India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై చర్చించే అవకాశముంది. 13కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
వారందరూ మైనర్లు, విద్యార్థులు. కేరళలోని త్రిస్సూర్ నుంచి మున్నార్ వరకూ టూర్ వెళ్తున్నారు. దారిలో భోజనం కోసం బస్సు ఆగినప్పుడు ఇద్దరు కుర్రాళ్లు గంజాయి బీడీల్ని తాగాలనుకున్నారు. అగ్గిపెట్టె లేకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లి అడిగారు. తీరా చూస్తే అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
TG: బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని అందిన ఫిర్యాదుపై కేంద్రం విచారించి 2017లో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది.
హౌరా-అమృత్‌సర్ రైలుకు అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా పేరుంది. 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్లడం వల్ల ఆఖరి స్టేషన్‌కు చేరుకునేందుకు 37 గంటలు పడుతుంటుంది. బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా 1910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాత్రి 7.15 గంటలకు హౌరా స్టేషన్లో బయలుదేరితే ఎల్లుండి ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుతుంది. టికెట్ ధర తక్కువే కావడంతో ఈ రైలుకు డిమాండ్ ఎక్కువే.
ముడా స్కాంపై తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తానెప్పుడూ నిజాయతీతో కూడిన రాజకీయాలే చేశానని అన్నారు. సీఎం అయినప్పటికీ తనకు సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. మైసూరులో కువెంపు రోడ్డులో ఉన్న ఇల్లు తప్ప మరే ఆస్తి తనకు లేదని, ఆ ఇంటి నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. వెనకబడిన వర్గానికి చెందిన తాను రెండోసారి సీఎం కావడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని దుయ్యబట్టారు.
సింగం ఫ్రాంచైజీలో వస్తున్న సింగం అగైన్‌లో సల్మాన్ స్పెషల్ క్యామియో కన్ఫార్మ్ అయ్యింది. సూపర్ కాప్ నేపథ్యమున్న ఈ చిత్రంలో దబాంగ్‌లో సల్మాన్ నటించిన చుల్‌బుల్ పాండే పాత్రనే ఈ సినిమాలోనూ చేసినట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వస్తున్నా అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టిలకు ఇచ్చిన మాట ప్రకారం సల్మాన్ మంగళవారం షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలిసింది.
యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ టెక్నిక్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సందేహాలు వ్యక్తం చేశారు. ‘అతడి విషయంలో నాకు ఒకటే ప్రధాన లోపం కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ఆడుతున్న టెక్నిక్‌తో బౌన్స్ ఎక్కువగా ఉండే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో బౌన్సర్లు ఆడలేరు. ఆస్ట్రేలియా పర్యటనలో తుది జట్టులో ఛాన్స్ వస్తే ఖాన్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం’ అని పేర్కొన్నారు.
TG: జమిలీ ఎన్నికలతో దేశానికి చాలా ప్రమాదమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు తగ్గుతుందన్న కేంద్రం మాటలు బూటకమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసే హక్కు మోదీకి లేదని మండిపడ్డారు. జమిలీ ఎన్నికల తర్వాత అధ్యక్ష తరహా పాలన వస్తుందని అన్నారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ భార్య నీతా అంబానీ నీళ్లు తాగేందుకు 24 క్యారట్ల బంగారు సీసాను వాడతారని వారి సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ఆ వివరాల ప్రకారం.. డిజైనర్ ఫెర్నాండో ఆల్టమిరానో రూపొందించిన ఆ బాటిల్ విలువ రూ.49 లక్షల వరకూ ఉంటుంది. అందులో తాగే నీటిని ఫ్రాన్స్, ఫిజీ, ఐస్‌లాండ్ దేశాల్లో ప్రకృతిసిద్ధంగా లభించే నీటిని తెప్పించుకుంటారు. అగ్ర కుబేరుడి భార్య అంటే మెయింటెనెన్స్ ఆమాత్రం ఉంటుందిగా!
1979: హీరో ప్రభాస్ జననం
1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెకావత్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణ చార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం
Sorry, no posts matched your criteria.