India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☛ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
☛ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల కీలక ప్రకటన
☛ TGలో ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు
☛ వనజీవి రామయ్య కన్నుమూత
☛ వక్ఫ్ చట్ట సవరణపై బెంగాల్‌లో అల్లర్లు.. 110 మంది అరెస్ట్
☛ దేశంలో ఉగ్రదాడులకు అవకాశం: నిఘా వర్గాలు
☛ UPI, వాట్సాప్ సేవల్లో అంతరాయం
☛ ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం
☛ IPL: PBKSపై SRH విజయం.. అభిషేక్ శర్మ సెంచరీ
తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40-44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి వడగాలులు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే, ఏప్రిల్ 15-17 మధ్య మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
TG: రాజన్న సిరిసిల్ల(D) చందుర్తిలో ఓ నాలుగో తరగతి విద్యార్థిని పరీక్షలో ఆసక్తికర సమాధానం రాసింది. ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చిన, నచ్చనివి ఏవి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని విద్యార్థిని సమాధానం రాసింది. ఇందుకు సంబంధించిన ఫొటో SMలో వైరల్ అవుతుండగా, నేటి కాలంలో కోడళ్లకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో దీని ద్వారా తెలుస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
IPL: 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో SRH దుమ్మురేపుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 6 సిక్సర్లు, 11 ఫోర్లతో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. మరో ఓపెనర్ హెడ్ (37 బంతుల్లో 66) మెరుపులు మెరిపించి ఔటయ్యారు. SRH విజయానికి మరో 42 బంతుల్లో 71 పరుగులు అవసరం.
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్లు దంచికొడుతున్నారు. అభిషేక్ శర్మ (87*), ట్రావిస్ హెడ్ (49*) ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్‌కు ఓ లైఫ్ రావడంతో రెచ్చిపోయి ఆడుతున్నారు. వీరిద్దరి ధాటికి SRH 10 ఓవర్లకు 143/0 పరుగులు చేసింది. SRH విజయానికి మరో 10 ఓవర్లలో 103 రన్స్ అవసరం. మరి ఎన్ని ఓవర్లలో హైదరాబాద్ టార్గెట్ ఛేజ్ చేస్తుందో కామెంట్ చేయండి.
TG: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పోలీసుల నుంచి అనుమతి పత్రాలు అందుకున్నారు. రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
AP: ఆధార్/రేషన్‌కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ కాకపోవడంతో పలువురికి దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందడం లేదు. మార్చి 31 నాటికి దాదాపు 14వేల మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు అకౌంట్‌లో జమ కాలేదు. దీంతో ప్రజలు ఏజెన్సీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్‌లో దీపం-2 డ్యాష్‌బోర్డును సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
✒ https://epds2.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే దీపం-2 డ్యాష్ బోర్డు కనిపిస్తుంది.
✒ KNOW YOUR DEEPAM2 STATUSపై క్లిక్ చేసి రేషన్ కార్డు లేదా ఎల్పీజీ నంబర్ ఎంటర్ చేయాలి.
✒ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే దీపం-2 ఎలిజిబిలిటీ స్టేటస్, సబ్సిడీ జమ వివరాలు కనిపిస్తాయి.
✒ ఏదైనా సమస్య ఉంటే దానికి గల కారణాలు తెలుస్తాయి.
✒ NOTE: ఈ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చాక ఆప్షన్లు కనిపిస్తాయి.
TG: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 55,418 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 58,868 పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు 55,418 ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య 1.14 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టించినట్లు అవుతుందని అన్నారు.
అమెరికాలో ఉంటున్న వలసదారులకు ముఖ్య గమనిక. లీగల్ వర్క్ లేదా స్టడీ వీసాపై ఉన్నా తప్పనిసరిగా తమ వెంట లీగల్ స్టేటస్ ప్రూఫ్ ఉంచుకోవాల్సిందే. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం యూఎస్ కోర్టుకు నివేదించింది. దీనివల్ల అక్రమ వలసదారులను సులభంగా గుర్తించి, దేశం నుంచి బహిష్కరించవచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. నిన్నటి నుంచే ఈ రూల్ అమల్లోకి వచ్చింది. అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.