news

News October 19, 2024

కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు బ్రేక్?

image

APలో కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు అడ్డంకులు ఎదురువుతున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల విభజన ప్రక్రియ సరిగ్గా జరగడం లేదంటూ కొందరు డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 35 ప్రకారం రేషనలైజేషన్ ప్ర్రక్రియను కొనసాగించడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో షాపుల విభజనను నిలిపేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్తగా 2,774 షాపులు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

News October 19, 2024

నేడు అమరావతి పనుల పునఃప్రారంభం

image

AP: రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11 గంటలకు సీఆర్డీఏ కార్యాలయ పనులను ఆయన ప్రారంభిస్తారు. రూ.160 కోట్లతో ఏడంతస్తుల్లో ఈ ఆఫీసును నిర్మించనున్నారు. కాగా జనవరి నాటికి దాదాపు రూ.49వేల కోట్ల విలువైన వివిధ రకాల పనులకు టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 19, 2024

రెండు సినిమాలకు అక్కినేని అఖిల్ గ్రీన్‌సిగ్నల్?

image

‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత వెండి తెరకు కాస్త బ్రేక్ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పుడు 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే ఓ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం. అలాగే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ డైరెక్షన్‌లో మరో మూవీకి ఆయన ఓకే చెప్పినట్లు టాక్. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి.

News October 19, 2024

ఇంటర్ అమ్మాయి దారుణ హత్య

image

AP: ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. కర్నూలు(D) నగరూరుకు చెందిన అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి రాగా అదే గ్రామానికి చెందిన సన్నీ ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించాలని బెదిరించాడు. యువతి నిరాకరించడంతో పురుగుమందు ఆమె నోట్లో పోసి పరారయ్యాడు. పేరెంట్స్ వచ్చి చూడగా అశ్విని చావుబతుకుల్లో కనిపించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది.

News October 19, 2024

న్యాయం కోసం 312 గంటలుగా జూడాల పోరాటం!

image

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ జూ.డాక్టర్లు చేస్తోన్న నిరాహార దీక్ష 14 రోజులకు చేరుకుంది. వీరికి AIIMS వైద్యులు మద్దతుగా నిలిచారు. ‘మిత్రులారా యువ వైద్యురాలికి న్యాయం చేయాలని 312 గంటలుగా వీరు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. రోజుల తరబడి ఆహారం తీసుకోకుండా వైద్య సోదరుల భద్రత, గౌరవం కోసం పోరాడుతున్నారు. మీరు విశ్రాంతి తీసుకునే ముందు వీరి గురించి ఆలోచించండి’ అని కోరుతున్నారు.

News October 19, 2024

కండక్టర్లకు ఓడీ డ్యూటీలు విరమించుకున్న యాజమాన్యం

image

TG: ఆర్టీసీలో బస్సు కండక్టర్ల కొరత దృష్ట్యా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిపోలు, యూనిట్లలో ఓడీ(అవుట్ ఆఫ్ డిజిగ్నేషన్) డ్యూటీలను విరమించుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కొంత కాలంగా కొందరు కండక్టర్లు డిపోలు, యూనిట్లలో సెక్యూరిటీ డ్యూటీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఆ విధుల నుంచి తప్పించాలని జిల్లాల ఆర్టీసీ అధికారులను యాజమాన్యం ఆదేశించింది.

News October 19, 2024

నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్

image

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా ఇవాళ ఇండియా-A, పాకిస్థాన్-A తలపడనున్నాయి. ఒమన్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులను ఫ్యాన్‌ కోడ్ యాప్‌లో చూడొచ్చు. కాగా భారత-ఏ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తున్నారు. జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్, రమణ్‌దీప్, తిలక్ వర్మ(C), అనూజ్, హృతిక్ షోకీన్, సాయి కిషోర్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్, వైభవ్, నిశాంత్.

News October 19, 2024

హైదరాబాద్‌లో మరో కొత్త జైలు?

image

TG: హైదరాబాద్‌లో మరో కొత్త జైలు ఏర్పాటు చేసేందుకు జైళ్ల శాఖ అధికారులు యోచిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీనిని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీలను చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండటంతో కిక్కిరిసిపోతోంది. 1250 మంది ఖైదీలను ఉంచాల్సిన జైల్లో ఒక్కోసారి 2,000 మందిని ఉంచుతున్నారు. ఆ జైలుపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News October 19, 2024

ఎమ్మెల్యేకు అర్ధరాత్రి మహిళ న్యూడ్ వీడియోకాల్

image

TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ MLAకు న్యూడ్ కాల్ రావడం కలకలం రేపింది. ఈనెల 14న అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని నంబర్ నుంచి వీడియోకాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే ఓ మహిళ నగ్నంగా కనిపించింది. ఆందోళనకు గురైన MLA వెంటనే కాల్ కట్ చేశారు. తనపై కుట్రకు ప్రత్యర్థులే అలా చేశారా? లేక గుర్తుతెలియని వ్యక్తులా? అని అనుమానం వ్యక్తం చేశారు. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, TGCSBలో ఫిర్యాదు చేశారు.

News October 19, 2024

నాగార్జున సాగర్ ఆరు గేట్లు ఎత్తివేత

image

శ్రీశైలం జలాశయం నుంచి 89వేల క్యూసెక్కుల వరద జలాలు నాగార్జున సాగర్‌కు వస్తున్నాయి. దీంతో అధికారులు ఆరు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 48,540 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాల్వలు, ప్రధాన విద్యుత్ కేంద్రం, SLBC, వరద కాల్వ ద్వారా మరో 40వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 589 అడుగుల మేర నీటిమట్టం ఉంది.