news

News October 20, 2024

ఫార్మసీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 92 విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. కాగా రాష్ట్రంలో సుమారు 12 వేల ఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

News October 20, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకోగా, 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.

News October 20, 2024

TG: గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లు ఇవే

image

☞ జీవో 29 రద్దు చేయాలి, పోస్టుల సంఖ్యను పెంచాలి
☞ మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలి
☞ ప్రిలిమ్స్ ఫలితాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి
☞ ప్రామాణిక పుస్తకాలపై స్పష్టత ఇవ్వాలి
☞ కోర్టు కేసులు క్లియర్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి
☞ పరీక్షలు పూర్తయి, భర్తీ ప్రక్రియ వరకూ ఒకే హాల్‌టికెట్ నంబర్ ఉండాలి
☞ HYDతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లోనూ పరీక్షలు నిర్వహించాలి

News October 20, 2024

అధిక బరువుకు, ఊబకాయానికి తేడా ఏంటంటే..

image

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం అధిక బరువు ఉన్న వారందరూ ఊబకాయులు కాదు. ఎక్కువ కొవ్వు పేరుకుపోవడాన్ని అధిక బరువని, అనారోగ్యాన్ని కలుగజేసే స్థాయిలో కొవ్వు ఉండటాన్ని ఊబకాయంగా పిలుస్తారని నిపుణులు వివరిస్తున్నారు. దీన్ని బాడీ మాస్ ఇండెక్స్(BMI)లో కొలుస్తారు. ఇది 25.0 నుంచి 29.9 పాయింట్ల మధ్యలో ఉంటే అధిక బరువుగా, 30.0 పాయింట్లకు పైబడి ఉంటే ఓబేసిటీగా పరిగణిస్తారు.

News October 20, 2024

ఓటింగ్ మెషీన్లను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: ఎలాన్ మస్క్

image

USలోని అన్ని రాష్ట్రాల్లో పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని బిలియనీర్ ఎలాన్ మస్క్ కోరారు. ఓటింగ్ మెషీన్లతో రిగ్గింగ్ చేయొచ్చన్నారు. ‘నేనొక టెక్నాలజిస్ట్. కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల గురించి బాగా తెలుసు. ఓటింగ్ మెషీన్లను సులభంగా హ్యాక్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోనూ EVMలపై పలుపార్టీలు అనుమానం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

News October 20, 2024

సోనూసూద్ మంచి మనసు.. చిన్నారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్

image

సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఖమ్మం(D) చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలికకు చిన్నప్పటి నుంచే గుండె సమస్య ఉంది. ఆపరేషన్‌కు ₹6లక్షలపైగా ఖర్చవుతుందని స్థానిక వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.

News October 20, 2024

ఆఫీసు గొడవలుండేవే.. ఇవాళైనా ఫ్యామిలీతో గడపండి!

image

వారానికి ఎండ్ చెప్పేందుకు వీకెండ్ వచ్చేసింది. ఆరు రోజులుగా శ్రమించిన మీ మెదడు, శరీరానికి కాస్త రిలీఫ్ ఇవ్వండి. ఇవాళ ఎలాంటి శ్రమ తీసుకోకండి. ఎలాంటి ఆలోచనలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా గడపండి. టైంపాస్ కోసం మార్నింగ్ వాక్ చేయండి. ఇళ్లు, కార్, బైక్ శుభ్రం చేసుకోండి. ఇది ఒక వ్యాయామంలా అవుతుంది. భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో సరదాగా గడపండి. ఆఫీసు విషయాలు, మొబైల్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో ముచ్చటించండి.

News October 20, 2024

నా కల నిజమైంది: సర్ఫరాజ్

image

అదిరిపోయే ఇన్నింగ్స్ తరువాత తాను అభిమానించే ప్లేయర్ల నుంచి అభినందనలు రావడంపై యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గంభీర్ సార్ లాంటి పెద్ద ఆటగాళ్లు నేను బాగా ఆడానని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి విరాట్ భయ్యాని చూస్తూ ఆయన్ను అనుసరించేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడటం, డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో నా కల నెరవేరినట్లైంది’ అని తెలిపారు.

News October 20, 2024

టెస్టు జట్టులోకి వచ్చేందుకు శ్రమిస్తున్నా: శ్రేయస్

image

టెస్టు జట్టులోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించేందుకు ఎంతో కష్టపడుతున్నానని అన్నారు. శ్రేయస్ గతేడాది వెన్నునొప్పి నేపథ్యంలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం కోలుకుని రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్నారు. నిన్న MHపై సెంచరీ బాదారు. చాలా కాలం తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ ఆడటం ప్రత్యేకంగా ఉందని, సెంచరీతో రిలీఫ్‌గా ఉందని తెలిపారు.

News October 20, 2024

భారీ భద్రత మధ్య గ్రూప్-1 పరీక్షలు

image

TG: ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 పరీక్షలకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తుండటంతో TGPSC సూచనలతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో ఎగ్జామ్ సెంటర్ వద్ద SI ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. మ.12.30 గంటల నుంచి 1.30 వరకు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతిస్తారు. మ.2 నుంచి సా.5 వరకు పరీక్షలు జరుగుతాయి.