news

News November 11, 2025

జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

image

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్‌కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.

News November 11, 2025

ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు

image

*అక్టోబర్ 9, 2005: దీపావళి తర్వాత రెండు రోజులకు 5.38PM-6.05PM మధ్య వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 67 మంది మరణించారు.
*సెప్టెంబర్ 13, 2008: 6.27PMకు పోలీసులకు మెయిల్ వచ్చింది. దానికి స్పందించే లోపు 9 వరుస పేలుళ్లు జరిగాయి. 5 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 25 మంది చనిపోయారు.
*నేడు జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

News November 10, 2025

INTERESTING: అరటిపండు తినలేనోడు.. విమానాన్ని తినేశాడు

image

ప్లేట్లు, పలు వస్తువులు తినే వాళ్లను సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి మిచెల్ లోటిటో. ఫ్రాన్స్‌లో 1950లో పుట్టారు. 9 ఏళ్ల వయసు నుంచే గాజు, ఇనుప పదార్థాలను తినడం మొదలుపెట్టారు. పికా అనే ప్రత్యేక వ్యవస్థతో లోటిటో బాడీ నిర్మితమైందని వైద్యులు తెలిపారు. ఆయన ఓ విమానాన్ని రెండేళ్లలో పూర్తిగా తినేశారు. సైకిల్స్, టీవీలు తినే లోటిటో 2006లో మరణించారు. అయితే ఆయన అరటిపండు తినలేకపోయేవారు.

News November 10, 2025

NOV 25వరకు SSC పరీక్ష ఫీజు చెల్లింపు గడువు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజును నవంబర్ 13నుంచి 25వరకు చెల్లించవచ్చని SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. లేట్ ఫీ ₹50తో డిసెంబర్ 3వరకు, ₹200తో DEC 10వరకు, ₹500తో DEC 12వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఫీజును https://bse.ap.gov.in లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. బ్యాంక్ చలానా, CFMS చెల్లింపులను ఆమోదించబోమని వివరించారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టంచేశారు.

News November 10, 2025

HYDలో అలర్ట్.. విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, అనుమానాస్పద వాహనాల్లో చెకింగ్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో RPF, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మరోవైపు CISF దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.

News November 10, 2025

CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా?

image

<<18252445>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. కానీ CNG పేలితే ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు.

News November 10, 2025

మార్కెట్‌కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

image

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్‌లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్‌ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.

News November 10, 2025

ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువ మంది మొగ్గు

image

వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు… పెద్దగా హామీ పత్రాల పనిలేకుండా ఇచ్చే ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీపావళి సీజన్లో ‘పైసాబజార్’ చేపట్టిన సర్వేలో 42% మంది ఈ లోన్లపై ఆసక్తిచూపారు. 25% మంది వడ్డీపై ఆలోచించారు. 80% డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి లోన్లకు ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా 41% పర్సనల్ LOANS తీసుకున్నారు. కాగా అనవసర లోన్లు సరికాదని, వాటి వడ్డీలతో కష్టాలే అని EXPERTS సూచిస్తున్నారు.

News November 10, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

➣ ఈ నెల 27న ఢిల్లీలో WPL మెగా వేలం
➣ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ స్టాండింగ్స్: మూడో స్థానంలో IND, తొలి రెండు స్థానాల్లో AUS, SL
➣ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఫరూక్ అహ్మద్‌కు గుండెపోటు.. ఐసీయూలో చికిత్స
➣ రంజీ ట్రోఫీ: తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ విజయం.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రషీద్ (87), సెకండ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) హాఫ్ సెంచరీలు

News November 10, 2025

ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

image

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.