news

News October 19, 2024

‘మూసీ’కి డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?: KTR

image

TG: రైతు భరోసా అమలు చేసే వరకూ కాంగ్రెస్‌ను వదిలేది లేదని KTR అన్నారు. ‘కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఇవ్వదన్న KCR మాటలను రేవంత్ సర్కార్ నిజం చేసింది. స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే చేతులేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బుల్లేక సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?’ అని ప్రశ్నించారు. రేపు అన్ని మండలాల్లో ఆందోళనలు చేయాలని BRS శ్రేణులకు పిలుపునిచ్చారు.

News October 19, 2024

నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: మార్పు కావాలనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరుకే ప్రతి నియోజకవర్గానికి 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నొక్కి చెప్పారు. అర్హత ఉంటే ఎలాంటి రికమండేషన్ అవసరం లేదన్నారు. రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

News October 19, 2024

రచిన్, సర్ఫరాజ్‌లను అభినందించిన సచిన్

image

టెస్టులో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్‌లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ‘క్రికెట్‌ మన మూలాలను కలుపుతుంది. బెంగళూరుతో రచిన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడే అతను సెంచరీ చేశారు. పరుగుల లోటులో ఉన్న తన జట్టుకు సర్ఫరాజ్ అండగా నిలుస్తూ సెంచరీ బాదారు. ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లకి మున్ముందు మంచి కాలం ఉంటుంది’ అని తెలిపారు.

News October 19, 2024

బండి సంజయ్‌కు సీఎస్ ఫోన్

image

TG: గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆందోళనకు దిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎస్ శాంతికుమారి ఫోన్ చేశారు. జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించారు. జీవో 29ను రద్దు చేయాలంటూ అభ్యర్థులతో కలిసి సంజయ్‌ సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు.

News October 19, 2024

శరీరం నుంచి గుండెను తీయాలనుకున్నారు.. అంతలోనే!

image

చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కోసి గుండెను తీయాలని చూడగా ఒక్కసారిగా అతను లేచాడు. గతంలో USAలో జరిగిన ఈ ఘటన తాజాగా వైరలవుతోంది. థామస్ అనే 36 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. అవయవాలను చెక్ చేసేందుకు పరీక్ష చేయగా అతనిలో కదలిక, కళ్లలోంచి నీరు రావడం కనిపించింది. బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో వైద్యులు తదుపరి ప్రక్రియ స్టార్ట్ చేయగా గుండె తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి కూర్చున్నాడు.

News October 19, 2024

నా దేవుడు కోహ్లీ ఆశీర్వాదం కోసం వచ్చా: అభిమాని

image

బెంగళూరులో జరుగుతోన్న ఇండియా, న్యూజిలాండ్‌ తొలి టెస్టును చూసేందుకు భారీగా విరాట్ కోహ్లీ అభిమానులు తరలివచ్చారు. తన దేవుడు కోహ్లీ కోసం వచ్చానంటూ ఓ అభిమాని ప్లకార్డుతో కనిపించారు. ‘ఈరోజు నా బర్త్ డే కాబట్టి నా దేవుడు విరాట్ కోహ్లీ ఆశీస్సులు తీసుకునేందుకు ఈ గుడికి వచ్చాను’ అని ప్లకార్డుపై రాసి ఉంది. ఈ ఫొటో వైరలవుతోంది. కాగా, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.

News October 19, 2024

పోలీసులపైకి కుర్చీలు విసిరిన కార్యకర్తలు

image

సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వారు వాటర్ ప్యాకెట్లు, కుర్చీలు విసిరారు. దీంతో లాఠీఛార్జ్ చోటు చేసుకోగా పలువురు గాయపడ్డారు. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఇవాళ హిందూ సంఘాలు సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

News October 19, 2024

జనసేనలోకి ముద్రగడ కూతురు

image

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఇవాళ సా.4 గంటలకు జనసేన పార్టీలో చేరనున్నారు. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆమెకు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆమెతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు నుంచి పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.

News October 19, 2024

మరో 2 గంటల్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే..
కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ

News October 19, 2024

OTD: GOAT విరాట్ రికార్డులు

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇదేరోజున 2023 WCలో BANతో జరిగిన మ్యాచ్‌లో వివిధ రికార్డులు నెలకొల్పారు. ఈ మ్యాచులో విరాట్ 78వ సెంచరీ చేసి అత్యంత వేగంగా 26వేల ఇంటర్నేషనల్ రన్స్ పూర్తిచేశారు. దీంతో ఆయన WCలో వెయ్యి పరుగులు చేసిన మొదటి NO.3 ఇండియన్ బ్యాటర్‌గా నిలిచారు. ICC వైట్‌బాల్ ఈవెంట్‌లలో అత్యధిక రన్స్ & అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డులను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.