India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర గొర్రెలు, మేకలు పెంపకందార్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. 7 నెలలు దాటినా ప్రారంభించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే గొర్రెల పంపిణీ పథకానికి నిధులిచ్చి, ఎప్పటినుంచి ప్రారంభిస్తారో స్పష్టతనివ్వాలని కోరారు.
తమ సంస్థ పేరిట వస్తున్న ఈ-మెయిల్స్ తప్పుడువని మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ క్లారిటీ ఇచ్చింది. కొందరు అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని, ఆ సమాచారాన్ని నమ్మొద్దని ఓ ప్రకటనలో కోరింది. ‘మా అధికారి ఈ-మెయిల్ ఐడీ info@24framesfactory.com కాకుండా వేరే దేని నుంచి మెయిల్స్ వచ్చినా నమ్మొద్దు. ఇలా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేసింది.
TG: రాష్ట్రంలో మరో 463 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) ఉద్యోగాలను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వీరికి గ్రేడ్-4 హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 6,603 గ్రేడ్-4 పోస్టులు ఉండగా ఇప్పటివరకు 4,925 జేపీఎస్‌లను క్రమబద్ధీకరించారు. గ్రేడ్-4గా రెగ్యులర్ చేయడానికి కనీసం నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేయాలని గత ప్రభుత్వం ఖరారు చేసింది.
TG: వచ్చే 90 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 31 వేల కొలువులిచ్చామని గుర్తుచేశారు. ‘గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తున్నాం. మా సర్కారుకు భేషజాలు లేవు. ఖాళీల్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా తొలి రోజు భారత్ రోయింగ్, షూటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ విభాగాల్లో పోటీ పడనుంది. మధ్యాహ్నం గం.12.30కు రోయింగ్, షూటింగ్ ఈవెంట్లతో భారత్ పతకాల వేట ప్రారంభంకానుంది. కాగా ఈరోజు షూటింగ్లో క్వాలిఫికేషన్ రౌండ్లు జరగనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. షూటింగ్ 10m ఎయిర్ రైఫిల్, 10m ఎయిర్ పిస్టల్ విభాగాల్లో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. <<-se>>#Olympics2024<<>>
బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట వేసి మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదనే విమర్శలపై కేంద్రమంత్రి నిర్మల స్పందించారు. ‘గతంలో మాదిరిగానే రాష్ట్రాలకు కేటాయింపులు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. 2014 విభజన చట్టం ప్రకారం APకి నూతన రాజధాని నిర్మాణంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సి ఉంది. పోలవరాన్ని వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
వాయిస్ కాల్స్, డేటా, SMSలకు విడివిడిగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది. వచ్చే నెల 16లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని వినియోగదారులను కోరింది. ప్రస్తుతం వాయిస్, డేటా, SMSలను బండిల్డ్ ప్లాన్ రూపంలో ఇస్తున్నాయి. దీంతో చాలా మంది వాయిస్ కాల్స్, SMSలు మాత్రమే వినియోగించుకుని డేటా వాడట్లేదు. ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఫిర్యాదులు చేస్తున్నారు.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆమె సహ వ్యోమగామితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో చిక్కుకున్నారు. 50 రోజుల క్రితమే ఇద్దరూ భూమికి తిరిగిరావాల్సి ఉండగా, వారిని తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వారు భూమికి ఎప్పుడు, ఎలా వస్తారోనన్న ఆసక్తి నెలకొంది. సమస్య ఉన్నప్పటికీ వ్యోమగాములు సానుకూల దృక్పథంతో ఉన్నారని నాసా తెలిపింది.
అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1900, 1924ల్లో ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్ మళ్లీ వందేళ్ల తర్వాత ఈ పోటీలకు వేదికైంది. ఈసారి పోటీల్లో పురుషులతో దాదాపు సమానంగా మహిళా అథ్లెట్లు ఉండటం విశేషం. అథ్లెట్లలో 5,630 మంది పురుషులు, 5,416 మంది మహిళలు ఉన్నారు. అందుకే దీనిని ఒలింపిక్స్ చరిత్రలో లింగసమానత్వం సాధించిన తొలి టోర్నీగా ఒలింపిక్ కమిటీ పేర్కొంది. <<-se>>#Olympics2024<<>>
ఈ పోటీలకు రూపొందించిన పతకాలకూ ఓ ప్రత్యేకత ఉంది. ఐఫిల్ టవర్ రినోవేషన్ సమయంలో వెలికితీసిన ఇనుమును వీటి తయారీలో వాడారు. ప్రతీ మెడల్లోనూ 18 గ్రాముల ఐఫిల్ టవర్ ఇనుము ఉంటుందట. బోట్లలో అథ్లెట్ల పరేడ్ నిర్వహించడం ఒలింపిక్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ టోర్నీ నిర్వహణ కోసం ఫ్రాన్స్ దాదాపు $10 బిలియన్లు ఖర్చు చేస్తోంది. పారిస్‌లో జరిగిన పోటీల (1900) ద్వారానే భారత్ ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. <<-se>>#Olympics2024<<>>
Sorry, no posts matched your criteria.