India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన తల్లి మృత దేహంపై పడి బోరున ఏడ్చారు. సుదీప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై వచ్చిన సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బొమ్మై ఒడిలో తలపెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా హీరోను ఇలా చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
AP: ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమయ్యే అంకుడు, తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. బొమ్మల తయారీకి కర్ర లభ్యత కష్టంగా మారడంతో కళాకారులు ఈ సమస్యను Dy.CM దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమీక్షించిన ఆయన ఉపాధి హామీ పనుల్లో భాగంగా అంకుడు, తెల్లపొణికి చెట్లను పెంచాలని, ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి పెట్టాలని ఆఫీసర్లకు సూచించారు.
న్యూజిలాండ్‌తో జరిగే మిగతా రెండు టెస్టులకు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో టెస్టుకు ముందు అతను జట్టులో చేరతారని తెలిపింది. తాజాగా రంజీ ట్రోఫీలో సుందర్ సెంచరీతో రాణించారు. కాగా ఈనెల 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్టు, నవంబర్ 1 నుంచి ముంబైలో మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో NZ <<14405398>>విజయం<<>> సాధించిన సంగతి తెలిసిందే.
కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. స్వామివారి పూజకు వినియోగించే ‘ఉరులి’ అనే కంచు పాత్రను దుండగులు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హరియాణాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వైద్యుడని వెల్లడించారు. ఇతర నిందితులతో కలిసి గత వారం క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం చోరీకి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
AP: బద్వేల్ <<14407617>>ఘటన<<>> నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ‘నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేశాడు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉంది. ప్రేమించుకుని విడిపోయారు. సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో అమ్మాయి అతడిని కలిసింది. ఇద్దరూ నిర్మానుష్య ప్రాంతంలో శృంగారంలో పాల్గొన్నారు. తర్వాత వాగ్వాదం జరిగింది. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో నిందితుడు నిప్పంటించాడు’ అని SP తెలిపారు.
TG: సీఎం రేవంత్ హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని కేంద్రమంత్రి, BJP నేత కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. హిందూ పండుగల్లో అనేకమందిపై అక్రమ కేసులు పెట్టించారని ఆయన అన్నారు. సికింద్రాబాద్‌లో అమ్మవారి ఆలయ ఘటనపై నిరసన చేస్తున్నవారిపై లాఠీఛార్జ్‌కు సీఎం ఆదేశించారని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆయన మరో వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు.
TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, GO29 రద్దు కోసం అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆవేదనను లెక్కచేయని ప్రభుత్వం యథావిధిగా రేపటి నుంచి పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈనేపథ్యంలో కొందరు గ్రూప్-1 అభ్యర్థులు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడటానికి సిద్ధమయ్యారు. అదేసమయంలో పోలీసులూ అక్కడికి చేరుకోగా అరెస్ట్ చేస్తారేమోనని వారు మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
స్టార్ బ్యాటర్ ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.4కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటెయిన్ చేసుకోనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. ధోనీతో పాటు రుతురాజ్, జడేజా, శివమ్ దూబే, పతిరణను ఆ జట్టు రిటెయిన్ చేసుకోవచ్చని పేర్కొంది. గత ఏడాది కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముందని అంచనా వేసింది. సీఎస్కే గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు రాకుండానే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
AP: విజయనగరం జిల్లా గుర్లలో సంభవించిన మరణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అతిసారం ప్రబలడంపై సమీక్షించిన ఆయన గుర్లలో వైద్య శిబిరాలు కొనసాగించాలని సూచించారు. గ్రామంలో మరణాలు సంభవించడంపై ఐఏఎస్ విజయానంద్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం.
AP: రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ‘ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా మారుతుంది. 23న తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉంది. వాయవ్య దిశగా పయనించి 24న ఒడిశా-బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో 24, 25న ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది.
Sorry, no posts matched your criteria.