news

News August 1, 2024

రుణమాఫీ కాని రైతులు ఈ నంబర్‌కు ఫోన్ చేయండి: కిషన్ రెడ్డి

image

TG: రుణమాఫీని పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని BJP రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అన్నదాతల కోసం పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రుణమాఫీ కాని, ఇతర సమస్యలున్న వారు HelpLine 8886100097కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. రుణమాఫీ జరగక రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారుతున్నారని ఆరోపించారు.

News August 1, 2024

భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై ప్రభుత్వం దృష్టి

image

AP: భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం ఉన్న విలువ కంటే 5 నుంచి 10 శాతం పెరగొచ్చని సమాచారం. అలాగే కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉంటే బహిరంగ మార్కెట్ విలువలు తక్కువ ఉన్నాయి. ఈ హెచ్చు తగ్గులపైనా అధికారులు దృష్టిసారించారు. ఈ శాఖపై రేపు CM చంద్రబాబు నిర్వహించే సమీక్షలో విలువ పెంపుపై క్లారిటీ రానుంది.

News August 1, 2024

క్యాబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా

image

AP క్యాబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది. దాన్ని 7వ తేదీకి వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలను 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని సీఎస్ నీరభ్‌కుమార్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

News August 1, 2024

OLYMPICS: కూల్‌గా మెడల్ కొట్టేశాడు!

image

పారిస్ ఒలింపిక్స్‌లో టర్కీకి చెందిన యూసుఫ్ జెక్ వ్యవహారశైలి వార్తల్లో నిలిచింది. అందరి అథ్లెట్లలాగా స్పెషలైజ్‌డ్ లెన్స్, ఐ కవర్, ఇయర్ ప్రొటెక్షన్ వంటివి ఏమీ లేకుండానే ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. సాదాసీదాగా, కూల్‌గా, జేబులో చేయిపెట్టుకుని షూటింగ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
<<-se>>#Olympics2024<<>>

News August 1, 2024

4455 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

దేశంలోని 11 బ్యాంకుల్లో 4455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు, ఫీజు చెల్లింపులు చేయవచ్చు. అక్టోబర్‌లో ప్రిలిమ్స్ జరుగుతాయి. అదే నెల లేదంటే నవంబర్‌లో ఫలితాలు విడుదల చేస్తారు. నవంబర్‌లో మెయిన్స్ నిర్వహించి.. డిసెంబర్/జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి/ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 1, 2024

స్కిల్ యూనివర్సిటీకి నేడు సీఎం శంకుస్థాపన

image

TG: రంగారెడ్డి(D) మీర్‌ఖాన్‌పేటలో CM రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. నెట్ జీరో సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు రైతులకు ప్లాట్లు కేటాయించనున్న లేఅవుట్‌లో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేయనున్నారు. అనంతరం సా.4 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

News August 1, 2024

ఒక్క రోజే 50లక్షలకు పైగా ITRల దాఖలు

image

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITRల దాఖలుకు నిన్నటితో గడువు ముగిసింది. నేటి నుంచి చేయాలంటే రూ.5000 వరకు ఫైన్+వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చివరి రోజైన నిన్న(జులై 31) ఒక్క రోజే 50లక్షలకు పైగా ITRలు నమోదైనట్లు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. మొత్తం 7కోట్లకు పైగా ITRలు దాఖలైనట్లు పేర్కొంది. ట్యాక్స్ పేయర్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపింది.

News August 1, 2024

నేడు ఒలింపిక్స్‌లో..

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ షూటింగ్‌ ఫైనల్‌లో స్వప్నిల్, అథ్లెటిక్స్‌లో 20KM నడకలో పరమ్‌జీత్, అక్ష్‌దీప్, వికాస్, ప్రియాంక పతకం కోసం పోటీ పడనున్నారు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, ప్రణయ్, సింధు, బాక్సింగ్‌లో నిఖత్ ప్రీ క్వార్టర్స్ బరిలో ఉన్నారు. భారత్, బెల్జియం మధ్య హకీ గ్రూప్ మ్యాచ్ జరగనుంది. ఆర్చరీలో ప్రవీణ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
<<-se>>#Olympics2024<<>>

News August 1, 2024

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మళ్లీ వారే!

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీపై సీఎం ఫోకస్ చేశారు. గతంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కొత్తగా ఇద్దరి పేర్లతో క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపవచ్చని హైకోర్టు పేర్కొంది. దీంతో ప్రభుత్వం తిరిగి వారి పేర్లనే పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై తీర్మానం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

News August 1, 2024

ర్యాంప్‌వాక్‌లో తళుక్కుమన్న రష్మిక-విక్కీ

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ ర్యాంప్‌వాక్‌‌లో అదరగొట్టారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా కోచర్ వీక్ 2024లో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో వీరు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇదే కార్యక్రమంలో శోభిత ధూళిపాళ్ల వంటి పలువురు స్టార్లు వేర్వేరు ఫ్యాషన్ డిజైనర్ల కలెక్షన్లతో మెరిశారు.