India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కొడుకు ఆపదలో ఉంటే రక్షించడానికి తండ్రి తన వయసును, ప్రాణాన్ని సైతం లెక్కచేయడు. అందుకే నాన్న సూపర్ హీరో. తాజాగా సిద్దిపేట(D) చిట్టాపూర్‌లో పొలానికి వెళ్లిన మల్లయ్య పొరపాటున కూడవెల్లి వాగులో పడిపోయాడు. తండ్రి నారాయణ(75) వెంటనే వాగులోకి దూకి కొడుకును కాపాడాడు. అపస్మారకస్థితిలోకి చేరిన మల్లయ్యను కుటుంబసభ్యుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.

ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపై చర్చిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

TG: BJP అధిష్ఠానం 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.
WGL-గంట రవి, HNK-సంతోష్ రెడ్డి, BHPL-నిశిధర్ రెడ్డి, NLG-వర్షిత్ రెడ్డి, NZB-దినేశ్ కులాచారి, వనపర్తి-నారాయణ, HYD సెంట్రల్-దీపక్ రెడ్డి, ఆసిఫాబాద్-శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డి-నీలం చిన్నరాజులు, ములుగు-బలరాం, MBNR-శ్రీనివాస్ రెడ్డి, JGL-యాదగిరి బాబు, MNCL-వెంకటేశ్వర్లు గౌడ్, PDPL-సంజీవ రెడ్డి, ADB-బ్రహ్మానంద రెడ్డి, సికింద్రాబాద్-భరత్ గౌడ్

మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని UP ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన వారు ఇంగ్లండ్ వారికి చుక్కలు చూపించడం ఇది కొత్తేమీ కాదని పోస్టులు పెడుతున్నారు. దేశానికి ఫ్రీడమ్ తీసుకొచ్చేందుకు ఆంగ్లేయులపై అప్పుడు భగత్ సింగ్, పదేళ్ల క్రితం క్రికెట్‌లో యువరాజ్ సింగ్, ఇప్పుడు అభిషేక్ బ్యాట్‌తో చుక్కలు చూపించారని చేసిన పోస్టర్ వైరలవుతోంది.

మాఘ శుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకొంటారు. ఆరోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరాయణ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. దేశవ్యాప్తంగా సూర్యభగవానుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. సూర్య పూజ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, సిరి సంపదల్ని చేకూరుస్తుందనేది భక్తుల విశ్వాసం. సూర్యకిరణాలు ఒంటిపై పడటం ఆరోగ్యకరమని నమ్మిక. ఆదిత్య హృదయం, సూర్యాష్టోత్తర శతనామాల పఠనం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు.

TG: <<15340893>>కులగణనపై<<>> సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఈ విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తాం. కొందరు సర్వేకు సహకరించలేదు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఒక్కరే వివరాలు ఇచ్చారు. కాస్ట్ సెన్సస్ డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు’ అని కోరారు.

నీవెక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారో సినీకవి. నిత్యం లక్షలాదిమందితో వేలాది గమ్యస్థానాల మధ్య ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్థం చేసుకోదగినదే. కానీ మరీ 72 గంటల లేటైతే? అనధికారిక వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని కోటా నుంచి పట్నా వెళ్లాల్సిన 13228 నంబర్ రైలు 2017లో 72 గంటలు లేటుగా వచ్చింది! రైల్వే అధికారిక వివరాల ప్రకారం ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ (2014లో 71 గంటలు) పేరిట ఉంది.

ఎయిర్ ఇండియా ‘నమస్తే వరల్డ్ సేల్’ లో భాగంగా రూ.1499 విమాన ప్రయాణం కల్పించనుంది. దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్స్ రూ.1499, ప్రీమియం ఎకానమీ రూ.3,749 కు ప్రారంభంకానున్నాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.9,999 మెుదలవుతాయి. ఈ నెల6వరకూ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎయిర్ఇండియా అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి12 నుంచి అక్టోబర్31తేదీలలో ప్రయాణించవచ్చు.

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై లోక్‌సభలో విపక్షాలు నిరసనలు తెలిపాయి. స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నాయి. కుంభమేళాలో సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆందోళనకు దిగాయి. దీంతో సభ నడవాలని విపక్షాలు కోరుకోవట్లేదని స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.