India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభాస్ ‘కల్కి2898AD’ మూవీ విడుదలై 4 వారాలవుతున్నా బాక్సాఫీసు వద్ద కాసులవర్షం కురిపిస్తోంది. తాజాగా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో దక్షిణాది సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు RRR పేరిట ఉన్న రికార్డును కల్కి బ్రేక్ చేసింది. హిందీలో RRR రూ.272.78 కోట్లు వసూలు చేయగా, 4 వారాల్లోనే కల్కి రూ.275.9 కోట్లు సాధించింది. బాహుబలి-2 రూ.511 కోట్లు, KGF-2 రూ.435 కోట్లతో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.
AP: కేంద్ర సహకారంతో రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధిద్దామని బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఏపీకి అన్ని విధాలా సహకారానికి కేంద్రం సిద్ధంగా ఉంది. నిధుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదు. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా పట్టించుకునే వారు లేరు’ అని అన్నారు.
మంచు విష్ణు టైటిల్ రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా నుంచి శరత్ కుమార్ న్యూ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కోయలు చీఫ్ నాథనాథుడిగా ఆయన కనిపించనున్నట్లు పేర్కొంది. ఆయన బాణాలు సంధించడంలో దిట్ట అని తెలిపింది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.
పెరుగుతున్న కార్మిక శక్తికి తగినట్టుగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. చివరి ఆరేళ్లలో దేశీయ కార్మిక సూచీలు మెరుగయ్యాయని వెల్లడించింది. 2022-23లో నిరుద్యోగ రేటు 3.2 శాతానికి తగ్గిందని తెలిపింది. ఏఐ వల్ల ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొందని పేర్కొంది. లో, సెమీ, హై స్కిల్డ్ ఉద్యోగులపై ప్రభావం పడుతుందని వెల్లడించింది.
AP: కేవలం 50 రోజుల్లోనే ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని జగన్ ట్వీట్ చేశారు. ‘ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉంది. కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. మైక్ ఇస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడతామని భయం. అందుకే ప్రతిపక్ష పార్టీని, నాయకుడిని గుర్తించడం లేదు’ అని విమర్శించారు.
బెంగళూరులో ఓ మైక్రోసాప్ట్ ఇంజినీర్ Namma Yatri యాప్ ఆటోడ్రైవర్ అవతారమెత్తాడు. వీకెండ్స్‌లో ఎక్స్‌ట్రా సంపాదన కోసం కాదు.. ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకట. ఇతరులతో మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడట. ఆ ఆటో ఎక్కిన ఓ నెటిజన్‌కు అతడు ఈ విషయాన్ని చెప్పగా.. దాన్ని నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బెంగళూరులో చాలా మంది ఉద్యోగులు ఇలా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
AP: గుంటూరులో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ MLA మద్దాలి గిరి రాజీనామా చేశారు. ఈ మేరకు YCP అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ కేటాయించలేదు.
AP: EAPCET ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ జులై 23 నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులు పూర్తి చేయాలి. 23 నుంచి 26 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. 24 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 27న ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. 30న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 3లోపు విద్యార్థులు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
‘కాంగ్రెస్ అంటేనే కరవు’.. ‘చంద్రబాబు ఉంటే వర్షాలే పడవు’ ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాల నుంచి తరచూ వింటుంటాం. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. TDP, INC అధికారం చేపట్టిన తొలి సీజన్‌లోనే వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణా, గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు నిండుతున్నాయి. వాగులు పొంగుతున్నాయి. దీంతో ఆరోపణలకు సమాధానమిదే అంటూ TDP, INC కౌంటర్ ఇస్తున్నాయి.
TG: దివ్యాంగులపై స్మితా సభర్వాల్ చేసిన <<13679127>>వ్యాఖ్యలు<<>> సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేయకుండా గ్రామపంచాయతీల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను పాటించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.