news

News April 13, 2025

రాజీవ్ యువ వికాసం.. ఒక్క రోజే ఛాన్స్

image

TG: <<15856039>>రాజీవ్ యువ వికాసం<<>> పథకానికి నిన్నటి వరకు దాదాపు 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు. రేపటితో గడువు ముగియనుండగా మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్నారు. ఈ స్కీమ్‌కు అప్లై చేసుకునేందుకుగాను క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల కోసం మార్చి 24-ఏప్రిల్ 11 మధ్య 13.08 దరఖాస్తులు వచ్చాయి. మీసేవ చరిత్రలో ఇదే రికార్డని తెలుస్తోంది.

News April 13, 2025

శ్రీశైలం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

image

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సిద్ధాపూర్ క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైత్రపౌర్ణమి సందర్భంగా ఏటా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య జాతర నిర్వహిస్తారు.

News April 13, 2025

మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

image

తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని Dy.CM పవన్ ప్రకటించారు. సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కొడుకు కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ Xలో ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్టసమయంలో అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా కొడుకుతో కలసి పవన్ నిన్న ఇండియాకు తిరిగొచ్చారు.

News April 13, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

వరుస భూకంపాలతో మయన్మార్ వణికిపోతోంది. ఇవాళ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. కాగా ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో మయన్మార్‌ అతలాకుతలం అయింది. 3వేల మందికి పైగా మరణించారు. శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. రూ.వేల కోట్ల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఆ తర్వాత కూడా తరచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

News April 13, 2025

తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు

image

TG: ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మంచిర్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 13, 2025

ఫిరాయింపులపై స్పీకర్‌కూ డెడ్‌లైన్ పెట్టాలి: KTR

image

బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. దీనిని స్వాగతిస్తూ BRS నేత KTR ట్వీట్ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించేందుకు BJP, కాంగ్రెస్ లెక్కలేనన్ని సార్లు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలకు అసెంబ్లీ స్పీకర్లకూ గడువు విధించాలని సుప్రీంకోర్టును కేటీఆర్ కోరారు.

News April 13, 2025

ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ: హరీశ్ రావు

image

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా సహాయక చర్యల్లో పురోగతి లేదని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. హెలికాప్టర్‌లో వెళ్లి మంత్రులు పెట్టిన డెడ్‌లైన్లు మారాయే తప్ప ప్రయోజనం లేదని ఫైరయ్యారు. ఇది INC ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ అని పేర్కొన్నారు. వారి మృతదేహాలను ఎప్పటికి బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News April 13, 2025

సియాచిన్ డే: భారత జవాన్ల ధీరత్వానికి సెల్యూట్

image

భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్‌లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్‌ మేఘదూత్ చేపట్టి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సరిహద్దులోని సియాచిన్‌పై పూర్తి పట్టు సాధించింది. దశాబ్దాలుగా అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకుని రక్షణగా నిలుస్తున్న జవాన్ల ధీరత్వానికి సెల్యూట్.

News April 13, 2025

అటు ప్రీతి జింటా, ఇటు కావ్యా మారన్(VIRAL)

image

SRH-PBKS మ్యాచ్ సందర్భంగా ఆయా జట్ల ఓనర్లు కావ్యా మారన్, ప్రీతి జింటా ఉప్పల్‌లో సందడి చేశారు. తమ ప్లేయర్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు వారు ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే కావ్యా అతని పేరెంట్స్‌ దగ్గరికెళ్లి అభినందనలు తెలిపారు. మ్యాచ్ తర్వాత అభిషేక్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌ను గుర్తుచేస్తూ ప్రీతి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.

News April 13, 2025

జావెలిన్ త్రోయర్‌పై నాలుగేళ్ల నిషేధం

image

భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.