India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625 కోట్లని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో తెలిపారు. రూ.30,436 కోట్లు ఖర్చవుతుందని 2023లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనా వేసిందని, కేంద్ర జలశక్తి సవరించిన అంచనాల ప్రకారం లెక్కగట్టిందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో చాలా హామీల్ని అమలుచేశామని, కొన్నింటి అమలు వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, లక్ష్యసేన్, ప్రణయ్ బరిలో దిగనున్నారు. టేబుల్ టెన్నిస్ R16లో మనికా బాత్రా, ఆర్చరీలో దీపికా కుమారి, బాక్సింగ్ ఉమెన్స్ 75KG సెగ్మెంట్‌లో లవ్లీనా, మెన్స్ విభాగంలో నిషాంత్ దేవ్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో పూర్తి వివరాలు పైన ఫొటోలో చూడొచ్చు.
<<-se>>#Olympics2024<<>>
ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు నీట్-యూజీ తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 14న ప్రారంభం కానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్‌సభలో వెల్లడించారు. నాలుగు విడతల్లో ఈ ప్రక్రియ జరగనుండగా ఫైనల్ ఫేజ్ అక్టోబర్ 24న జరుగుతుందని చెప్పారు. అభ్యర్థుల నమోదు ఆగస్టు మొదటివారంలో మొదలవుతుందని, ప్రవేశాలను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.
AP: ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఫైనల్ ఫేజ్‌లో 17,575 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయినప్పటికీ మరో 18,951 సీట్లు మిగిలిపోయినట్లు సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ గణేశ్ కుమార్ తెలిపారు. మొత్తంగా కన్వీనర్ కోటాలో 1,39,254 సీట్లకు 1,20,303 భర్తీ అయ్యాయి. ఆగస్టు 3లోగా విద్యార్థులు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ స్పష్టం చేశారు.
AP: సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి పలు అంశాలపై CM చంద్రబాబు సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై ప్రణాళికలు రచించాలని CM సూచించారు.
TG: నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల క్రయవిక్రయాలు జరిపే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లను వెంటనే స్వాధీనం చేసుకుని మరొకరికి అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు, సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొంది. రైతులకు ఎరువులు సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
AP: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200 ఫైన్‌తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. <
TG: వచ్చే బడ్జెట్ సమావేశాలను 20 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అందుకు తమ వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రభుత్వానికి తెలిపారు. ‘కొత్తగా 57మంది ఎమ్మెల్యేలు సభలో అడుగుపెట్టారు. వారందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. సభ ఎక్కువ రోజులు నిర్వహిస్తే సమాధానం ఇచ్చేందుకు మంత్రులకూ సమయం ఉంటుంది’ అని పేర్కొన్నారు.
AP: నీట్-యూజీ రాష్ట్ర ర్యాంకుల జాబితా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. దాన్ని అనుసరించి ఎల్లుండి రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని డా.ఎన్టీఆర్ వర్సిటీ అనౌన్స్ చేయనుంది. ఇక వచ్చే నెల 14 నుంచి MBBS అకడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఆగస్టు తొలివారంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది.
HYD వనస్థలిపురం PS పరిధిలో దారుణం జరిగింది. యువతి(24)పై ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ అత్యాచారం చేశారు. ఇటీవల జాబ్ రావడంతో ఓ ఫ్రెండ్‌కు యువతి పార్టీ ఇచ్చింది. అతడు ఆమెకు బలవంతంగా మద్యం తాగించడంతో స్పృహ కోల్పోయిన అనంతరం రూమ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ మ్యూచువల్ ఫ్రెండ్‌ను పిలిపించి, ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. స్పృహలోకి వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓ యువకుడిని పట్టుకున్నారు.
Sorry, no posts matched your criteria.