India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైంది. తెల్లవారుజామున, లేట్ నైట్స్ చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల జ్వరాల బారినపడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో ఎండ దంచుతోంది. దీంతో భిన్నమైన వాతావరణం ఉంటోంది.
TG: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 25 నుంచి 31 వరకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ చెల్లించాలని, 58 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి ₹10వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతన్నలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.
AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9గంటల్లోగా విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.
AP: వరద ప్రభావిత జిల్లాల్లో రూ.50 వేల వరకు రుణాలు రీషెడ్యూల్ చేసుకునేవారికి, రూ.50 వేలు కొత్తగా రుణం పొందే వారికి రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, యూజర్ ఛార్జీల చెల్లింపుల నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. VZM, ప.గో, అల్లూరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, GNT, బాపట్ల, పల్నాడు, NTR జిల్లాల వారికి ఇది వర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు ఆగస్టు 30 తరువాత నుంచి 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
TG: తన అనుచరుడు హత్యకు గురికావడంపై MLC జీవన్ రెడ్డి ధర్నా చేయడంతో పాటు పార్టీపైనా <<14422586>>అసంతృప్తి<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుచరుడు చనిపోయాడనే బాధలోనే జీవన్ అలా మాట్లాడారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి MLAలు వచ్చిన చోట ఇబ్బందులను పరిష్కరిస్తాం. జీవన రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబుకి అప్పగించాం’ అని తెలిపారు.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంటారు. రౌడీషీటర్ దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం YSR జిల్లా బద్వేలు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
AP: బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో AP, ఒడిశా, బెంగాల్, TN రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో VZM, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.
AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజెన్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనుంది. జిల్లాల వారీగా మెనూని తీసుకురావాలా? లేదా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మెనూని అమలు చేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.
AP: భూములపై రీ-సర్వే నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ఇప్పటి వరకు 41,112 ఫిర్యాదులు అందాయి. భూ విస్తీర్ణాల తగ్గింపు, పత్రాల్లో తప్పులు, చనిపోయిన వారి పేర్ల ముద్రింపు వంటి సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. గత ప్రభుత్వం రీ-సర్వే చేసి 6,860 గ్రామాల్లో 21లక్షల హక్కు పత్రాలు పంపిణీ చేసింది. ఇందులో 25-30% మేర తప్పులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటిని సరిదిద్దేందుకు సమయం పడుతుందని మంత్రి అనగాని తెలిపారు.
సెలబ్రిటీల చిత్రాల డీప్ ఫేక్ ద్వారా వ్యాపార ప్రకటనల రూపంలో జరుగుతున్న మోసాల కట్టడికి మెటా చర్యలు ప్రారంభించింది. Facebook, Instagramలో ఫేషియల్ రికగ్నీషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. సెలబ్రిటీలు మాట్లాడుతున్నట్టుగానే ప్రకటనల రూపంలో ప్రజల్ని మోసం చేస్తున్న సెలెబ్ బైట్ స్కాంల కట్టడే ఈ కొత్త ఫీచర్ లక్ష్యం. త్వరలో దీన్ని యాడ్ రివ్యూ సిస్టంలో ప్రవేశపెట్టనుంది.
Sorry, no posts matched your criteria.