India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఆ దేశ అప్పులను ఎత్తిచూపుతూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. మొత్తం 33 కోట్ల మంది అమెరికన్లతో వడ్డీని విభజించి ప్రతిఒక్కరూ $3,593 చెల్లించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ విషయంపై మరింత చర్చ జరగాలని పేర్కొంటూ దీనిని షేర్ చేశారు. మన డబ్బులన్నీ ఇంట్రెస్టులు కట్టడానికే వెళ్తున్నాయా? అని అమెరికన్లు విమర్శలు చేస్తున్నారు.
AP: మరియమ్మ అనే మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి పోలీసులు ఇవాళ కూడా విచారించనున్నారు. ఈ కేసులో సురేశ్ 78వ నిందితుడిగా ఉన్న సురేశ్‌కు మంగళగిరి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిన్న పోలీసులు ఆయనను విచారించారు. కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌కు బెయిల్ వచ్చినప్పటికీ, ఈ హత్య కేసులో అరెస్ట్ కావడంతో జిల్లా జైలులోనే ఉన్నారు.
ఇండియా మీదుగా ప్రయాణించే విమానాలకు వరుసగా బాంబు <<14395087>>బెదిరింపులు<<>> రావడంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) స్పందించింది. భారత ఆకాశ మార్గం సురక్షితంగా ఉందని, ప్రయాణికులకు ఎలాంటి భయం అవసరం లేదని స్పష్టం చేసింది. బాంబు <<14372371>>బెదిరింపులపై<<>> భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నామని, త్వరలోనే అల్లరి మూకలకు చెక్ పెడతామని BCAS డీజీ జుల్ఫికర్ హసన్ తెలిపారు.
TG: మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి, MD శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న ధర పడిపోవడంతో రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాఫెడ్ తరఫున జగిత్యాల, నిర్మల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో 12 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. కాగా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,225 ఉండగా మార్కెట్లో రూ.2వేలు పలుకుతోంది.
TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలనే డిమాండ్ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది. పరీక్ష వల్ల ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిన్న అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, కొండా సురేఖ చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా <<14399353>>గాయపడిన<<>> బాలిక(17) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్(D) బద్వేల్ సమీపంలో నిన్న ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో బాలిక శరీరం 80 శాతం కాలిపోయింది.
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా చరిత్రే కానుంది. పురుషుల జట్లకు సాధ్యం కాని ఈ ఫీట్‌ను తమ దేశానికి అందించాలని మహిళా ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు. గత టోర్నీలోనూ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా ఈ సారి ట్రోఫీపై కన్నేసింది. మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
AP: అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న సీఎం చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటుండగా ఓ వ్యక్తి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో చంద్రబాబు కూడా ఆ వ్యక్తి కాళ్లను పట్టుకునేందుకు కొంచెం నడుము ఒంచారు. దీంతో అతను కంగుతిన్నాడు. తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కరించాలని, తన కాళ్లకు మొక్కితే తాను అలాగే చేస్తానని ఇటీవల CBN చెప్పిన విషయం తెలిసిందే.
TG: ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు చదివే ప్రైవేట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. వారికి హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. హాజరు మినహాయింపు కోరుకునే విద్యార్థులు నవంబర్ 20వ తేదీలోగా రూ.500 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. రూ.200 ఫైన్ చెల్లించి డిసెంబర్ 18 వరకూ అప్లై చేసుకోవచ్చని పేర్కొంది.
AP: అమరావతికి ప్రతిపాదించిన ₹15,000Cr అప్పులో ప్రపంచ బ్యాంక్, ADB ₹13,600Cr, కేంద్రం ₹1,400Cr ఇవ్వనున్నాయి. ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని, కేంద్రం 9.33 శాతమే భరిస్తుందని సమాచారం. అప్పు కాలపరిమితి 50ఏళ్లు ఉండొచ్చని, డాలర్ విలువకు అనుగుణంగా భారం పెరగనుందని తెలుస్తోంది. అందుకే అంతర్జాతీయ సంస్థల కంటే దేశీయ సంస్థల నుంచి తీసుకునే అప్పులే ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.