news

News October 20, 2024

Unstoppableలో CM చంద్రబాబు.. ఎపిసోడ్ ఎప్పుడంటే?

image

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Unstoppable సీజన్-4కి సీఎం చంద్రబాబు గెస్ట్‌గా వచ్చారు. ఇవాళ షూటింగ్ జరిగింది. అయితే ఈ ఎపిసోడ్‌ను ఈనెల 25న రాత్రి 8.30 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. చంద్రబాబును బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారనే విషయాలు తెలియాలంటే 25 వరకు ఆగాల్సిందే.

News October 20, 2024

గ్రూప్-1పై CM రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

image

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. SC, ST, BC రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టులా ఉన్న GO.29ను రద్దు చేయాలని అందులో కోరారు. ఈనెల 21న నిర్వహించబోయే పరీక్షలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన నెలకొందని అన్నారు. GO.29 వల్ల 5,003 మంది అభ్యర్థులు నష్టపోయారన్నారు.

News October 20, 2024

T20 WC: సౌతాఫ్రికా టార్గెట్ 159 రన్స్

image

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 20 ఓవర్లలో 158/5 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో అమేలియా కెర్ 43, బ్రూక్ 38, బేట్స్ 32 రన్స్‌తో రాణించారు. ఈ మ్యాచులో గెలవాలంటే సౌతాఫ్రికా 20 ఓవర్లలో 159 రన్స్ చేయాలి.

News October 20, 2024

12 విమానాలకు బెదిరింపులు

image

విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్ కంపెనీలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. చెరో ఆరు విమానాల పేర్లతో సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వచ్చినట్లు ఆయా సంస్థలు ధ్రువీకరించాయి. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ టీమ్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలిపాయి. ఇటీవల కొందరు ఆకతాయిలు విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మరి ఇది కూడా అలాంటిదేనా? అనేది తెలియాల్సి ఉంది.

News October 20, 2024

అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు

image

హైదరాబాద్ అశోక్ నగర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి ధర్నా చేయనున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ భారీగా మోహరించారు. ఎవరూ గుమిగూడకుండా చూస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పెంచింది.

News October 20, 2024

ఎందుకీ అబద్ధపు బతుకు జగన్?: లోకేశ్

image

AP: దిశ చట్టం లేకపోయినా YS జగన్ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌పై జగన్ చేసిన <<14407431>>వ్యాఖ్యలపై<<>> స్పందిస్తూ ‘నీ పాలనలో ఎన్నో నేరాలు జరిగాయి. ఏనాడైనా స్పందించావా? దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టించారు. ఒక్కరికైనా ఉరిశిక్ష వేశారా? ఎందుకీ అబద్ధపు బతుకు?’ అని Xలో మండిపడ్డారు.

News October 20, 2024

గ్రూప్-1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు: మహేశ్

image

TG: గ్రూప్-1 అభ్యర్థులను విపక్షాలే తప్పుదోవ పట్టించి, రెచ్చగొడుతున్నాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ మండిపడ్డారు. GO 29తో రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగట్లేదని, ఎంతోమంది నిపుణులతో చర్చించే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెరిట్ ర్యాంక్ వచ్చిన రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే ఉంటారన్నారు. మెయిన్స్ రాస్తున్న వారిలో 70% మంది రిజర్వేషన్ అభ్యర్థులేనని మహేశ్ తెలిపారు.

News October 20, 2024

ఈ జిల్లాలకు వర్షసూచన

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.

News October 20, 2024

T20 WC FINAL: టాస్ గెలిచిన సౌతాఫ్రికా

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
NZ: సుజీ బేట్స్, ప్లిమ్మర్, కెర్, డివైన్(C), బ్రూక్, గ్రీన్, గాజ్, రోజ్మేరీ, లీ తహుహు, కార్సన్, ఫ్రాన్.
SA: వోల్వార్డ్ట్(C), బ్రిట్స్, అన్నేకే బాష్, క్లో ట్రయాన్, మారిజానే కాప్, సునే లూయస్, నాడిన్, డెర్క్‌సెన్, జాఫ్తా, మలాబ, ఖాకా.
> LIVE: HOTSTAR/స్టార్ స్పోర్ట్స్‌

News October 20, 2024

అగ్రహీరోలను మించిన హ‌ృతిక్ రోషన్ ఆస్తి విలువ!

image

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌కు ‘HRX’ పేరిట సొంతంగా ఓ ఫిట్‌నెస్ వేర్ బ్రాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ విలువ రూ.1000 కోట్లకు పైమాటేనని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తాజాగా తెలిపింది. ఇది కాకుండా సినిమాలు, ప్రకటనలు, ఇతర పెట్టుబడుల ద్వారా ఆయన నికర ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.3100 కోట్లకు చేరిందని పేర్కొంది. దేశంలోని అతి పెద్ద స్టార్లకు కూడా ఈ స్థాయి ఆస్తులు లేవని స్పష్టం చేసింది.