India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. 14న పబ్లిక్ హాలిడేగా పేర్కొంటూ ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు క్యాలెండర్‌లో పొందుపర్చాయి. ఇప్పటికే ఆదివారం హాలిడేస్ రావడంతో సోమవారం కూడా విద్యార్థులకు కలిసొచ్చినట్లయింది. అటు దేశవ్యాప్తంగా బ్యాంకులతోపాటు స్టాక్ మార్కెట్లకు కూడా రేపు సెలవు ఉండనుంది.
జలియన్ వాలాబాగ్ అమరవీరులకు PM మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటమే మలుపు తిరిగిందని ట్వీట్ చేశారు. అమరవీరుల అజేయ స్ఫూర్తిని రాబోయే తరాలు గుర్తుంచుకోవాలన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1919 APR 13న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న వారిపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది గాయపడ్డారు.
✒ ఇంటర్ జవాబు పత్రాల రీకౌంటింగ్‌కు ₹260, రీవెరిఫికేషన్‌కు ₹1,300 ఫీజును నేటి నుంచి 22 వరకు చెల్లించొచ్చు.
✒ ఇంటర్ ఫెయిలైనవారికి, ఇంప్రూవ్‌మెంట్ రాసేవారికి మే 12-20 వరకు పరీక్షలు.
✒ ఈ నెల 15 నుంచి 22 వరకు ఫీజులు చెల్లించాలి.
✒ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు ₹600+ ప్రతి పేపర్‌కు రూ.160.
✒ ఫెయిలైనవారికి పేపర్ల సంఖ్యతో సంబంధం లేకుండా₹ 600, ప్రాక్టికల్స్‌కు ₹275, రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు ₹1,200.
SRH ప్లేయర్ అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. సెంచరీకి చేరువైన సమయంలో అభిషేక్ చాలా అవగాహనతో ఆడారన్నారు ‘శర్మాజీ కే బేటే.. 98దగ్గర సింగిల్, 99వద్ద మరో సింగిల్ తీసిన నీలో ఇంత మెచ్యూరిటీనా?.. నావల్ల కావట్లేదు ‘ అని ట్వీట్ చేశారు. సెంచరీకి చేరువైన సమయంలో భారీ షాట్లకు యత్నించి చాలా సందర్భాల్లో అభిషేక్ అవుటయ్యారు. చండీగఢ్‌లో ఆడుతున్న సమయంలో అభిషేక్‌కు యువీ కోచ్‌గా ఉండేవారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్కీ కేట్(54) కన్నుమూశారు. అతని మరణానికి గల కారణాలు వెల్లడి కాలేదు. 1980లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిక్కీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్, అమెరికన్ యకుజా, ఫాంటమ్స్, ఇన్సోమేనియా, ది బేబీ సిట్టర్ తదితర 40 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే దాదాపు 30 టీవీ సిరీస్‌లలోనూ నటించారు. హాలీవుడ్‌లో కల్ట్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు.
బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర LOP, BJP నేత సువేందు అధికారి స్పందిస్తూ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదని వ్యాఖ్యానించారు. ఇది సీఎం మమత చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర చీఫ్ మజూందార్ విమర్శించారు. కాగా ముర్షీదాబాద్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్నారు. అల్లర్ల ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు.
CSKతో మ్యాచ్‌లో 61 డాట్ బాల్స్ వేసిన KKR 30,500 మొక్కలను నాటినట్లు ప్రకటించింది. అలీ, నరైన్, వరుణ్, హర్షిత్, వైభవ్ మొక్కలను నాటుతున్నట్లు రూపొందించిన ఫొటోను షేర్ చేసింది. ఒక ఇన్నింగ్సులో ఇన్ని డాట్స్ వేయడం IPL చరిత్రలోనే తొలిసారి. దీంతో చెపాక్ స్టేడియంలో చెట్లతో నిండిపోయిన మీమ్స్ వైరలయ్యాయి. కాగా పర్యావరణ సంరక్షణలో భాగంగా ఒక్కో డాట్‌కు 500 చెట్లు నాటే కార్యక్రమానికి 2023లో BCCI శ్రీకారం చుట్టింది.
వేసవి వచ్చింది. ఎండలతో పాటు మామిడి పండ్లనూ తెచ్చింది. దేశంలో విరివిగా కాసే మామిడిలో ఎన్నో రకాలున్నాయి. బంగినపల్లి, మల్లికా(AP), ఇమామ్ పసంద్(TG), అల్ఫాన్సో(MH), మాల్గోవా, సింధూర, పైరి, తోతాపురి(KN), బాంబే గ్రీన్(MP), ఫజ్లి, గులాభాస్, చౌసా, జర్దాలు(BH), లంగ్రా, దశరి(UP), నీలం, కేసర్(GT), కిషన్ భోగ్, హిమసాగర్(WB)తో పాటు మరెన్నో రకాలున్నాయి. వీటిలో మీరు టేస్ట్ చేసినవి, మీకు తెలిసినవి కామెంట్ చేయండి.
తజికిస్థాన్‌లో ఇవాళ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై సమాచారం రావాల్సి ఉంది. మయన్మార్‌లోనూ ఇవాళ మరోసారి భూమి కంపించిన విషయం తెలిసిందే.
మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తాయని ప్రచారానికి తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన బలం చేకూరుస్తుంది. ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా NCP ఎంపీ సునీల్ తత్కరీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొనగా శివసేన నేతలెవరూ హాజరుకాలేదు. కాగా తాను ఆహ్వానించినప్పటికీ నేతలెవరూ విందుకు రాలేదని NCP ఎంపీ అన్నారు. దీంతో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమిలో ముసలం పుట్టిందని వార్తలు ప్రచారమవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.