news

News August 4, 2024

ఇవాళ ‘నాగార్జున సాగర్’ గేట్లు ఓపెన్

image

కృష్ణా నది పరివాహకంలో వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ నీటిమట్టం పెరిగింది. సాగర్ నిండేందుకు మరో 60 టీఎంసీలు అవసరం కాగా గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తగా 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద సాగర్‌కు వస్తోంది.

News August 4, 2024

బోణీ కొడతారా?

image

తొలి వన్డేలో చేజేతులా విజయాన్ని చేజార్చుకున్న భారత్, నేడు శ్రీలంకతో రెండో వన్డే ఆడనుంది. తొలి మ్యాచులో పొరపాట్లను రిపీట్ చేయకుండా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రోహిత్ సేన చూస్తోంది. వికెట్ కీపర్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉండగా పరాగ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్, రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.

News August 4, 2024

తెరపైకి ‘డార్క్ టూరిజం’

image

కేరళలో ప్రకృతి విపత్తుతో ‘డార్క్ టూరిజం’ తెరపైకి వచ్చింది. దీనర్థం విషాదకర సంఘటనలు, విపత్తులు, మరణాలు జరిగిన ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు/ప్రజలు రావడమే. దీనిని గ్రీఫ్ లేదా బ్లాక్ టూరిజమని పిలుస్తుంటారు. విపత్తుల వల్ల కలిగిన ప్రభావాలను చూసేందుకు కొందరు వెళ్తే, మరికొందరు మరణించిన వారికి నివాళులు ఇచ్చేందుకు, ఇంకొందరు సంఘటనల గురించి తెలుసుకోవడానికి వెళ్తుంటారు.

News August 4, 2024

ఆ టీవీ షోలతో పాపులారిటీ!

image

వాటర్లూ యుద్ధం(డచ్) సమయంలోనే ఈ డార్క్ టూరిజం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే చెర్నోబిల్, ది డార్క్ టూరిస్ట్ వంటి TV షోలతో దీనికి పాపులారిటీ పెరిగినట్లు తెలిపింది. ఇటలీలోని పాంపీ, పోలాండ్‌లోని ఆష్విట్జ్, న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్, అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ మునిగిన ప్రాంతం వంటివి ఈ టూరిజం కోవలోకి వస్తాయి. మరోవైపు వయనాడ్‌కు ఈ సమయంలో ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు.

News August 4, 2024

ఒలింపిక్స్: లక్ష్యసేన్, లవ్లీనా ఏం చేస్తారో?

image

ఇవాళ పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌ సెమీస్‌లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ డెన్మార్క్ ప్లేయర్ విక్టర్‌తో తలపడనున్నారు. ఇందులో గెలిస్తే సరికొత్త చరిత్ర నమోదవ్వడమే కాకుండా భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. ఓడితే కాంస్యం కోసం పోరాడాల్సి ఉంటుంది. మరోవైపు హాకీలో భారత్, బ్రిటన్ క్వార్టర్ ఫైనల్లో తలపడున్నాయి. మహిళల బాక్సింగ్ QFలో లవ్లీనా బరిలో ఉంది. పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.

News August 4, 2024

మూసీ ప్రక్షాళనకు రూ.3,849 కోట్లు కేటాయింపు

image

TG: మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 ఎన్టీపీల నిర్మాణానికై జలమండలికి అనుమతులిచ్చింది. అంతేకాకుండా రూ.3,849.10 కోట్లు కేటాయిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించగా తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.

News August 4, 2024

మరోసారి మోదీనే..

image

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ మరోసారి తొలిస్థానంలో నిలిచారు. USకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించగా గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ ర్యాంకులను రిలీజ్ చేసింది. దీనిలో 69% ఓట్లతో మోదీ అగ్రస్థానంలో నిలవగా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్(63%) తర్వాతి స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందించిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని పుమియో కిషిదా చివరి స్థానంలో నిలిచారు.

News August 4, 2024

మన ఫ్రెండల్లె ఇంకెవడుంటాడు..

image

జీవితంలో ఎందరో పరిచయమైన నిజమైన స్నేహితుడు ఒక్కడుంటే చాలు.. లైఫ్ హ్యపీగా సాగుతుంది. అలాంటి మిత్రుడితో రోజూ మాట్లాడకపోయినా కలిసి ఒకే చోట ఉండకపోయినా ఎలాంటి విబేధాలు ఉండవు. కష్టసుఖాలను సమానంగా పంచుకుంటాడు. నీపై నీకే నమ్మకం లేని సమయంలో నిన్ను నమ్మి అండగా ఉంటాడు. కొట్టినా తిట్టినా తిరిగి ఒక్కటవుతాడు. కుల, మత, స్థాయి పట్టింపులు లేని స్నేహ బంధం అన్నింటి కంటే గొప్పది.

News August 4, 2024

రాయన్ మూవీ కలెక్షన్లు ఎంతంటే?

image

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.72.75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గతంలో ధనుష్ నటించిన ‘తిరు’, ‘సార్’ సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. ప్రస్తుతం రాయన్ ఇదే జోరును కొనసాగిస్తే ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశముంది.

News August 4, 2024

ఆగస్టు 4: చరిత్రలో ఈరోజు

image

1755 : పెన్సిల్ కనిపెట్టిన నికోలస్ జాక్వె కోంటె జననం
1929 : హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ జననం
1948 : భారత రాజకీయ నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు జననం
1961 : అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా జననం
1965 : డైరెక్టర్, రచయిత, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ జననం