news

News February 11, 2025

అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్

image

అదానీ గ్రూప్‌పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్‌తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్‌కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్‌లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.

News February 11, 2025

సైఫ్‌కు ప్లాస్టిక్ కత్తి ఇచ్చిన కొడుకు.. ఎందుకంటే?

image

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన చిన్న కొడుకు జెహ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లలు బాగానే ఉన్నారు. దేవుడికి ధన్యవాదాలు. ‘మళ్లీ దొంగ ఇంట్లోకి వస్తాడేమో. ఇది మీ దగ్గర ఉంచుకోండి’ అని జెహ్ ఓ ప్లాస్టిక్ కత్తి ఇచ్చాడు. ‘అబ్బాను గీత కాపాడింది. అబ్బా నన్ను కాపాడాడు’ అని తను చెప్పాడు’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

News February 11, 2025

ఐదేళ్ల విధ్వంసంతో వెనకబడ్డాం: CM చంద్రబాబు

image

AP: గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. ‘సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. ఆరు నెలల పాలనలో 12.94% వృద్ధిరేటు కనబడింది. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలి. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM అన్నారు.

News February 11, 2025

రోహిత్‌లాగే కోహ్లీ ఫామ్‌లోకి వస్తారు: మురళీధరన్

image

రోహిత్ శర్మలానే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ అందుకుంటారని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. భారత్‌తోపాటు పాక్, బంగ్లా, అఫ్గాన్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరికి పాకిస్థాన్ పిచ్‌లు బాగా సహకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News February 11, 2025

2029 కల్లా 63లక్షల ఎయిడ్స్ మరణాలు: ఐరాస

image

ఎయిడ్స్ నియంత్రణకు ఏటా US ఇచ్చే రూ.3,83,160కోట్ల సాయాన్ని ట్రంప్ నిలిపేయడంపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కొత్త HIV కేసులు 6 రెట్లు పెరుగుతాయని చెప్పింది. 2029 కల్లా 63 లక్షల ఎయిడ్స్ మరణాలు సంభవిస్తాయంది. 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయని, ట్రంప్ నిర్ణయంతో ఇప్పటి వరకు 160 దేశాల్లో వచ్చిన ఫలితాలు వృథా అవుతాయంది. ఇథియోపియా, ఉగాండా, మొజాంబిక్ దేశాల్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువ.

News February 11, 2025

ఆప్ MLA అరెస్టుకు రంగం సిద్ధం!

image

ఢిల్లీలోని ఓక్లా MLA అమనతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్‌ తప్పించుకొనేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని FIR నమోదైంది. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీస్ టీమ్‌ను అడ్డుకున్నారని, పబ్లిక్ సర్వెంట్స్‌పై దాడిచేశారని అందులో ప్రస్తావించారు. ఆమ్‌ఆద్మీ పార్టీలో అమనతుల్లా ఖాన్ కీలక నేత. CAA, NRC అల్లర్లు జరిగిన షాహీన్‌బాగ్ ఆయన నియోజకవర్గంలోనే ఉంది.

News February 11, 2025

మాఘపౌర్ణమినాడు పుణ్య స్నానం ఎందుకు చేయాలంటే?

image

ఈ నెల 12న మాఘపౌర్ణమి రానుంది. మాఘ పౌర్ణమినాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా గంగలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పుణ్య నదులు, సముద్రంలో తలస్నానం ఆచరించాలి. సూర్య భగవానుడు, గంగా నదిని స్మరిస్తూ తర్పణాలు వదిలితే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని ప్రతీతి. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయాలి. ఆరోజు చేసే హోమాలకు, సత్యనారాయణస్వామి వ్రతానికి కోటి రెట్ల పుణ్య ఫలం లభిస్తుంది.

News February 11, 2025

40 రోజుల్లో రూ.9వేలకు పైగా పెరిగిన గోల్డ్ ధర

image

2025, జనవరి 1న 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.71,500. నిన్న ఆల్ టైం రికార్డ్ ధర రూ.80,600కు చేరింది. అంటే 40రోజుల్లో రూ.9వేలకు పైగా పెరిగింది. ట్రంప్ రాకతో US డాలర్ బలపడగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండటంతో పసిడి ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

News February 11, 2025

మరింత ముదురుతున్న యుద్ధం!

image

చైనా, US మధ్య ట్రేడ్‌వార్ మరింత ముదురుతోంది. ట్రంప్ టారిఫ్స్‌కు ప్రతీకారంగా Nvidia, Apple, Google, Broadcom, Synopsys వంటి US టెక్ కంపెనీలపై చైనా స్క్రూటినీ ఆరంభించింది. ఆంక్షల అమలుకు సిద్ధమవుతోంది. కాంట్రాక్టులను ఆలస్యం చేస్తోంది. దీంతో సప్లయి చైన్ దెబ్బతిని ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఆయా కంపెనీల వ్యూహాలు, ఉత్పత్తికి ఇబ్బందులు వస్తాయి. ఏదేమైనా ట్రంప్, జిన్‌పింగ్‌లో ఎవరూ తగ్గేలా లేరు.

News February 11, 2025

తెలంగాణలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు వెళ్లనున్నారు. సా.5.30 గం.కు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. రాత్రి 7.30 తర్వాత ఆయన రైలులో తమిళనాడు బయల్దేరతారు. రాహుల్ ఆకస్మిక పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.