India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: CM రేవంత్ రెడ్డిపై తప్పుడు పోస్ట్ పెట్టినందుకు HYD సైబర్ క్రైమ్ పోలీసులు BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారు. జులై 29న అర్ధరాత్రి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు CM హాజరుకాలేదంటూ క్రిశాంక్ పోస్ట్ పెట్టడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా కేసుతో క్రిశాంక్‌పై నమోదైన కేసుల సంఖ్య ఏడుకు చేరింది.
చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1653.50కు చేరింది. హైదరాబాద్‌లో రూ.1896గా ఉంది. అటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఓటమిపాలయ్యారు. చైనాకు చెందిన టాప్ సీడ్ సన్ ఇంగ్షా చేతిలో 0-4 తేడాతో పరాజయం చెందారు. ఈ మ్యాచ్‌లో శ్రీజ (10-12, 10-12, 8-11, 3-11) మొదటి 3 సెట్లలో హోరాహోరీగా పోరాడినా చివరికి ఓటమి తప్పలేదు. కాగా మహిళల సింగిల్స్‌లో ప్రి-క్వార్టర్స్‌కు చేరిన రెండో భారత క్రీడాకారిణిగా ఈ తెలుగు తేజం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. <<-se>>#Olympics2024<<>>
తెలంగాణకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌కు, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు కొత్త లైన్లు ప్రారంభించాలని కోరారు. HYD MMTS విస్తరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా రాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
TG: ‘మహిళలకు ఫ్రీ బస్సు’ను అవహేళన చేసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. అలాంటి వారిపై విచారణ జరపాలని స్పీకర్‌ను కోరారు. ఎల్లిపాయలు కొనడానికి, నగరాల్లో తిరగడానికి వెళ్తున్నామంటూ వీడియోలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్రీ బస్సుతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు BRS చెబుతోందని, మెట్రోలో 5 లక్షల మంది వెళ్తుంటే వారిపై ప్రభావం పడలేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయంది. APలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఉ.గోదావరి, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంత, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు పడతాయని APSDMA తెలిపింది.
TG: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో గత నెలాఖరుకు సాగు విస్తీర్ణం 9 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి 83L ఎకరాల్లో పంటలు వేయగా, ఈ ఏడాది 74L ఎకరాల్లోనే సాగు చేశారని తెలిపింది. ముఖ్యంగా వరి, పత్తి, కందులు, మొక్కజొన్న తదితర ప్రధాన పంటల సాగు భారీగా తగ్గిందని పేర్కొంది. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలుగా కాగా, ఇప్పటికి 57 శాతం పంటలే సాగయ్యాయని వివరించింది.
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా కేంద్రం శ్రీకారం చుట్టిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వీపీ సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి నాలుగు నెలలపాటు పశుగణన చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోని దాదాపు 6.6 లక్షల గ్రామాల్లో 30 కోట్ల పశుపెంపకందార్ల నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు. పశురంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
US అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఆమె ఎప్పుడూ ఇండియన్ వారసత్వాన్నే ప్రచారం చేశారు. ఇప్పుడు సడన్‌గా నల్లజాతి మహిళగా పిలిపించుకోవాలనుకుంటున్నారు. కమల ఇండియన్ లేదా బ్లాక్ అనే విషయం నాకు తెలియదు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పేర్కొంది.
AP: రాష్ట్రంలోని టీడీపీలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుండటంతో శ్రావణమాసం రాగానే పదవుల పంపకం ఉండనున్నట్లు సమాచారం. తొలి విడతలో దాదాపు 25 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు టాక్. వీటిలో కొన్ని కూటమిలోని బీజేపీ, జనసేనకు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.