news

News January 6, 2025

ఎన్నికల బాండ్లు వస్తే అవినీతి ఎలా అవుతుంది?: కేటీఆర్

image

TG: గ్రీన్‌కో సంస్థ ఎన్నికల బాండ్ల రూపంలో <<15078396>>BRSకు రూ.41 కోట్లు<<>> చెల్లించిందని ప్రభుత్వం వెల్లడించడంపై కేటీఆర్ స్పందించారు. ‘2023లో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ జరిగింది. గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు 2022లో ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ బాండ్లను కూడా ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ-కార్ రేసు కారణంగా గ్రీన్‌కో నష్టపోయింది. పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.

News January 6, 2025

అలాగైతే.. మళ్లీ టెలికం ఛార్జీలు పెంచక తప్పదు!

image

డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ రూల్స్‌పై టెలికం కంపెనీలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ డేటాను భారత్ బయటకు బదిలీ చేయడంపై రూపొందించిన రూల్స్ ఇంటర్నేషనల్ కాల్స్‌, మెసేజెస్, విదేశీ నంబర్లకు వాట్సాప్ మెసేజులు పంపడంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. వీటిని అమలు చేయడం కష్టమని, చాలా ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. టెలికం ఛార్జీల రూపంలో ఈ భారమంతా కస్టమర్లపై వేయాల్సి వస్తుందని చెప్తున్నారు.

News January 6, 2025

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్స్‌తో యువకులు

image

ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా సిగ్నల్స్ వద్ద పోలీసులు ఉండటం చూస్తుంటాం. కానీ, వియత్నాంలో సిగ్నల్స్ వద్ద యువకులు మొబైల్స్ పట్టుకొని అలర్ట్‌గా ఉండటాన్ని చూశారా? అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి ఫొటోలను క్లిక్ చేసి పోలీసులకు పంపించడాన్ని కొందరు ఆదాయంగా మలుచుకున్నారు. ఇలా చేస్తే విధించిన జరిమానాలో 10శాతాన్ని బౌంటీగా వారికి పోలీసులు అందిస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News January 6, 2025

ఆ విషయం PMతో లోకేశ్ చెప్పించగలరా?: అమర్నాథ్

image

AP: ఏ శాఖ మీదా అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేశ్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. PM మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ YCP హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని PMతో లోకేశ్ చెప్పించగలరా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.

News January 6, 2025

HMPV వైరస్: స్టాక్ మార్కెట్లు క్రాష్

image

స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. బెంగళూరులో ప్రమాదకర HMPV వైరస్ కేసులు నమోదవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో తమవద్దనున్న షేర్లను తెగనమ్ముతున్నారు. సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 78,000, నిఫ్టీ 320 పాయింట్లు పతనమై 23,680 వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితంగా రూ.5లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. ఇండియా విక్స్ నేడు 12.61% పెరగడం గమనార్హం. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.

News January 6, 2025

గ్రీన్‌కో నుంచి BRSకు రూ.41 కోట్లు: ప్రభుత్వం

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టింది. రేసు నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ద్వారా BRSకు రూ.కోట్ల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఆ కంపెనీ BRSకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.41 కోట్లు చెల్లించిందని తెలిపింది. 2022 ఏప్రిల్ 8-అక్టోబర్ 10 మధ్య గ్రీన్‌కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు సర్కార్ పేర్కొంది.

News January 6, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా బుమ్రా!

image

భారత బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్‌కు ఈ స్పీడ్‌గన్‌ను డిప్యూటీగా నియమించాలని BCCI భావిస్తోంది. కాగా, ఈ రేసులో శ్రేయస్ అయ్యర్, పంత్, హర్దిక్, సూర్యకుమార్ ఉన్నా జట్టు భవిష్యత్ ప్రణాళికల నేపథ్యంలో బుమ్రాకే మొగ్గుచూపినట్లు సమాచారం. CT FEB 19న ప్రారంభం కానుంది. భారత్ తొలి మ్యాచ్ బంగ్లాతో 20న ఆడనుంది.

News January 6, 2025

అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన పవన్, చెర్రీ

image

AP: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన <<15077664>>ఇద్దరు అభిమానుల<<>> కుటుంబాలకు Dy.CM పవన్ పరిహారం ప్రకటించారు. జనసేన తరఫున రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రమాదం జరిగిన కాకినాడ-రాజమండ్రి రోడ్డును గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సాయం ప్రకటించారు.

News January 6, 2025

అనంత శ్రీరామ్ కామెంట్స్‌పై ‘కల్కి’ డైరెక్టర్ స్పందన!

image

మూవీల్లో మన పురాణాలను <<15072339>>వక్రీకరిస్తున్నారని<<>> సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ వ్యాఖ్యల నేపథ్యంలో ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. ‘అమెజాన్ జపాన్‌లో ట్రాన్స్‌లేటెడ్ మహాభారతం పుస్తకాలు భారీగా విక్రయించారు. ఇది చాలా బాగుంది’ అని రాసుకొచ్చారు. అనువదించిన మహాభారతం పుస్తకాలనే ఎక్కువ మంది చదివారని ఆయన పోస్ట్ సారాంశం.

News January 6, 2025

‘డాకు మహారాజ్’లో కీలక పాత్ర పోషించిన డైరెక్టర్

image

నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నేషనల్ అవార్డ్ పొందిన డైరెక్టర్ సందీప్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, సినిమాల్లోకి రావాలని తాను చిన్ననాటి నుంచే కలలు కన్నట్లు ట్వీట్ చేశారు. ‘ఒక్క ఫోన్ కాల్‌తో నెక్స్ట్ డే వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నావ్. థాంక్స్ తమ్ముడు. అదరగొట్టావ్’ అని డైరెక్టర్ బాబీ రిప్లై ఇచ్చారు.