India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. 50kgs విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఎక్కువ బరువు ఉన్నారు. నిర్ణీత బరువుకన్నా 100 gms మించి బరువు ఉండడంతో ఫొగట్ డిస్‌క్వాలిఫై అయ్యారని ఆమె కోచ్ వెల్లడించారు. దీంతో ఫొగట్ మెడల్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.440 తగ్గి రూ.69,270కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.400 తగ్గి రూ.63,500గా నమోదైంది. వెండి ధర కేజీపై రూ.500 తగ్గి రూ.87,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల పొట్ట కొడుతోందని వైసీపీ ఆరోపించింది. అంగన్‌వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నైట్ వాచ్‌మెన్లు, డీలర్లను లక్షలాదిగా తొలగిస్తోందని మండిపడింది. ‘ఖాళీ అయిన స్థానాల్లో లంచాలు తీసుకుని తమకు అనుకూలమైనవారిని నియమిస్తోంది. కూటమి నేతల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొంది.
అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ నాలుగో స్థానానికి చేరింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 40 రోజుల్లో రూ.640.6కోట్లు వసూలు చేసి షారుఖ్‌ఖాన్ ‘జవాన్'(రూ.640.25కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. బాహుబలి-2 (రూ.1030.42cr), కేజీఎఫ్-2 (రూ.859.7cr), RRR (రూ.782.2cr) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణంపై అనుసరించాల్సిన ప్రణాళిక, సాగునీటి ప్రాజెక్టులు, సిబ్బంది బదిలీలపై చర్చ సాగుతున్నట్లు సమాచారం. మరికాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
గుజరాత్‌కు చెందిన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సంస్థలోని 50వేలమందికి ఈ నెల 17 నుంచి 27 వరకు 10 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు గిరాకీ తగ్గిందని, ఉత్పత్తిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యజమాని వల్లభ్‌భాయ్ లఖానీ తెలిపారు. సహజ వజ్రాల ఉత్పత్తిదారుల్లో తమదే అతి పెద్ద సంస్థ అని ఆయన పేర్కొన్నారు.
TG: వచ్చే నెల నుంచి బీర్ల ధరలు ₹10-12 వరకూ పెరగనున్నట్లు సమాచారం. బీర్ల ఉత్పత్తి కేంద్రాల(బ్రూవరీలు)కు చెల్లించే ధరలను ప్రభుత్వం రెండేళ్లకోసారి పెంచుతుంది. ఈసారి ₹20-25 పెంచాలని బ్రూవరీలు కోరగా, ₹10-12 వరకూ పెంచాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. బ్రూవరీల నుంచి ప్రభుత్వం ఒక్కో బీరును ₹24.08కి కొని, వైన్స్‌లకు ₹116.66కి విక్రయిస్తోంది. వినియోగదారుడికి వచ్చే సరికి లైట్ బీరు ధర ₹150కి చేరుతోంది.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ సహా ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయంపై కోర్టులో ఈడీ చివరి ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2004-2009 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాలూ గ్రూప్-డి ఉద్యోగాల నియామకంలో భూములు పొంది ఉద్యోగాలు కల్పించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. దీనిపై ఈ నెల 13న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.
AP: సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు అయింది. భారీ వర్షం కారణంగా ఆయన ఈ టూర్‌ను రద్దు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం బాపట్ల జిల్లా చీరాల మండలం వేటపాలెంలో నేతన్నలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. అలాగే నేతన్నలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కాగా విజయవాడలో జరిగే చేనేత దినోత్సవంలో బాబు పాల్గొననున్నారు.
INDIA కూటమి APలో TDPని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. కూటమిలోని మిత్రపక్ష పార్టీలు ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా సహా అమరావతికి నిధుల విషయంలో పరోక్షంగా TDPపై విమర్శలు ఎక్కుపెట్టాయి. జగన్ ధర్నాలో పాల్గొన్న కూటమి మిత్రపక్షాలు ఏపీలో జరుగుతున్న హింసా రాజకీయాలను తప్పుబట్టాయి. ఈ విషయంలో YCP పోరాటానికి అండగా ఉంటామని శివసేన, SP, AAP, TMC పార్టీలు భరోసా ఇచ్చాయి.
Sorry, no posts matched your criteria.