news

News November 10, 2025

19న పుట్టపర్తికి PM మోదీ రాక: CBN

image

AP: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న PM మోదీ పుట్టపర్తికి రానున్నారని CM CBN తెలిపారు. అలాగే 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రుల కమిటీ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. కాగా 65 ప్రత్యేక రైళ్లతో పాటు ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుపనుందని అధికారులు వివరించారు.

News November 10, 2025

JE, SI పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన SSC

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) జూనియర్ ఇంజినీర్, SI పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్స్ డిసెంబర్ 3 నుంచి 6 వరకు, ఎస్సై పోస్టులకు డిసెంబర్ 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. JE సెల్ఫ్ స్లాట్ సెలక్షన్ నవంబర్ 10 నుంచి 13వరకు, ఎస్సై పోస్టులకు NOV 17 నుంచి 21వరకు ఎంపిక చేసుకోవచ్చు. SI పోస్టులు 3,073 ఉండగా, జూనియర్ ఇంజినీర్ పోస్టులు 1731 ఉన్నాయి.

News November 10, 2025

వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు: గంభీర్

image

హెడ్ కోచ్‌గా తనకు జట్టు ప్రదర్శనే ముఖ్యమని గంభీర్ తెలిపారు. ‘క్రికెట్ వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించింది కాదని నమ్ముతాను. మేము ODI సిరీస్ ఓడిపోయాం. కోచ్‌గా ఇండివిడ్యువల్ గేమ్‌ను మెచ్చుకోవచ్చు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా సిరీస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోలేను. T20 సిరీస్‌‌ వేరే.. అందులో గెలిచాం. దానిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ WCకి ముందు మేమనుకున్న చోట లేము’ అని తెలిపారు.

News November 10, 2025

₹750 కోట్లతో నేచురోపతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: మంత్రి

image

AP: తొలిసారిగా ‘అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ రాష్ట్రంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ₹750 కోట్లతో కేంద్రం నెలకొల్పే దీనిలో బ్యాచ్‌లర్ ఆఫ్ నేచురోపతి యోగా సర్జరీలో 100 సీట్లు, PGలో 20 సీట్ల చొప్పున తొలి ఏడాదిలో ఉంటాయన్నారు. దీనికోసం 40 ఎకరాలు కావాలని కేంద్రం లేఖ రాసిందని చెప్పారు. 450 పడకల నేచురోపతి ఆసుపత్రీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

News November 10, 2025

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలా?

image

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి పీల్చలేక వేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ శుభ్రమైన గాలితో పాటు కనెక్టివిటీ బాగుంటుందని వివిధ రాష్ట్రాల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని పలు కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్‌కు తరలించాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 10, 2025

భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

image

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్‌ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.

News November 10, 2025

ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

image

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.

News November 10, 2025

మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

image

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్‌కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 10, 2025

PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణమిదే!

image

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారన్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘గైడ్‌లైన్స్ ప్రకారం 2019 FEB 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్లీ జాబితాలో చేర్చుతాం’ అని పేర్కొంది.