news

News August 2, 2024

సాటి కుక్కకు రక్తదానం.. ప్రాణం పోసిన శునకం

image

మనుషుల పట్ల విశ్వాసం చూపడమే కాదు సాటి కుక్కకు సాయం చేయడంలోనూ ముందుంటానని ఓ శునకం నిరూపించింది. కర్ణాటకలోని కొప్పళలో ల్యాబ్రడార్ జాతి కుక్క రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉండటంతో డాబర్‌మేన్ కుక్కుల యజమానులను వైద్యులు సంప్రదించారు. భైరవ అనే ఓ కుక్క రక్తం సరిగ్గా సరిపోవడంతో దాని నుంచి 300ML సేకరించి, ల్యాబ్రడార్‌కు ఎక్కించారు. దీంతో అది ప్రాణాపాయం నుంచి బయటపడింది.

News August 2, 2024

విజయ్ దేవరకొండ ‘VD12’ రిలీజ్ డేట్ ఫిక్స్

image

విజయ్ దేవరకొండ హీరోగా ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంది.

News August 2, 2024

బాలయ్య, రామ్ మల్టీస్టారర్ మూవీ?

image

నందమూరి బాలకృష్ణ, రామ్ పోతినేని కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించనున్నట్లు క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు టాక్. కాగా బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమాతో, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో బిజీగా ఉన్నారు.

News August 2, 2024

సరికొత్త రికార్డ్‌కు చేరువలో లక్ష్యసేన్

image

బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో నేడు చౌ టియాన్ చెన్‌ (తైవాన్)తో తలపడనున్న లక్ష్యసేన్‌ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ గేమ్ గెలిస్తే మెన్స్ కేటగిరీలో సెమీస్‌ చేరిన తొలి భారతీయ ఆటగాడిగా నిలుస్తారు. గతంలో పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్ మాత్రమే క్వార్టర్స్ చేరారు. ఇప్పటివరకు చౌతో సేన్ నాలుగుసార్లు తలపడగా ఒక్కసారే గెలవడంతో ఈ మ్యాచ్‌పై (రా.9.05కు) ఉత్కంఠ నెలకొంది. <<-se>>#Olympics2024<<>>

News August 2, 2024

సీఎంగా తప్పుకొనేది లేదు: సిద్దరామయ్య

image

మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్దరామయ్య విచారణకు హాజరుకావాలంటూ గవర్నర్ థావర్ నోటీసులు పంపించడం కలకలం రేపుతోంది. అయితే గవర్నర్ విచారణకు ఆదేశించినా సరే తాను సీఎంగా తప్పుకొనేది లేదని సిద్దరామయ్య పార్టీ నేతలకు కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఆరోపణలపై చట్టప్రకారం పోరాడతానని ఆయన చెప్పారట. మరోవైపు క్యాబినెట్ సైతం గవర్నర్‌ తీరును తప్పుపడుతూ లేఖ రాయనున్నట్లు సమాచారం.

News August 2, 2024

అసెంబ్లీ వీడియోలు మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ ఆగ్రహం

image

TG: అసెంబ్లీకి సంబంధించిన వీడియోలు మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. ఇలాంటివి క్రియేట్ చేసిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అటు సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం వెల్లడించారు.

News August 2, 2024

దుర్గగుడికి రూ.100 కోట్లు ఇవ్వండి: ఎంపీ చిన్ని

image

AP: విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ను TDP MP కేశినేని చిన్ని కోరారు. తిరుమల తర్వాత APలో అతిపెద్ద ఆలయంగా దుర్గగుడి ప్రసిద్ధి పొందిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోజుకు 25వేల మంది, శుక్ర, శని, ఆదివారాల్లో 50వేల మంది దుర్గమ్మ దర్శనానికి తరలివస్తుంటారని వివరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News August 2, 2024

ఈ నెలలో రీరిలీజ్‌లు ఎక్కువే!

image

ఈ నెలలో దాదాపు అర డజనుకుపైగా టాలీవుడ్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 2న నాని నటించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, 9న మహేశ్ బాబు నటించిన ‘మురారి’, 8న ‘ఒక్కడు’, 22న చిరంజీవి ‘ఇంద్ర’, 28న నాగార్జున ‘మాస్’, 29న ‘శివ’ చిత్రాలు రీరిలీజ్ కానున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా రీరిలీజ్ అవుతాయని తెలుస్తోంది. మరి మీరు ఏ సినిమాకు వెళ్తారో కామెంట్ చేయండి.

News August 2, 2024

CM రేవంత్‌ను కలిసిన గద్వాల MLA బండ్ల

image

TG: గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. గతంలో BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. ఇటీవల KTRను కలిసిన అనంతరం తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాసేపటి క్రితం సీఎం రేవంత్‌‌రెడ్డిని ఆయన నివాసంలో బండ్ల కలిశారు. నిన్న కృష్ణమోహన్‌ను కలిసి మంత్రి జూపల్లి <<13750949>>నచ్చజెప్పడంతో<<>> ఆయన తిరిగి హస్తం పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

News August 2, 2024

రిజర్వేషన్లను ప్రక్షాళన చేయాలా?

image

దేశంలో రిజర్వేషన్ల <<13758616>>అమలును<<>> పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ రిజర్వేషన్ల ఫలాలు పొందని వారికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రూ.కోట్లు సంపాదించిన వారికి, అత్యున్నత స్థానాలకు చేరిన వారికి రిజర్వేషన్లు ఉంచాలా? అనే దానిపై నేతలు సుదీర్ఘంగా చర్చించి సమన్యాయం చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?