news

News October 21, 2024

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

image

TG: పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో CM రేవంత్ కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో IPSలు మరణిస్తే రూ.2 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ మరణిస్తే రూ.1.5 కోట్లు, ఎస్సై, సీఐ మరణిస్తే రూ.1.25 కోట్లు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు మరణిస్తే రూ.కోటి పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. శాశ్వత వైకల్యం పొందిన అధికారుల ర్యాంక్‌ను బట్టి పరిహారం ఇస్తామని చెప్పారు.

News October 21, 2024

ఇండియాపై గెలుపుతోనే లయ అందుకున్నాం: సోఫీ

image

తాము మహిళల T20WC గెలవడానికి కారణం టీమ్ ఇండియా ఓ కారణమని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ సోఫీ డివైన్ అన్నారు. భారత్‌పై సాధించిన గెలుపుతోనే తమ క్రికెటర్లు లయ అందుకున్నారని తెలిపారు. ఈ WCకి ముందు కివీస్‌ రికార్డు పేలవంగా సాగింది. ఆ జట్టు వరుసగా 10 మ్యాచుల్లో ఓడింది. అయితే ఈ T20WC తొలి మ్యాచ్‌లో INDపై గెలిచి ఆ తర్వాత ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచింది. ఫైనల్‌లో SAపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

News October 21, 2024

నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు?

image

TG: విద్యుత్ ఛార్జీలు పెంచేలా ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై నేటి నుంచి 5 రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి విచారణ చేపట్టనుంది. 2024-25లో రూ.1200 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని TGSPDCL/TGNPDCL కోరుతున్నాయి. HT కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు, LT కేటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. NOV 1 నుంచి ఛార్జీలు పెరిగే అవకాశముంది.

News October 21, 2024

SSC కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: SSC జీడీ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి జనవరి 31 వరకు టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇటు 1,388 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి కంటెంట్‌ను మరో రెండు గంటలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 16 వరకు రోజూ 4గంటలు ప్రసారం చేస్తామన్నారు.

News October 21, 2024

అందుకే హిందీలో మాట్లాడను: సమంత

image

పలకడంలో తప్పులు దొర్లుతాయనే భయంతోనే స్టేజీపైన హిందీలో మాట్లాడనని హీరోయిన్ సమంత అన్నారు. ‘సిటాడెల్’లో హనీ(సమంత)కి హిందీ బాగా వచ్చని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయాన్ని దర్శకులు గుర్తించలేకపోయారని అన్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 సమయంలో సమంత హిందీ మాట్లాడకపోవడం చూసి సిటాడెల్‌లో వేరే హీరోయిన్‌ని తీసుకోవాలని భావించినట్లు దర్శకులు రాజ్ అండ్ డీకే చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు.

News October 21, 2024

రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు ముఖ్యం: CM రేవంత్

image

TG: ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. గోషామహల్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.

News October 21, 2024

రైతుబంధు కావాలా? రాబందు కావాలా?: KTR

image

TG: ఎకరానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పదివేలు ఊడగొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. రైతు బంధు కావాలా?.. రాబందు కావాలా? అని Xలో ప్రశ్నించారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లుగా పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే, అన్నదాత వెన్ను విరవడమేనని దుయ్యబట్టారు.

News October 21, 2024

అదనంగా 1.4లక్షల మందికి పంట రుణాలు!

image

AP: ఈ రబీ సీజన్‌లో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని వ్యవసాయశాఖ నిర్దేశించింది. అందులో రూ.68,060 కోట్లు పంట రుణాలు, రూ.32,390 కోట్లు టర్మ్ లోన్స్ ఇవ్వనుంది. గత సంవత్సరం 3.60 లక్షల మంది కౌలు దారులకు రూ.4,100 కోట్లు రుణాలు ఇచ్చింది. కాగా ఈసారి కనీసం 5 లక్షల మందికి రూ.5వేల కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

News October 21, 2024

DANGER BELL: కుప్పకూలనున్న అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థ?

image

ప్రతి ఎకానమీకి బ్యాంకింగ్ సిస్టమే పట్టుగొమ్మ. దానికే చీడపడితే ఆ దేశం దివాలా తీయడం ఖాయం! భూతల స్వర్గంగా భ్రమించే అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎందుకంటే US బ్యాంకుల నష్టాలు చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి. 2008లో సబ్‌ప్రైమ్ క్రైసిస్‌ టైమ్‌లో $75bns లాసెస్‌తోనే ప్రపంచం అతలాకుతలమైంది. 2024 నాటికి ఇవి 7 రెట్లు పెరిగి $500bnsకు చేరాయి. చాలా బ్యాంకులు లిక్విడ్ క్యాష్ లేక తల్లడిల్లుతున్నాయి.

News October 21, 2024

విజయవాడలో రేపు, ఎల్లుండి డ్రోన్ షో

image

AP: విజయవాడలో డ్రోన్‌షోకు సర్వం సిద్ధమైంది. 5000 డ్రోన్లతో పున్నమి ఘాట్‌లో రేపు, ఎల్లుండి షో నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మ, వివిధ రూపాలు, బొమ్మలు, ఆకారాలు, పేర్లు వచ్చేలా నింగిలో డ్రోన్లు కనువిందు చేయనున్నాయి. బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్, వారధి, బస్టాండు, ప్రకాశం బ్యారేజీ వద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు షో చూసేందుకు హాజరవనున్నారు.