలుడు గ్రౌండ్ చివరన ఓ విద్యుత్ స్తంభాన్ని తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవలే ఇలాంటి 2 ఘటనలు జరిగాయి. దీంతో NHRC ఢిల్లీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.

error: Content is protected !!