news

News July 28, 2024

వ్యర్థాలను తినేసే కీటకాల అభివృద్ధి

image

ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోతున్న వ్యర్థాలు మానవాళికి సవాల్ విసురుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఆస్ట్రేలియాకు చెందిన మాక్వరీ వర్సిటీ సైంటిస్టులు జన్యుసవరణ చేసిన కీటకాల(బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై)ను అభివృద్ధి చేశారు. ఇవి సేంద్రీయ, ఆహార, పరిశ్రమల వ్యర్థాలను తినేస్తాయి. దీంతో ప్రమాదకరమైన మీథేన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. వీటిని జీవ ఇంధనాలు, లూబ్రికెంట్ ఆయిల్స్, జంతువుల దాణాలోనూ ఉపయోగించవచ్చట.

News July 28, 2024

హామీలు అమలు చేయండి: నిర్మలకు కాంగ్రెస్ ఎంపీల లేఖ

image

TG: బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన ITIR, IIM, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. AP హామీలను అమలుచేయడంపై అభ్యంతరాల్లేవని, తెలంగాణకు అన్యాయం జరగకూడదని తేల్చిచెప్పారు.

News July 28, 2024

ఫ్రీ జర్నీతో నెలకు రూ.250 కోట్ల భారం.. రేపు సీఎం సమీక్ష

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలుపై తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేసి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీనిపై రేపు సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం APSRTCలో నిత్యం 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారట. పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అమలు చేసే అవకాశం ఉంది.

News July 28, 2024

రౌడీ హీరోకు జోడీగా రుక్మిణీ?

image

రవి కిరణ్ కోలా డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటించబోయే సినిమా ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా ‘సప్త సాగరాలు దాటి’ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ కనిపిస్తారని సమాచారం. ఆమెకు స్క్రిప్ట్ నచ్చడంతో మూవీకి ఓకే చెప్పారని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందట. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.

News July 28, 2024

జిష్ణుదేవ్ వర్మ ఎవరంటే?

image

తెలంగాణ గవర్నర్‌గా <<13722854>>జిష్ణుదేవ్<<>> వర్మను రాష్ట్రపతి నియమించారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో BJPలో చేరారు. రామ జన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2018-2023 వరకు త్రిపురకు డిప్యూటీ CMగా, బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా సేవలందించారు. TG BJP నేత ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా పనిచేస్తుండగా, ఆ రాష్ట్ర నేత ఇక్కడికి గవర్నర్‌గా రావడం విశేషం.

News July 28, 2024

వివాదం: కేరళ బ్యాంకు నివాళుల జాబితాలో ముషారఫ్‌ పేరు

image

కేరళలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అలప్పుళ శాఖ చేసిన ఓ పని కలకలం రేపింది. ఓ కార్యక్రమంలో నివాళులర్పించేందుకు సిద్ధం చేసిన ప్రముఖుల జాబితాలో పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ పేరును చేర్చింది. 25వ కార్గిల్ విజయ దివస్ జరిగిన మరుసటి రోజే.. ఆ యుద్ధానికి కారణమైన ముషారఫ్‌ పేరును లిస్టులో పెట్టడం గమనార్హం. అనుకోకుండా జరిగిందంటూ బ్యాంకు ఓ ప్రకటనలో క్షమాపణలు చెప్పింది. దీనిపై బీజేపీ అలప్పుళలో నిరసన వ్యక్తం చేసింది.

News July 28, 2024

సారీ చెప్పిన ఒలింపిక్ సంఘం

image

పారిస్‌ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భాగంగా సౌత్ కొరియా అథ్లెట్లను నార్త్ కొరియా అథ్లెట్లుగా ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు పరిచయం చేశారు. సెన్ నదిలో సౌత్ కొరియా అథ్లెట్లు పడవలో వెళ్తూ తమ దేశ జెండా ఊపారు. ఈక్రమంలోనే వాళ్లను నార్త్ కొరియా అథ్లెట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ తప్పిదానికి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం క్షమాపణలు చెప్పింది. <<-se>>#Olympics2024<<>>

News July 28, 2024

రూ.వెయ్యి కోట్ల రుణాల కోసం బాండ్ల వేలం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల రుణాల కోసం పలు బాండ్లను వేలానికి పెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నెల 30న వేలం వేయనున్నట్లు పేర్కొంది. మొత్తం 10 రాష్ట్రాల తరఫున రూ.29,500 కోట్ల రుణాల సేకరణకు బాండ్లను వేలం వేస్తున్నట్లు RBI వివరించింది. ఆయా రాష్ట్రాలు సంక్షేమ పథకాల అమలు కోసం బ్యాంకుల వద్ద రుణాలు పొందేందుకు ఇలా బాండ్లను వేలం వేస్తుంటాయి.

News July 28, 2024

ట్రంప్-కమల.. ఒక్క శాతమే ఓట్ల తేడా

image

US అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌కు సొంత పార్టీ నుంచే కాకుండా ప్రజల మద్దతు పెరుగుతోంది. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడు రిపబ్లికన్, డెమోక్రాట్ మధ్య 6% ఓట్ల తేడా ఉండగా, ఇప్పుడది 1 శాతానికి తగ్గినట్లు న్యూయార్క్ టైమ్స్ సర్వే వెల్లడించింది. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత ఆయనకు మద్దతు పెరగగా, ఇప్పుడు హారిస్‌తో గట్టిపోటీ తప్పదని అంచనా.

News July 28, 2024

ఎవరు అధికారంలో ఉన్నా బీసీలకు అన్యాయమే: ఒవైసీ

image

TG: ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు అన్యాయమే జరుగుతోందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చిన్నచూపు చూడటంతోనే బీసీలు కాంగ్రెస్‌ను గెలిపించారని, ఇప్పుడు కాంగ్రెస్ సైతం బీసీలు, మైనారిటీలను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు, మైనారిటీలు ఏకమై ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కులకు ఎంఐఎం అండగా ఉంటుందని అక్బర్ ప్రకటించారు.