India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 22న ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఎస్.గోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ కల్ట్ మూవీలో భూమిక, గోపిక, మల్లిక, కనిహా హీరోయిన్లుగా నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు. 2004లో ఈ సినిమా విడుదలైంది. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ట్రంప్ టారిఫ్స్ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు భారత్ 30 ఉత్పత్తులపై సుంకాలు తగ్గించొచ్చని నొమురా నివేదిక అంచనా వేసింది. USతో వాణిజ్య వివాదాలు రాకుండా ఈ వ్యూహం అనుసరించనుందని పేర్కొంది. బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్, Textiles, హైఎండ్ బైకులపై సుంకాలు తగ్గించడాన్ని ప్రస్తావించింది. మరికొన్నింటిపైనా తగ్గించొచ్చని తెలిపింది. భారత ఎగుమతుల్లో 18% అమెరికాకే వెళ్తాయి. ఈ విలువ FY24 GDPలో 2.2 శాతానికి సమానం.

ప్రకృతితో మమేకమైతే ఎలాంటి రోగమూ దరిచేరదని పూర్వీకులు నమ్మేవారు. ఈ టెక్నిక్‌ను జపాన్ వైద్యులు పాటిస్తున్నారు. ప్రజలు జబ్బు పడి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు పేషెంట్లకు అడవికి వెళ్లాలని సూచిస్తారు. ‘ఫారెస్ట్ బాతింగ్’ అనే ఈ కాన్సెప్ట్ 1980 నుంచి అక్కడ వినియోగంలో ఉంది. వారానికి ఒకసారైనా అడవికి వెళ్లాలి. ఇది నిద్ర నాణ్యత, మూడ్, దృష్టి, రోగనిరోధకశక్తిని మెరుగుపరిచి ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుంది.

TG: రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన తప్పుల తడక అని బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తూతూ మంత్రంగా కులగణన చేశారని విమర్శించారు. సర్వేలో బీసీల సంఖ్య తగ్గించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే ఊరుకోం అని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం చేస్తామన్నారు.

ఐపీఎల్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. ఈ మెగా లీగ్ ఫుల్ షెడ్యూల్‌ను బీసీసీఐ మరో వారంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన రెండు మ్యాచులను విశాఖలో ఆడనున్నట్లు సమాచారం. కాగా మార్చి 21న తొలి మ్యాచ్ జరగనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఇప్పటికే ప్రకటించారు.

TG: బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ఫారాల్లో బర్డ్‌ఫ్లూతో కోళ్లు మృతిచెందిన నేపథ్యంలో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని ఖమ్మం, సత్తుపల్లిలో కోళ్ల మరణాలకూ బర్డ్‌ఫ్లూ కారణమని భావిస్తున్నారు.

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కళ్లలో భయం కనిపిస్తోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఢిల్లీలో పార్టీ ఓడిపోతే పంజాబ్ MLAలతో మీటింగ్ పెట్టారని సెటైర్లు వేసింది. ఆయన మరోసారి CM (పంజాబ్‌కు) అవ్వాలనుకుంటున్నారని పేర్కొంది. మరోవైపు 30 మంది MLAలు టచ్‌లో ఉన్నారన్న కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో ఎందరున్నారో లెక్కించాలంటూ పంజాబ్ CM మాన్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఓటమి అనుభవాన్ని పంజాబ్‌లో ఉపయోగించుకుంటామన్నారు.

చచ్చి బతికాడ్రా? అని వింటుంటాం. అలాంటి ఘటనే కర్ణాటకలోని హవేరీలో జరిగింది. బిష్టప్ప అనే వ్యక్తి దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యం అందించినా చలనం లేకపోవడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇంటి దగ్గర అంత్యక్రియలకు ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించారు. అయితే, ఇంటికి తీసుకెళ్తుండగా శ్వాస తీసుకోవడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ సాయంత్రం ఆయన హనుమకొండ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో పర్యటనను రద్దు చేసుకున్నారు.

దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడం, డాలర్ పెరుగుదల, ట్రంప్ ఆంక్షల దెబ్బకు సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయి 23,048, సెన్సెక్స్ 1074 పాయింట్లు ఎరుపెక్కి 76,223 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.10లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్ మినహా నిఫ్టీలో అన్ని షేర్లూ క్రాష్ అయ్యాయి.
Sorry, no posts matched your criteria.