news

News October 22, 2024

నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య.. ప్రభుత్వం సీరియస్

image

HYD బాచుపల్లి సర్కిల్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని <<14415656>>అనూష<<>> ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల కింద కాలేజీ, హాస్టల్‌ను తనిఖీ చేస్తే విద్యార్థులు అనేక సమస్యలను తన దృష్టికి తెచ్చారని చెప్పారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదని ఫైరయ్యారు. కాలేజీల విషయంలో సీఎం రేవంత్ సీరియస్‌గా ఉన్నారని, చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News October 22, 2024

టీమ్‌ఇండియాలో తీవ్ర పోటీ.. అసిస్టెంట్ కోచ్ ఏమన్నారంటే?

image

భారత టెస్టు జట్టులో మిడిలార్డర్ కోసం పోటీ ఎక్కువగా ఉందని అసిస్టెంట్ కోచ్ డస్కాటే అన్నారు. ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ పడుతున్నారని, పిచ్‌ను బట్టి జట్టును సెలక్ట్ చేస్తామని చెప్పారు. ‘గిల్ ఫిట్‌గా ఉన్నారు. పంత్ గాయం నుంచి కోలుకున్నారు. సర్ఫరాజ్ తొలి టెస్టులో భారీ స్కోర్ చేశారు. KL రాహుల్ మానసికంగా బలంగా ఉన్నారు. ప్లేయర్లందరికీ మా మద్దతు ఉంటుంది. జట్టు ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని మీడియాకు తెలిపారు.

News October 22, 2024

బీజేపీ క్రియాశీల స‌భ్య‌త్వం తీసుకున్న అద్వానీ

image

BJP కో-ఫౌండర్, అగ్ర‌నేత LK అద్వానీ పార్టీ క్రియాశీల స‌భ్య‌త్వాన్ని తీసుకున్నారు. 97 ఏళ్ల అద్వానీకి పార్టీ ముఖ్యులు పురందీశ్వ‌రి స‌హా త‌దిత‌రులు మెంబ‌ర్‌షిప్‌ను అందించారు. 1927లో పాక్‌లోని కరాచీలో జన్మించిన అద్వానీ 1942లో RSSలో వాలంటీర్‌గా చేరారు. 1986 నుంచి 1990 వరకు, మళ్లీ 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు BJP జాతీయ అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. BJP సభ్యత్వ నమోదు 10 కోట్లు దాటింది.

News October 22, 2024

పొలిటికల్ బాసులు పోలీసులకు స్వేచ్ఛనివ్వాలి: KTR

image

TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని KTR అన్నారు. గత కొన్ని నెలలుగా తాము చెబుతున్నదే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ <<14422586>>జీవన్ రెడ్డి<<>> చెప్పారని Xలో పేర్కొన్నారు. హోం మినిస్టర్ లేకపోవడం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా పొలిటికల్ బాసులు పోలీసులకు స్వేచ్ఛనివ్వాలని, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టాలని KTR కోరారు.

News October 22, 2024

మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా సమంత

image

SEP నెలకుగాను మోస్ట్ పాపులర్ హీరోగా దళపతి విజయ్ నిలిచినట్లు ORMAX MEDIA వెల్లడించింది. ఆ తర్వాత వరుసగా ప్రభాస్, షారుఖ్, అజిత్ కుమార్, NTR, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఉన్నారంది. హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఆలియా భట్, దీపికా పదుకొణె, నయనతార, త్రిశ, శ్రద్ధా కపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక, కియారా ఉన్నారని పేర్కొంది.

News October 22, 2024

ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు: TDP

image

AP: మంత్రి నారా లోకేశ్ టీమ్ అంటూ సాయం పేరుతో ఫేక్ ఎన్నారై టీడీపీ పేర్లతో మోసగాళ్లు స్కాంలు చేస్తున్నారని టీడీపీ తెలిపింది. +1(208)6482504, 8977038602 నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని ప్రజలకు సూచించింది. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంది. ఇప్పటికే ఫేక్ నంబర్లతో మోసగిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోందని ట్వీట్ చేసింది.

News October 22, 2024

నాయకత్వానికి వయసుతో సంబంధం లేదు: Zepto CEO

image

కంపెనీని విజయవంతంగా నడిపించేందుకు వయసుతో సంబంధం లేదని Zepto CEO ఆదిత్ పాలిచా పేర్కొన్నారు. NDTV వరల్డ్ సమ్మిట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో తన కంటే అధిక వయస్కులను ఇంటర్స్న్‌గా తీసుకున్నానని చెప్పారు. ‘నా ఏజ్ కంటే రెండు రెట్లు ఎక్కువ గల ఉద్యోగులు సైతం నాకు రిపోర్ట్ చేస్తుంటారు. నాయకత్వానికి వయసుతో పట్టింపు లేదు’ అని చెప్పుకొచ్చారు.

News October 22, 2024

ఐదేళ్ల పాటు నకిలీ కోర్టు నడిపేశారు!

image

గుజరాత్‌లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్‌లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.

News October 22, 2024

గంగవ్వకు గుండెపోటు వచ్చిందా?

image

మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు బిగ్‌బాస్ హౌజ్‌లో గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ‘మై విలేజ్ షో’ టీం సభ్యుడు అంజిమామ స్పష్టతనిచ్చారు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారన్నారు. గతంలోనూ గంగవ్వకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. బిగ్‌బాస్ సీజన్-4లో గంగవ్వ పాల్గొనగా, తాజాగా మరోసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News October 22, 2024

రెండో టెస్టుకు ముందు భారత్‌కు గుడ్ న్యూస్!

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన గిల్ అందుబాటులో ఉంటారని చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్‌గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో విఫలమైన రాహుల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.