news

News August 5, 2024

అలాంటి ఆప్షన్ ఏదీ లేదు: గడ్కరీ

image

టోల్ ఫీజుల చెల్లింపుల‌కు వాహ‌నదారులు నిర్ణీత దూరం (100 మీ) లేదా స‌మ‌యం (10 Min) మించి ఉన్నా ఫీజు చెల్లించాల్సిందేనని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మిన‌హాయింపులు లేవని క్లారిటీ ఇచ్చారు. NH రుసుము నియమాలు-రాయితీ ఒప్పందం ప్ర‌కారం 60 KM (37 మైళ్లు) దూరంలో ఉన్న టోల్ ప్లాజాల‌కు కూడా ఫీజు వ‌సూలు చేసే అనుమ‌తి ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

News August 5, 2024

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

image

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుమూశారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపింది. గత రెండేళ్లుగా గ్రాహం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. తన అంతర్జాతీయ కెరీర్‌ను 1993లో ప్రారంభించారు. టెస్టుల్లో 100 మ్యాచులాడి 6744 రన్స్, వన్డేల్లో 82 మ్యాచులాడి 2380 రన్స్ చేశారు. 2002లో వన్డేలు, 2005లో టెస్టుల నుంచి రిటైరయ్యారు.

News August 5, 2024

‘రావూస్’ ఘటన: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

image

నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్‌లో వరదలో మునిగి విద్యార్థులు <<13724979>>చనిపోయిన<<>> ఘటనను సుమోటోగా స్వీకరించింది. వాటిలో భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

News August 5, 2024

రోబోట్లు షూటింగ్‌లో మెడల్స్ సాధిస్తాయా? మస్క్ రిప్లై ఇదే

image

టర్కీ స్టైలిష్ షూటర్ <<13750054>>యూసుఫ్<<>> టెస్లా CEO ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం పలికారు. ‘భవిష్యత్తులో రోబోట్లు తమ చేతులను జేబులో పెట్టుకుని ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధిస్తాయని మీరనుకుంటున్నారా? దీనిపై ఇస్తాంబుల్‌లో డిస్కస్ చేద్దాం’ అని ట్వీట్ చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ‘రోబోట్లు ప్రతిసారీ టార్గెట్లను చేరుకుంటాయి. ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో పర్యటనకు ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు.

News August 5, 2024

ఇదీ హెజ్బొల్లా ప్ర‌స్థానం

image

హెజ్బొల్లా అనేది లెబనాన్‌ దేశానికి చెందిన షియా ముస్లిం మిలిటెంట్- రాజకీయ సంస్థ. ఇది 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత, ఇరాన్, సిరియా మద్దతుతో 1985లో ఏర్పడింది. ఇజ్రాయెల్ ఆక్రమణను ప్రతిఘటించడం సహా లెబనాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించడమే దీని లక్ష్యం. దీన్ని యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్లు తీవ్రవాద సంస్థగా పరిగణిస్తాయి. హెజ్బొల్లా అంటే Party of God అని అర్థం.

News August 5, 2024

నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.. ట్విస్ట్ ఏంటంటే!

image

కోర్టు కేసు విచారణలో జాప్యం ఓ ఖైదీకి శాపంగా మారిన ఘటన ఇది. సిద్ధిపేట(D) పెద్దగుండవెల్లికి చెందిన పోచయ్య తల్లిని హత్య చేసిన కేసులో 2013లో అరెస్టయ్యారు. సిద్దిపేట కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా, దీనిపై ఆయన కుమారుడు హైకోర్టుకెళ్లారు. ఈ జులైలో హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేల్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2018లో అనారోగ్యంతో పోచయ్య జైలులోనే మరణించారు. మృతిపై సమాచారం లేక హైకోర్టు కేసును విచారించింది.

News August 5, 2024

ఏ క్ష‌ణ‌మైనా దాడులు జ‌ర‌గొచ్చు: అమెరికా

image

ప‌శ్చిమాసియాలో ఏ క్షణం ఏం జ‌రుగుతుందో అన్న భ‌యాలు వెంటాడుతున్నాయి. ఇరాన్‌, హెజ్బొల్లా రాబోయే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై దాడికి తెగ‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని జీ7 దేశాలను అమెరికా హెచ్చ‌రించింది. స‌న్నిహిత దేశాలతో స‌మ‌న్వ‌యం చేసుకొని ఇరాన్‌, హెజ్బొల్లా దాడులు చేయకుండా ఒత్తిడి తీసుకురావ‌డానికి US సెక్రటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్ జీ7 దేశాలతో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వహించిన‌ట్టు తెలుస్తోంది.

News August 5, 2024

బ్లడ్ బాత్: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

image

అమెరికాలో మాంద్యం భయాలు తలెత్తడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికే భారత మార్కెట్ రూ.10 లక్షల కోట్లను కోల్పోయినట్లు అంచనా. జపాన్ 10శాతం, దక్షిణ కొరియా, తైవాన్ చెరో 8శాతం నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్ల మేర నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.80కి పడిపోయింది. పలు ప్రధాన సంస్థల షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.

News August 5, 2024

పుష్ప-2పై BIG UPDATE

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2 విడుదల మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతం అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ట్వీట్ చేశారు. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 5, 2024

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు: కేటీఆర్

image

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. న్యాయనిపుణులతో పార్టీ సీనియర్లు చర్చిస్తున్నారని, త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతలపై స్పష్టత వస్తుందని, వారిపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని పేర్కొన్నారు.

error: Content is protected !!