news

News October 20, 2024

VIRAL: కస్టమర్లకు క్యాబ్ డ్రైవర్ హెచ్చరిక

image

కారులోనే కస్టమర్లు రొమాన్స్ చేసుకుంటూ ఇబ్బంది కలిగిస్తుండటంతో ఓ క్యాబ్ డ్రైవర్ విసిగిపోయాడు. ఇలాంటివి పునరావృతం అవ్వకుండా ఉండేందుకు క్యాబ్‌లో ఓ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. ‘హెచ్చరిక.. క్యాబ్‌లో రొమాన్స్ చేయకండి. ఇదేమీ మీ ప్రైవేటు ప్లేస్ కాదు. ఓయో రూమ్ అంతకన్నా కాదు. కాబట్టి కారులో డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ సైలెంట్‌గా ఉండండి’ అని అందులో రాసుకొచ్చాడు.

News October 20, 2024

మహిళా నిర్మాతలపై పోక్సో కేసు

image

సీరియల్స్, వెబ్ సిరీస్‌లు నిర్మించే ‘బాలాజీ టెలీఫిలిమ్స్’ నిర్మాతలు శోభా కపూర్, ఏక్తా కపూర్‌పై ముంబై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ‘ఆల్ట్ బాలాజీ’ సంస్థ నిర్మాణంలో వీరు ‘ఏ’ రేటెడ్ వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నారు. 2021లో స్ట్రీమ్ అయిన ‘గందీ బాత్’ అనే సిరీస్‌లో బాలికల్ని అశ్లీలంగా చూపించారంటూ వారిపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 20, 2024

CSKలో సాధన టెస్టుల్లో ఉపయోగపడింది: రచిన్

image

బెంగళూరు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న సమయంలో చేసిన సాధన, భారత పరిస్థితులకు అలవాటు పడేందుకు ఉపకరించిందని ఆయన మ్యాచ్ అనంతరం తెలిపారు. ‘CSKలో ఉన్నప్పుడు వివిధ రకాల పిచ్‌లపై సాధన చేసేవాడిని. విభిన్నమైన నెట్ బౌలర్లు అందుబాటులో ఉండేవారు. ఆ సాధన నాకు ఉప ఖండపు పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్పించింది’ అని వివరించారు.

News October 20, 2024

ఆప్కో షోరూమ్స్@ ఆన్‌లైన్ అమ్మకాలు

image

AP: ఆప్కో షోరూముల్లో ఆన్‌లైన్ అమ్మకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని 3 షోరూముల్లోని వస్త్రాలను పైలట్ ప్రాజెక్టు కింద తొలుత ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా షోరూములను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం పలు కొరియర్ సంస్థలతో చర్చలు జరిపారు. తక్కువ దూరమైతే ఉచితంగానే అందించే ఛాన్సుంది.

News October 20, 2024

అధిక పని గంటలు.. ప్రభుత్వానికి వైద్యుల సూచన ఇదే!

image

ఉద్యోగుల్లో పెరుగుతోన్న పని ఒత్తిడిని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని పని గంటలతో పోల్చితే భారత్ రెండో స్థానంలో ఉందని, వారానికి సగటున 46.7 గంటలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పని గంటలు తగ్గించాలని, దీనిపై కఠిన నిబంధనలు తీసుకొచ్చి ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని ప్రభుత్వానికి సూచించారు. సక్సెస్ కోసం ఎక్కువసేపు పనిచేయాలన్న భావనను యజమానులు మానుకోవాలని సూచించారు.

News October 20, 2024

అది అనుముల ఇంటెలిజెన్స్(AI) సృష్టే: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో 40 లక్షల మందికి రుణమాఫీ జరిగిందన్న INC ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. మీరు పోస్ట్ చేసిన AI ఇమేజ్ లాగే, అందులో మెన్షన్ చేసిన సంఖ్య అనుముల ఇంటెలిజెన్స్(AI) సృష్టించిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. సీఎం సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.

News October 20, 2024

సొంత నియోజకవర్గం.. చంద్రబాబుకు దక్కని చోటు

image

AP: కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27వ వ్యవస్థాపక దినోత్సవ ఆహ్వాన పత్రికపై వివాదం నెలకొంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న వేడుకలో ఆయన పేరు లేకపోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కుప్పం MLAగా, సీఎం హోదాలో ఉన్న ఆయన పేరును అధికారులు ప్రొటోకాల్‌లో పట్టించుకోలేదంటున్నారు. చిత్తూరు ఎంపీ, MLC, RTC వైస్ ఛైర్మన్, కలెక్టర్ సహా పలువురి పేర్లతో ఆహ్వానపత్రికను ముద్రించారు.

News October 20, 2024

ఎవరేం చేసినా గ్రూప్-1 పరీక్ష ఆగదు: మంత్రి సీతక్క

image

TG: ఎవరేం చేసినా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఆగదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగాయని ఆమె ఆరోపించారు. పదేళ్లలో గ్రూప్-1, డీఎస్సీ పరీక్షలు నిర్వహించలేదని, ఇప్పుడేమో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.

News October 20, 2024

ఒలింపిక్ వీరుడికి క్యాన్సర్.. ఇంకా నాలుగేళ్లే!

image

బ్రిటిష్ ఒలింపిక్ సైక్లింగ్ ఛాంపియన్ సర్ క్రిస్ హోయ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రెండు నుంచి నాలుగేళ్ల మధ్యలో జీవించే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిపారు. 48 ఏళ్ల స్కాట్ 2004- 2012 మధ్యకాలంలో ఆరుసార్లు ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్నారు.

News October 20, 2024

విరాట్ వికెట్ నాకెంతో ప్రత్యేకం: విలియం

image

ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన NZ బౌలర్ విలియం ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘107 పరుగులు చేయడం ఇక్కడ సులభమని చెప్పలేను. మాకు వ్యతిరేకంగా ప్రపంచస్థాయి జట్టు ఉంది’ అని చెప్పారు. విరాట్ వికెట్‌పై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘మేము ఆడే ఆటలో గొప్ప ప్లేయర్‌ను ఔట్ చేయడం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే అలాంటి ప్లేయర్లను చూస్తూ పెరుగుతాం’ అని తెలిపారు.