news

News July 31, 2024

‘మీ దృష్టంతా ఉచిత పథకాలపైనే’.. ఢిల్లీ హైకోర్టు ఫైర్

image

ఢిల్లీ వరదల్లో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మరణించడంపై హైకోర్టు మున్సిపల్ అధికారులపై మండిపడింది. ‘ఉద్యోగులకు శాలరీలు ఇచ్చేందుకే మీ దగ్గర డబ్బుల్లేవు. అలాంటప్పుడు మౌలిక వసతులు ఎలా కల్పిస్తారు? మీరు ఉచిత పథకాలను ప్రజలకు అలవాటు చేశారు. పన్నులు వసూలు చేయడంపై దృష్టి పెట్టరు. తద్వారా అభివృద్ధి జరగదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది. మౌలిక వసతులు సరిగా ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు’ అని వ్యాఖ్యానించింది.

News July 31, 2024

నాలుగున్నరేళ్ల బాలికపై హత్యాచారం.. దోషికి ఉరిశిక్ష

image

TG: హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికను దినేశ్ అనే సెంట్రింగ్ కార్మికుడు అత్యాచారం చేసి చంపేశాడు. 2021లో అతడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా దినేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఆ తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది.

News July 31, 2024

ఫ్రాన్స్ అధ్యక్షుడికి మంత్రి ముద్దు.. దుమారం!

image

పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను ఆ దేశ క్రీడలమంత్రి ఉడియా కాస్టేరా కౌగిలించుకుని గాఢంగా ముద్దు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దుమారం చెలరేగింది. ‘ఒక అధ్యక్షుడు, మంత్రి చేయాల్సిన పని కాదు’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అలా ముద్దు పెట్టుకునేది ప్రేమికులు మాత్రమే’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

News July 31, 2024

ఏపీలో 96 మంది డీఎస్పీల బదిలీ

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 57 మందిని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

News July 31, 2024

ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

image

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

News July 31, 2024

వచ్చే 100 రోజుల్లో కొత్త పాలసీలు తీసుకురావాలి: సీఎం

image

AP: 2014-19 మధ్య కాలంలో ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత రాష్ట్రం నుంచి తరలివెళ్లిన పరిశ్రమలను మళ్లీ ఆహ్వానించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వచ్చే 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీ, MSME పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్‌టైల్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖపై ఇవాళ CM సమీక్ష నిర్వహించారు.

News July 31, 2024

ఆగస్టు 4న ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్

image

టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాను చార్మీ నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించగా ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

News July 31, 2024

కేరళకు అదానీ రూ.5కోట్ల విరాళం

image

ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి ఘోరమైన ప్రాణనష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 163కి చేరింది.

News July 31, 2024

పిచ్చి తల్లీ.. ఎంత కష్టమొచ్చిందమ్మా!

image

TG: బిడ్డకు జలుబు వచ్చినా తల్లడిల్లిపోయేదా తల్లి. అదే అమ్మ నేడు మంచాన పడితే నడిరోడ్డుపై వదిలేశాడా కొడుకు. మేడ్చల్‌కు చెందిన అరవింద్ తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తానంటే పాపం అమాయకంగా వెంట వచ్చిన ఆ పిచ్చితల్లిని ఫుట్‌పాత్‌పై వదిలేశాడు. జీవచ్ఛవంలా పడి ఉన్న ఆమెను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బిడ్డ వదిలేశాడని ఇంకా నమ్మని ఆ అమ్మ, కొడుకును చూడాలని తపిస్తుండటం కంటతడి పెట్టిస్తోంది.

News July 31, 2024

OLYMPICS: క్వార్టర్ ఫైనల్స్‌కు లవ్లీనా

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సత్తా చాటారు. రౌండ్ 32లో మహిళల 75 కేజీల విభాగంలో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌ను చిత్తు చేశారు. 5-0 తేడాతో ఆమెను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.