India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా మరో 163వ్యాధుల చికిత్సలను చేర్చింది. ఇందులో మోకాలి ఆపరేషన్, ఫిస్టులా, రేడియాలజీ చికిత్సలు, థైరాయిడ్ క్యాన్సర్‌కు సంబంధించిన 7 చికిత్సలు, క్రానిక్ థ్రాంబో ఎంబాలిక్ పల్మనరీ హైపర్ టెన్షన్, వీనో ఆర్టీరియల్ ఎక్స్‌ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజినేషన్, ఇండక్షన్ ఆఫ్ ఫెర్టిలిటీతో పాటు మరికొన్ని చికిత్సలను అదనంగా చేర్చింది. ప్యాకేజీల <<13684511>>ధరలు<<>> పెంచింది.
AP: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేటి నుంచి 4 రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గ మహిళలతో ముఖాముఖి నిర్వహించి, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్‌డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేక శిబిరాలను మరో 2, 3 రోజులు పొడిగించనున్నట్లు సమాచారం.
Jr.NTR, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న ‘వార్-2’ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఆగస్టు 18న ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ మూవీలో కొత్త లుక్‌లో కనిపించనున్న తారక్, ప్రస్తుతం దేవర పార్ట్-1 షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ‘వార్-2’ను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
AP: వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా? లేదా? అనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీనిపై చర్చ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి వీరాంజనేయులు సమాధానం ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం పెంచుతామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
TG: సిద్దిపేటలోని ‘స్టీల్ బ్యాంక్’ను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించడంతో అది వార్తల్లో నిలిచింది. గ్రామాల్లో ప్లాస్టిక్ ప్లేట్లను వాడటంతో చెత్త పోగవుతుందని, అదే సమయంలో పర్యావరణానికి కూడా హాని అని తెలుసుకున్న డీపీవో దేవకీదేవి ప్లాస్టిక్ బదులు స్టీల్ వాడాలని నిర్ణయించారు. వాటి నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. దీనివల్ల నెలకు దాదాపు 28 క్వింటాళ్ల ప్లాస్టిక్ వినియోగం కాకుండా ఆపగలిగారు.
తిరుమల శ్రీవారి అక్టోబర్ నెలకు సంబంధించిన సేవా టోకెన్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉ.11కి శ్రీవాణి ట్రస్టు టికెట్లు, మ.3కి వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను TTD విడుదల చేయనుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 17 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 71,939 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
TG: సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై IAS స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలు వికలాంగులను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఇబ్రహీంపట్నం PSలో ఫిర్యాదు చేశారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని PSలలో, మానవ హక్కుల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
TG: నేడు ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనుంది. దాదాపు 50వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ‘ప్రతి సంవత్సరం మార్చి 31లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇస్తాం. ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో డిసెంబర్ 9లోపు నియామక పత్రాలను పెట్టాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం’ అని సీఎం రేవంత్ గతంలో చెప్పారు.
AP: రాష్ట్రంలో వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఏమాత్రం అలసత్వం వద్దని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, రక్షిత మంచినీటిపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వరద ముంపు గ్రామాల గురించి ఆయన ఆరా తీసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
Sorry, no posts matched your criteria.