news

News August 3, 2024

Viral: మస్క్ పిల్లలతో పీఎం మోదీ ఫొటో

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పిల్లలకు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఓ పాత ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. డోజ్ డిజైనర్ అనే ట్విటర్ హ్యాండిల్ ఈ ఫొటోను ట్వీట్ చేసింది. దానికి మస్క్ సమాధానమివ్వడంతో ఫొటో వైరల్ అయింది. తన రిప్లైలో ‘డామియన్ అండ్ కై’ అంటూ పిల్లల పేర్లను మస్క్ వెల్లడించారు. మోదీతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, తాను ఆయన ఫ్యాన్‌‌నని గతంలో మస్క్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

News August 3, 2024

లక్ష్యసేన్‌తో పోరాడిన ప్లేయర్‌కు క్యాన్సర్.. కానీ!

image

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్‌ చేతిలో ఓడిన చైనా ఆటగాడు చౌ టియెన్ చెన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌కు ఆయన గతేడాది చికిత్స తీసుకున్నారు. కానీ ఈ విషయాన్ని టియెన్ ఎక్కడా బయటపెట్టలేదు. శరీరం అంతగా సహకరించపోయినా ఆయన ఒలింపిక్స్ బరిలో నిలిచారు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
<<-se>>#Olympics2024<<>>

News August 3, 2024

మోదీ చెప్పిన ‘కృషి పరాశర’ గ్రంథం ఏంటి?

image

వ్యవసాయంపై పరాశర మహర్షి 2000 ఏళ్ల క్రితమే <<13767183>>‘కృషి’ <<>>గ్రంథం రాశారు. కృషికి సేద్యమని అర్థం. ఇందులో వివిధ ఛందస్సుల్లో 240 శ్లోకాలు ఉన్నాయి. ఏయే మాసాల్లో ఎంత వర్షం కురుస్తుంది, భూమిని ఎప్పుడు, ఏ మేరకు, ఎలా చదును చేయాలి, విత్తనాలు ఎలా సేకరించాలి, ఎలా విత్తుకోవాలి, సస్య రక్షణ, ఎరువుల వాడకం, ఆవులు, గేదెలు సహా జీవాలను ఉపయోగించుకోవడం, వాటిపై పనిభారం, పంట కోత, పంట మార్పిడి, భూమి నిర్వహణ అంశాలను వివరించారు.

News August 3, 2024

KL రాహుల్, అతియా శెట్టి గొప్ప మనసు!

image

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, భార్య అతియా శెట్టి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగ చిన్నారుల కోసం వారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. లెజెండరీ క్రికెటర్ల వస్తువులను వేలం వేసి, ఆ డబ్బును దివ్యాంగులకు విరాళంగా ఇవ్వనున్నారు. గతంలోనూ రాహుల్ ఇలా తన బ్యాటు, జెర్సీ వంటివి వేలం వేసి వచ్చిన డబ్బును వారికి ఇచ్చారు. దీంతో రాహుల్, అతియా జంటను పలువురు అభినందిస్తున్నారు.

News August 3, 2024

ఆ ఒక్కడి కోసం 16మంది ఖైదీలను వదిలేసిన పుతిన్

image

రష్యా ఆవిర్భావం తర్వాత జరిగిన అతి పెద్ద ఖైదీల మార్పిడిలో రష్యా గత నెలలో 16మంది పాశ్చాత్య ఖైదీలను వదిలేసింది. బదులుగా 8మంది రష్యన్లను విడిపించుకుంది. క్రషికోవ్ అనే ఒక్కడి కోసం రష్యా ఈ డీల్ ఒప్పుకొంది! పుతిన్‌ శత్రువుల్ని చంపడం అతడి పని. జర్మనీలో 2019లో హత్య చేసి పట్టుబడి జైలుపాలయ్యాడు. అతడిని విడిపించేందుకే పుతిన్ ఖైదీల్ని వదిలేశారు. క్రషికోవ్‌ను ఆయనే ఎయిర్‌పోర్టుకు వచ్చి రిసీవ్ చేసుకోవడం విశేషం.

News August 3, 2024

టీడీపీ వచ్చినా నాకు న్యాయం జరగట్లేదు: బుద్దా వెంకన్న

image

AP: పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నానంటూ ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకల్లో బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఐల బదిలీల విషయంలో నా మాట చెల్లలేదు. వైసీపీ పాలనపై అనేక పోరాటాలు చేశాను. నాపై 37 కేసులున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినా నాకు న్యాయం జరగట్లేదు. వ్యతిరేకతతో కాదు, ఆవేదనతో మాత్రమే ఈ విషయాన్ని చెబుతున్నా. నా ఆవేదనను అధిష్ఠానం దృష్టికి ఎంపీ కేశినేని చిన్ని తీసుకెళ్లాలి’ అని కోరారు.

News August 3, 2024

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

image

* ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్‌- టీకే శ్రీదేవి
* మునిసిపల్‌శాఖ ఉపకార్యదర్శి- ప్రియాంక
* HMDA ఎండీ- చంద్రశేఖర్ రెడ్డి
* మార్క్‌ఫెడ్ ఎండీ- శ్రీనివాస్ రెడ్డి
* విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి- S.హరీశ్
* వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌- రిజ్వీ(అదనపు బాధ్యతలు)
* మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌- ఉదయ్ కుమార్‌(అదనపు బాధ్యతలు)

News August 3, 2024

జీతాలు చెల్లించాలని మంత్రికి వాలంటీర్ల విజ్ఞప్తి

image

AP: తమను విధుల్లోకి తీసుకోవాలని గత కొద్దిరోజులుగా వాలంటీర్లు అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. తమకు రెండు నెలలుగా బకాయి పడ్డ గౌరవ వేతనం అందించాలని విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్రను తాజాగా పలువురు కలిసి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో తాము చేసిన రాజీనామాలను బలవంతంగా చేసినవిగా గుర్తించాలని కోరారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రికి వినతిపత్రం అందించారు.

News August 3, 2024

అందుకే టెస్టులపై ఆసక్తి పోయింది: రస్సెల్

image

టీ20 లీగ్స్‌లో కావాల్సినంత డబ్బు వస్తుండటంతో చాలా మంది ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌కే పరిమితమవుతున్నారని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ అన్నారు. ఈ ఒక్క కారణంతోనే టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తి చూపడం లేదని చెప్పారు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగానే క్రికెటర్లు కూడా తయారవుతున్నారని పేర్కొన్నారు. కాగా వెస్టిండీస్ ప్లేయర్లు పొలార్డ్, పూరన్, పావెల్ వంటి ఆటగాళ్లు ఇంతవరకూ ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు.

News August 3, 2024

వయనాడ్ విపత్తు: గతంలో పశ్చిమ కనుమలపై రిపోర్ట్స్

image

పశ్చిమ కనుమలపై గతంలో కస్తూరీ రంగన్, మాధవ్ గాడ్గిల్ ఇచ్చిన రిపోర్టులపై ఆసక్తి నెలకొంది. కొన్ని సూచనలివి
* <<13766800>>ESZ 1<<>>, 2గా కనుమల విభజన
* గనులు, క్వారీలపై నిషేధం
* 30% ప్రవాహం ఉన్న చోటే Dams, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం
* థర్మల్ విద్యుత్, రెడ్, ఆరెంజ్ ఇండస్ట్రీస్‌పై BAN
* రోడ్డు, రైల్వే లైన్లకు అడ్డగోలు అనుమతులు వద్దు
* పరిమితంగా టూరిజం
* ఎకానమీకి నష్టమని 6 రాష్ట్రాలు వీటిని వ్యతిరేకించాయి