news

News August 3, 2024

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: ఉద్యోగినుల కోసం అవసరమైన ప్రతిచోటా మహిళా హాస్టళ్లను ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్, డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆ వసతి గృహాల పక్కనే పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. భవనాలను ప్రభుత్వమే అద్దెకు తీసుకుని నిర్వహించనుంది. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకు తీసుకెళ్లనున్నారు.

News August 3, 2024

నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకుల విడుదల

image

AP: 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి నీట్ యూజీలో 43,788 ర్యాంకుల్ని NTA ప్రకటించింది. 720 మార్కులకు గాను అన్‌రిజర్వుడు/EWS కేటగిరీకి 162, OBC/SC/ST విభాగాలకు 161-127, OBC/SC/ST(PWD) కేటగిరీలకు 143-127 మార్కుల్ని కటాఫ్‌గా ప్రకటించారు. ఇక వైద్యవిద్య కోర్సుల్లో అఖిల భారత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. అది ముగిశాక రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు.

News August 3, 2024

వర్గీకరణ అప్పుడే అమలు చేయండి: వెంకన్న

image

TG: అన్ని కులాల జనాభా లెక్కలు తేల్చిన తర్వాతే వర్గీకరణ అమలు చేయాలని MLC గోరటి వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. సామాజికంగా మాదిగ వర్గానికి రావాల్సిన హక్కులు అందాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ఎస్సీలపై దాడులు జరిగినప్పుడు గొంతెత్తని వారు ఇప్పుడు మా వర్గీకరణ విషయంలో ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విభేదాల కోసమా? మాదిగలు, మాలలు ఐక్యంగా రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన ఉమ్మడి వాటా తీసుకోవాలి’ అని ఆయన సూచించారు.

News August 3, 2024

స్కూల్ విద్యార్థులకు శుభవార్త

image

TG: పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి, ఆగస్ట్ 15, జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, నిత్యం గంట స్పోర్ట్స్ పీరియడ్ పెట్టాలని MLCలు ఆయన దృష్టికి తేవడంతో ఈ ప్రకటన చేశారు.

News August 3, 2024

ప్రభాస్ కొత్త సినిమా 17న షురూ?

image

కల్కి సినిమా సూపర్ హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఈ నెల 17న మూవీ ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ టాక్. ‘ఫౌజీ’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తారని, ప్రభాస్ సైనికుడి పాత్ర పోషిస్తారని సమాచారం. ఇటీవల విడుదలైన రాజాసాబ్ గ్లింప్స్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డార్లింగ్ నుంచి వరుస అప్డేట్స్‌లో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

News August 3, 2024

వర్గీకరణ తీర్పుపై అప్పీల్ చేస్తాం: చెన్నయ్య

image

TG: వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన <<13751609>>తీర్పుపై<<>> రివ్యూ పిటిషన్ వేస్తామని మాల ప్రజాసంఘాల JAC ఛైర్మన్ జి.చెన్నయ్య వెల్లడించారు. ఈ తీర్పుతో మాల, ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ తీర్పు ఆర్టికల్ 341కి విరుద్ధమన్నారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 8,9,10 తేదీల్లో ఢిల్లీలో నిరసనలు చేస్తామని పేర్కొన్నారు. అటు సామాజిక స్థితిగతులు తెలుసుకోకుండా వర్గీకరణ చేస్తామని CM రేవంత్ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు.

News August 3, 2024

గ్రహాంతరవాసికి గుడి కట్టి పూజలు

image

దేవుళ్లకు గుడి కట్టడం సహజం. ఇటీవల అభిమాన నటీనటులు, పేరెంట్స్, భార్య, పిల్లల జ్ఞాపకార్థమూ ఆలయాలు కడుతున్నారు. అయితే తమిళనాడులోని సేలంలో సిద్ధర్ అనే వ్యక్తి అగస్త్య మహర్షితో పాటు ఏలియన్‌కు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతరవాసులు పుట్టారని, ఈ విషయాన్ని అగస్త్యుడు గ్రంథాలలో రాశారని అతను చెబుతున్నారు. అందుకే విగ్రహం ప్రతిష్ఠించి పూజిస్తున్నానని తెలిపారు.

News August 3, 2024

Olympics: 20 ఏళ్లలో తొలిసారి.. 60 ఏళ్లలో మరోసారి

image

ఒలింపిక్స్‌లో సత్తా చాటాలనే కోరిక ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారో షూటర్. వెనిజులాకు చెందిన లియోనల్ మార్టినెజ్ 20ఏళ్ల కుర్రాడిగా 1984 ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. తర్వాత ఆటకు దూరమయ్యారు. 40 ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ ఆటపై మనసు మళ్లింది. గతేడాది పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 60 ఏళ్ల వయసులో ట్రాప్ ఈవెంట్‌లో పాల్గొని 28వ స్థానంలో నిలిచారు.
<<-se>>#Olympics2024<<>>

News August 3, 2024

వ్యవసాయ శాఖలో ఇవాళ్టి నుంచి బదిలీలు

image

TG: రుణమాఫీతో ఇన్నిరోజులు వాయిదా పడిన బదిలీలు ఇవాళ్టి నుంచి వ్యవసాయ శాఖలో జరగనున్నాయి. మ.1.30 నుంచి 3 గంటల వరకు 1వ మల్టీజోన్‌లోని గ్రేడ్-1 AEOలను బదిలీ చేస్తారు. ఆ తర్వాత జోన్-1,2,3,4 పరిధిలోని AEOలు, గ్రేడ్-2 AEOల బదిలీలు నిర్వహిస్తారు. మ.3 గంటల నుంచి మల్టీజోన్-2లోని గ్రేడ్-1 AEOలు, అనంతరం జోన్-5,6,7, గ్రేడ్-2 AEOల బదిలీల కౌన్సెలింగ్ జరుపుతారు. ఆ తర్వాత మండల, జిల్లా అధికారుల బదిలీలు ఉంటాయి.

News August 3, 2024

Olympics: ‘మను’ చరిత్ర సృష్టించేనా?

image

ఇప్పటికే 2 పతకాలు సాధించిన షూటర్ మనూ భాకర్ ఇవాళ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఉమెన్స్ 25m. పిస్టల్ ఫైనల్ ఈవెంట్‌లో ఆమె పోటీ పడనున్నారు. ఇందులో మెడల్ గెలిస్తే ఒకే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 3 పతకాలు సాధించిన ఏకైక వ్యక్తిగా మను చరిత్ర సృష్టించనున్నారు. ఇక షూటింగ్‌లో అనంత్‌జీత్, మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్, ఆర్చరీలో దీపికా కుమారి, భజన్ కౌర్ బరిలో ఉన్నారు. పూర్తి షెడ్యూల్ కోసం పైన ఫొటోలు చూడొచ్చు.